Digital Cloning: ఇదేం ఏఐ టెక్నాలజీరా బాబు..! డిజిటల్ క్లోనింగ్ ద్వారా ఆ సమస్యలకు చెక్

|

Apr 19, 2024 | 4:15 PM

డెల్‌ఫీ ఏఐ అనే కంపెనీ వ్యక్తులు వారి డిజిటల్ క్లోన్‌లను సృష్టించేలా సాయం చేస్తోంది. ఇది ఏఐ- పవర్డ్ డిజిటల్ క్లోనింగ్ ప్లాట్‌ఫారమ్. ఇది జూమ్ కాల్‌లకు హాజరు కావడం వంటి పనులను నిర్వహించేలా వర్చువల్ ట్విన్‌ను సృష్టించడానికి వినియోగదారులను అనుమతిస్తుంది. ఈ క్లోన్ మీలా కనిపించడమే కాకుండా మీలాగే ఆలోచించగలదు, మాట్లాడగలదు. మీ ఆలోచనా విధానాలు, ప్రసంగాన్ని అనుకరించే మోడల్‌ను రూపొందించడానికి డెల్ఫీ పాడ్‌క్యాస్ట్‌లు, వీడియోలు, పీడీఎఫ్‌ల వంటి వివిధ వనరుల నుండి డేటాను ఉపయోగిస్తుంది.

Digital Cloning: ఇదేం ఏఐ టెక్నాలజీరా బాబు..! డిజిటల్ క్లోనింగ్ ద్వారా ఆ సమస్యలకు చెక్
Digital Cloning
Follow us on

టెక్నాలజీ రంగంలో ఇటీవల కాలంలో ఏఐ సరికొత్త ఆవిష్కరణలకు కారణమం అవుతుంది. డెల్‌ఫీ ఏఐ అనే కంపెనీ వ్యక్తులు వారి డిజిటల్ క్లోన్‌లను సృష్టించేలా సాయం చేస్తోంది. ఇది ఏఐ- పవర్డ్ డిజిటల్ క్లోనింగ్ ప్లాట్‌ఫారమ్. ఇది జూమ్ కాల్‌లకు హాజరు కావడం వంటి పనులను నిర్వహించేలా వర్చువల్ ట్విన్‌ను సృష్టించడానికి వినియోగదారులను అనుమతిస్తుంది. ఈ క్లోన్ మీలా కనిపించడమే కాకుండా మీలాగే ఆలోచించగలదు, మాట్లాడగలదు. మీ ఆలోచనా విధానాలు, ప్రసంగాన్ని అనుకరించే మోడల్‌ను రూపొందించడానికి డెల్ఫీ పాడ్‌క్యాస్ట్‌లు, వీడియోలు, పీడీఎఫ్‌ల వంటి వివిధ వనరుల నుండి డేటాను ఉపయోగిస్తుంది. ఈ ప్లాట్‌ఫారమ్‌లో డిజిటల్ క్లోన్ లేదా డిజిటల్ ట్విన్‌ను సృష్టించే ఈ ప్రక్రియకు గంట సమయం పట్టవచ్చు. ఈ నేపథ్యంలో డిజిటల్ క్లోనింగ్ గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం. 

డిజిటల్ క్లోనింగ్ అంటే?

డిజిటల్ క్లోనింగ్ అనేది కృత్రిమ మేధస్సు (ఏఐ), మెషిన్ లెర్నింగ్ మరియు కంప్యూటర్ గ్రాఫిక్స్ వంటి అధునాతన సాంకేతికతలను ఉపయోగించి ఒక వ్యక్తి, వస్తువు లేదా సంస్థకు సంబంధించిన డిజిటల్ ప్రతిరూపం లేదా నకిలీని సృష్టించే ప్రక్రియను సూచిస్తుంది. డిజిటల్ క్లోనింగ్ వీటిని కలిగి ఉంటుంది:

  • 3డీ మోడలింగ్, యానిమేషన్ అంటే ఒక వ్యక్తి లేదా వస్తువుకు సంబంధించిన డిజిటల్ మోడల్‌ను సృష్టించడం, తారుమారు చేయడంతో పాటు యానిమేషన్‌ను అనుమతిస్తుంది.
  • డీప్‌ఫేక్ టెక్నాలజీ అంటే వీడియోలు లేదా చిత్రాలలో ఒక వ్యక్తికు సంబంధించిన ముఖం లేదా శరీరాన్ని డిజిటల్ డూప్లికేట్‌తో భర్తీ చేయవచ్చు. 
  • వర్చువల్ అవతార్‌లు అంటే వర్చువల్ రియాలిటీ, గేమింగ్ లేదా సోషల్ మీడియాలో ఉపయోగం కోసం వ్యక్తుల డిజిటల్ ప్రాతినిధ్యాలను సృష్టించవచ్చు. 
  • డిజిటల్ రిప్లెకా అంటే వ్యక్తికు సంబంధించిన అనుకరణ, పరీక్ష, విశ్లేషణ కోసం భౌతిక వస్తువులు, వ్యవస్థలు లేదా ప్రక్రియల వర్చువల్ ప్రతిరూపాలను సృష్టించవచ్చు. 

డెల్ఫీ ఏఐ సహ వ్యవస్థాపకుడు, సీఈఓ దారా లాడ్జెవార్డియన్  ఈ ఆవిష్కరణ గురించి మాట్లాడుతూ ప్రపంచం గురించి మీరు ఎలా ఆలోచిస్తారో క్లోన్ నేర్చుకుంటుంది. మీ క్లోన్ మీకు ఎంతవరకు ప్రాతినిధ్యం వహిస్తుందో చూపించడానికి మా వద్ద సంసిద్ధత స్కోర్ ఉందని పేర్కొన్నారు. అదనంగా వినియోగదారులు వారి వాయిస్ డేటాను అప్‌లోడ్ చేయవచ్చు మీ ప్రసంగ విధానాలపై క్లోన్‌కు శిక్షణ ఇవ్వచ్చని వివరించారు. డెల్ఫీ ఏఐ సాధారణ వినియోగదారుల కోసం ఉచిత సంస్కరణను అందిస్తుంది. అదనంగా వినియోగదారులు ఎంచుకున్న ఫీచర్‌లను బట్టి 29 డాలర్ల నుంచి 399 డాలర్ల వరకు చెల్లింపులతో నెలవారీ సభ్యత్వం ఉంటుంది. 

ఇవి కూడా చదవండి

డెల్ఫీ ఏఐ ప్లాట్‌ఫారమ్ ఇప్పటికే క్లోనింగ్ కోసం వినియోగదారులను పొందుతుండగా మే చివరి నాటికి వీడియో కాలింగ్ కార్యాచరణను విడుదల చేయడం ద్వారా ఇది ఒక అడుగు ముందుకు వేస్తోంది. మీ కోసం ప్రాతినిధ్యం వహించడానికి అలాగే మీ ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి, సమాచారాన్ని సేకరించడానికి జూమ్ లేదా గూగుల్‌లో మీటింగ్‌లకు వారి క్లోన్‌ను పంపడానికి ఇది వినియోగదారులను అనుమతిస్తుంది.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..