వాట్సాప్ ఉపయోగిస్తున్నప్పుడు చిన్న పొరపాటుతో కూడా మీ ఖాతాను నిషేధించవచ్చు. ప్లాట్‌ఫారమ్‌లో వినియోగదారులు సురక్షితంగా ఉన్నారని నిర్ధారించడానికి, కంపెనీ ప్రతి నెలా లక్షలాది వాట్సాప్ అకౌంట్లపై చర్యలు చేపడుతోంది. వెంటనే వాటిని నిషేధిస్తుంది. వాట్సాప్ ఖాతాలపై నిషేధం విధించేందుకు ఎన్నో కారణాలు ఉంటాయి. వినియోగదారులు కొన్ని తప్పులు చేయడం కారణంగా కంపెనీ కఠిన చర్యలు తీసుకుంటుంది. వాట్సాప్ తన అధికారిక సైట్‌లోని FAQ విభాగంలో కంపెనీ వినియోగదారుల ఖాతాలను ఎందుకు బ్లాక్ చేస్తుందో స్పష్టం చేసింది.
ఇది కూడా చదవండి: TV Tariff Plan: టీవీ ఛానళ్లు చూసేవారికి షాకింగ్.. పెరగనున్న ధరలు.. ప్రభుత్వం కొత్త నిబంధనలు!
ఈ తప్పులు చేయకుండా ఉండండి:
మీరు ఒక వ్యక్తి అనుమతి లేకుండా వాట్సాప్‌లో గ్రూప్‌లో జోడించిన సమయంలో సదరు వ్యక్తి ఫిర్యాదు చేస్తే మీ అకౌంట్ క్లోజ్ చేయవచ్చు. అంతేకాకుండా గ్రూపుల్లో అసభ్యకరమైన సందేశాలు పంపినా వాట్సాప్ చర్యలు చేపడుతుంది. మీరు కంపెనీ నిబంధనలను ఉల్లంఘిస్తే, మీ అకౌంట్‌ను నిషేధించవచ్చు. ఒక వ్యక్తి సమాజంలో విద్వేషాన్ని వ్యాపింపజేసే సందేశాలు పార్వర్డ్ చేసినా, వాట్సాప్ ద్వారా అసభ్యకరమైన విషయాలను పంచుకుంటే, ఆ వ్యక్తి ఖాతాను కూడా నిషేధించవచ్చు.
WhatsApp Account Banned Solution: : ఈ విధంగా అకౌంట్ రికవర్:
వాట్సాప్ తమ ఖాతాను పొరపాటున నిషేధించిందని భావిస్తే, సదరు వాట్సాప్ కంపెనీకి తెలియజేయవచ్చు. తర్వాత మీరు ఎలాంటి తప్పు చేయలేదని తెలితే వాట్సాప్‌ను అన్‌బ్లాక్ చేస్తుంది. https://www.whatsapp.com/contact/?subject=messengerకు వెళ్లి మీ సందేశాన్ని రాసి కంపెనీకి అభ్యర్థనను పంపండి. దీనిని పరిశీలించి వాట్సాప్ తిరిగి అన్‌బ్లాక్ చేస్తుంది.
అభ్యర్థనను సమర్పించే ముందు, మీరు ఇమెయిల్, మొబైల్ నంబర్, WhatsApp (iPhone, వెబ్, Android లేదా డెస్క్‌టాప్) ఉపయోగించే పద్ధతిని అందించి, మీ సందేశాన్ని రాయాల్సి ఉంటుందని గుర్తుంచుకోండి. కంపెనీ అభ్యర్థనను స్వీకరించిన తర్వాత మీ ఫిర్యాదు సమీక్షిస్తుంది. పొరపాటున ఖాతా నిషేధించినట్లు కంపెనీ నిజంగా భావిస్తే, మీ ఖాతాను అన్‌లాక్ చేస్తుంది.
ఇది కూడా చదవండి: Dhanteras 2024: మీరు బంగారం కొంటున్నారా? పాన్, ఆధార్ ఇవ్వాల్సిందే.. ఈ నిబంధన ఎందుకు?
మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి