వామ్మో..! వివో వీ80లో ఇన్ని ఫీచర్లా? 100x జూమ్, ZEISS కెమెరాలు, భారీ బ్యాటరీ మరెన్నో

ప్రీమియం స్మార్ట్‌ఫోన్ విభాగంలో vivo కొత్త V80ను భారత మార్కెట్లో విడుదల చేసింది. మొబైల్ కంటెంట్ క్రియేటర్లను దృష్టిలో పెట్టుకుని రూపొందించిన ఈ ఫోన్‌లో ZEISS కెమెరాలు, అధునాతన AI ఫీచర్లు, 144Hz AMOLED డిస్‌ప్లే, భారీ బ్యాటరీ వంటి ప్రత్యేకతలు ఉన్నాయి. IP69 రేటింగ్ కూడా లభించడం దీని మరో ప్రత్యేకత.

వామ్మో..! వివో వీ80లో ఇన్ని ఫీచర్లా? 100x జూమ్, ZEISS కెమెరాలు, భారీ బ్యాటరీ మరెన్నో
Vivo V80

Updated on: Oct 08, 2026 | 7:37 AM

కెమెరా, బ్యాటరీ, డిస్‌ప్లే విషయంలో మెరుగైన అనుభవాన్ని కోరుకునే వారికి vivo V80 ఆకట్టుకునే ఫీచర్లను అందిస్తోంది. 50MP కెమెరాలు, 3x ఆప్టికల్ జూమ్, 4K వీడియో రికార్డింగ్, 90W ఫాస్ట్ ఛార్జింగ్ వంటి సదుపాయాలతో వచ్చిన ఈ ఫోన్ ధర రూ.62,999 నుంచి ప్రారంభమవుతోంది.

ZEISS కెమెరాలు..

vivo V80లో ZEISS సహకారంతో ట్రిపుల్ కెమెరా వ్యవస్థను అందించారు. ఇందులో 50MP Sony LYTIA-700V ప్రధాన కెమెరా, 8MP అల్ట్రా-వైడ్ కెమెరా, 50MP Sony IMX882 పెరిస్కోప్ టెలిఫోటో కెమెరా ఉన్నాయి. OISతో కూడిన ప్రధాన కెమెరా ఉండగా, టెలిఫోటో కెమెరా 3x ఆప్టికల్ జూమ్, 100x డిజిటల్ జూమ్‌కు మద్దతు ఇస్తుంది. ముందు భాగంలో 50MP ZEISS సెల్ఫీ కెమెరా ఉంది.

4K వీడియోను 60fps వరకు రికార్డ్ చేయవచ్చు. AI Creative Cameraలో 30కి పైగా విజువల్ స్టైల్స్ ఉన్నాయి. AI Retouch ద్వారా ఫొటోల్లో అనవసరమైన వస్తువులను తొలగించవచ్చు. 6.59 అంగుళాల 1.5K AMOLED డిస్‌ప్లే 2750×1260 పిక్సెల్స్ రిజల్యూషన్, 144Hz రిఫ్రెష్ రేట్, HDR10+తో వస్తుంది. గరిష్ఠంగా 5,000 nits బ్రైట్‌నెస్ అందిస్తుంది.

7,200mAh బ్యాటరీ

పనితీరు కోసం Snapdragon 7 Gen 4 ప్రాసెసర్, 8GB RAMను అందించారు. 128GB, 256GB, 512GB స్టోరేజ్ ఎంపికలు ఉన్నాయి. 7,200mAh బ్యాటరీకి 90W FlashCharge సపోర్ట్ ఉంది. ఫోన్ 7.69mm మందంతో 203 గ్రాముల బరువు కలిగి ఉంది. IP68, IP69 రేటింగ్స్, స్టీరియో స్పీకర్లు, ఇన్-డిస్‌ప్లే అల్ట్రాసోనిక్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్ ఉన్నాయి. OriginOS 7తో వచ్చే తొలి V-సిరీస్ ఫోన్ ఇదే. ఆరు సంవత్సరాల సెక్యూరిటీ అప్‌డేట్స్ అందిస్తామని కంపెనీ తెలిపింది.

ధర విషయానికి వస్తే 8GB+128GB ధర రూ.62,999, 8GB+256GB ధర రూ.69,999, 8GB+512GB ధర రూ.79,999. Sunrise Anthem, Horizon Blue, Stellar Black రంగుల్లో లభిస్తుంది. అక్టోబర్ 13 నుంచి విక్రయాలు ప్రారంభం కానున్నాయి. Amazon, Flipkart, vivo స్టోర్‌లలో కొనుగోలు చేయవచ్చు.

Loading...
Unable to load recommendations.
Follow Us