
ప్రముఖ సోషల్ మీడియా యాప్ అయిన ట్విట్టర్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ యాప్‌ను దాదాపు అన్ని దేశాల ప్రముఖులు ఉపయోగిస్తుంటారు. అయితే అందులో అమెరికా అధ్యక్ష పదవి పోటీలో ఉన్న జోయ్ బిడెన్, టెస్లా సీఈవో ఎలాన్ మస్క్, మైక్రోసాఫ్ట్ కో ఫౌండర్ బిల్ గేట్స్ వంటి వారు కూడా వీటిని రెగ్యులర్‌గా యూజ్ చేస్తుంటారు. అయితే బుధవారం నాడు వీరి ట్విట్టర్ ఖాతాలు హ్యాక్ అయ్యాయి. వీటిని క్రిప్టోకరెన్సీకి చెందిన స్కామర్స్ హ్యాక్ చేసినట్లు యూఎస్ మీడియా పేర్కొంది. వెంటనే అప్రమత్తమైన వీరు.. ట్విట్టర్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో వెంటనే రెస్పాండ్ అయిన ట్విట్టర్.. సెక్యూరిటీ పరంగా ఎలాంటి ఇబ్బంది లేదని.. అయితే వీరి అకౌంట్లు ఎలా హ్యాక్ అయ్యాయన్న దానిపై ఇన్వెస్టిగేషన్ చేస్తున్నామని ట్విట్టర్ పేర్కొంది. దీనిపై పూర్తి సమాచారాన్ని త్వరలోనే తెలియపరుస్తామని తెలిపింది.