వాట్సాప్‌ డౌన్‌.. ఆందోళన చెందిన యూజర్లు..!

| Edited By:

Jul 15, 2020 | 6:16 AM

ప్రముఖ సోషల్ మీడియా యాప్ వాట్సాప్‌లో బుధవారం తెల్లవారు జామున సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో ఒక్కసారిగా యాప్ అప్లికేషన్ ఓపెన్ కాలేదు. దీంతో వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇది..

వాట్సాప్‌ డౌన్‌.. ఆందోళన చెందిన యూజర్లు..!
Follow us on

ప్రముఖ సోషల్ మీడియా యాప్ వాట్సాప్‌లో బుధవారం తెల్లవారు జామున సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో ఒక్కసారిగా యాప్ అప్లికేషన్ ఓపెన్ కాలేదు. దీంతో వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇది ప్రపంచ వ్యాప్తంగా ఈ సమస్య తలెత్తినట్లు సమాచారం. భారత కాలమాన ప్రకారం తెల్లవారు జామున 1.32 గంటలకు వాట్సాప్‌ సర్వీసులో సమస్య తలెత్తింది. ఒక్కసారిగా యాప్ ఓపెన్ కాకపోవడంతో.. పలువురు కస్టమర్లు ఫోన్ రీస్టార్ట్ చేసి ప్రయత్నించారు. మరికొందరు అప్లికేషన్ అన్‌ ఇన్‌స్టాల్‌ చేసి.. ఆ తర్వాత తిరిగి ఇన్‌స్టాల్‌ చేసి కూడా ప్రయత్నించినప్పటికీ.. వాట్సాప్‌ అప్లికేషన్ మాత్రం ఓపెన్ కాలేదని కొందరు యూజర్లు ట్విట్టర్‌ ఖాతాలో పోస్ట్ చేశారు. అయితే కంపెనీ మాత్రం ఈ సమస్యపై స్పందించలేదు. కాసేపటి తర్వాత తిరిగి యథావిధిగా సర్వీసు ప్రారంభమైంది. అయితే వాట్సాప్‌ కస్టమర్లు ఎదుర్కొన్న సమస్యలను ఇతర సోషల్ మీడియా యాప్‌ల ద్వారా తెలియజేశారు. ఇక ట్విట్టర్‌లో వాట్సాప్‌ డౌన్
అంటూ హ్యాష్ ట్యాగ్‌ ట్రెండ్ చేశారు నెటిజన్లు. అయితే గత ఏడాది జనవరిలో కూడా ఇలాంటి సమస్య తలెత్తినట్లు తెలుస్తోంది.