Air Conditioner: వేసవిలో మీరు ఇలాంటి తప్పులు చేస్తే మీ గదిలో ఏసీ కూలింగ్‌ అస్సలు ఉండదు..!

|

May 24, 2022 | 10:35 AM

Air Conditioner: భారతదేశంలోని కొన్ని నగరాల్లో వేడి అతిగా ఉంటుంది. అయితే చాలా నగరాల్లో వర్షం తర్వాత తేమతో కూడిన వాతావరణం ఉంటుంది. ఈ రెండు రకాల సమస్యలను నివారించడానికి..

Air Conditioner: వేసవిలో మీరు ఇలాంటి తప్పులు చేస్తే మీ గదిలో ఏసీ కూలింగ్‌ అస్సలు ఉండదు..!
Follow us on

Air Conditioner: భారతదేశంలోని కొన్ని నగరాల్లో వేడి అతిగా ఉంటుంది. అయితే చాలా నగరాల్లో వర్షం తర్వాత తేమతో కూడిన వాతావరణం ఉంటుంది. ఈ రెండు రకాల సమస్యలను నివారించడానికి ప్రజలు ఎయిర్ కండిషనర్లను వాడుతుంటారు. కానీ చాలా మంది తరచుగా ఏసీ ఆన్ చేసిన తర్వాత కొన్ని పొరపాట్లు చేస్తుంటారు. ఇలాంటి పొరపాట్లు కారణంగా కూలింగ్‌ ఉండదు. ఏసీ వాడేవారు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.  అందుకే AC రన్ చేసిన తర్వాత ఏ 5 చిట్కాలు పాటించినట్లయితే మంచి కూలింగ్‌ వస్తుంది.

  1. తలుపులు, కిటికీలు మూసి ఉంచండి: AC కూలింగ్‌ ఆస్వాదించడానికి ఎయిర్ కండీషనర్‌ను ఆన్ చేసిన తర్వాత కిటికీలు, తలుపులను మూసివేయాలి. తద్వారా గది లోపల మంచి కూలింగ్‌ ఏర్పడుతుంది.
  2. ఎగ్జాస్ట్ ఆఫ్ చేయండి : AC ఆన్ చేసిన తర్వాత గదిలో లేదా డైనింగ్ హాల్‌లో ఉన్న ఎగ్జాస్ట్ ఫ్యాన్‌ను ఆఫ్ చేయండి. లేదంటే ఏసీ కూలింగ్‌ను బయటకు లాగేసుకుంటుంది.
  3. ఫ్యాన్ ఆన్ చేయండి: AC ఆన్ చేసిన తర్వాత తమ ఫ్యాన్‌ను కూడా ఆఫ్‌ చేయాలి.తద్వారా ఎయిర్ కండిషనర్ల గాలి గది అంతటా వ్యాపిస్తుంది. గదిలో ఉండే మూలమూలనా కూలింగ్‌ ఏర్పడుతుంది.
  4. AC ఫిల్టర్‌లను ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచండి: AC ఫిల్టర్‌లను ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచండి. ఇది మంచి ఫ్యాన్ స్పీడ్, మంచి కూలింగ్‌ని ఇస్తుంది. ఫిల్టర్లు చాలా మురికిగా ఉంటే అది ఏసీలో లీకేజీ సమస్యలకు దారి తీస్తుంది.
  5. ఇవి కూడా చదవండి
  6. రెగ్యులర్ సర్వీస్‌ను పొందుతూ ఉండండి: ఎప్పటికప్పుడు AC సర్వీస్‌ను చేసుకోండి. మీరు ఇలా చేయకపోతే ACలో లీకేజీ సమస్య ఉండవచ్చు. చాలా AC లలో అది కూలింగ్ కాయిల్‌కి లీక్ అవుతుంది. దీని ధర 5 వేల రూపాయలు. అందుకే ఎప్పటికప్పుడు ఏసీ గురించి పట్టించుకోవడం మంచిది.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి