27 July  2024

భూమిపై మరణం లేని జీవి  ఏంటో తెలుసా.? 

ఈ సృష్టిలో మరణం లేని జీవి ఏదైనా ఉందా అంటే. అది జెల్లీ ఫిష్‌. Turritopsis dohrnii అనే శాస్త్రీయ నామంతో కూడిన ఈ జెల్లీ ఫిష్‌కు అసలు మరణం అనేదే లేదు.

వినడానికి వింతంగా ఉన్నా ఇది నిజం. ఈ జీవికి అసలు అంతం అనేదే లేదని పరిశోధకులు చెబుతుంటారు. అయితే జెల్లీ ఫిష్‌ వయసు ఎంత అనే విషయంపై ఇప్పటి వరకు పరిశోధకులు కూడా ఓ అంచనాకు రాలేకపోయారు

ఇంతకీ ఈ జీవి ప్రత్యేకత ఏంటంటే. జెల్లీ ఫిష్‌ పరిపక్వం చెందగానే మళ్లీ తిరిగి యవ్వనం లేదా బాల్యంలోకి దానంతట అదే వెళ్తుంది. దీంతో ఈ జీవికి అసలు మరణం ఉండదు.

అంటే వృద్ధాప్యంలోకి చేరగానే మళ్లీ యవ్వనంలోకి వస్తుంది. అలా మళ్లీ పరిపక్వం చెందుతూ తన జీవితకాలాన్ని పొడగించుకుంటూ వెళ్తుంది.

అందుకే జీవ శాస్త్రపరంగా ఈ జీవికి మరణం లేదని పరిశోధకులు చెబుతున్నారు. ఈ లక్షణమే ఈ జీవిని మరణం లేని జీవిగా మారేలా చేశాయని పరిశోధకులు చెబుతున్నారు.

పరిశోధకుల ప్రకారం.. జెల్ఫీ ఫిష్‌లు తమకు ఏదైనా ప్రమాదం జరిగినట్లు అనిపించినా, అనారోగ్యంగా భావించినా వెంటనే పాలిప్‌ స్థితికి వెళ్లిపోతాయి. పాలిప్‌ దశను దాటుకొని మళ్లీ జీవితాన్ని తిరిగి ప్రారంభిస్తుంది.

అయితే జెల్లీ ఫిష్‌కు నిజంగానే మరణం లేదా అన్న దానిపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఒకవేళ జెల్లీ ఫిష్‌ను మరో పెద్ద చేప ఏదైనా మొత్తంగా మింగేస్తే అవి చనిపోతాయని. వృద్ధాప్యంతో మాత్రం వాటికి మరణం ఉండదని చెబుతున్నారు.