యాపిల్ వాచ్ 7.. ఈ వాచ్ లో 41ఎంఎంతో పెద్ద స్క్రీన్ ఉంటుంది. ఇది మిమ్మల్ని మీ స్నేహితులతో కనెక్ట్ చేసి ఉంచడంతో పాటు వారి హెల్త్, ఫిట్ నెస్ ను కూడా ట్రాక్ చేస్తుంది. ఇది క్రాక్ రిసిస్టెంట్ తో పాటు ఐపీ6ఎక్స్ డస్ట్ రెసిస్టెన్స్ తో వస్తుంది. అలాగే స్విమ్ ప్రూఫ్ గా కూడా ఉంటుంది. దీని ధర అమెజాన్ ప్లాట్ ఫారంపై రూ. 39,999గా ఉంది.
ప్లే ఫిట్ డయల్.. ఈ వాచ్ మీ స్నేహితుని ఫిట్ నెస్ ట్రాక్ చేయడానికి బెస్ట్ చాయిస్. దీనిలో హార్ట్ రేట్ మోనిటర్, బ్లడ్ ఆక్సిజన్ సెన్సార్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇది దుమ్ము, నీటి నిరోధకతను కలిగి ఉంటుంది. ఐపీఎస్ డిస్ ప్లే తో ఇది వస్తోంది. దీనిలో బ్యాటరీ ఐదు రోజుల పాటు వస్తుంది. అమెజాన్ లో దీని ధర రూ. 3,294గా ఉంది.
శామ్సంగ్ గేలాక్సీ వాచ్ 4.. దీనిలో హెల్త్ మోనిటరింగ్ కోసం అడ్వాన్స్ డ్ ఫీచర్లు ఉన్నాయి. స్లీప్ ట్రాకింగ్, మహిళల పీరియడ్స ట్రాకింగ్ తో పాటు ఫిట్ నెస్ కోసం 90 రకాల వర్కౌట్లు ఇన్ బిల్ట్ గా వస్తున్నాయి. అమెజాన్ లో దీని ధర రూ. 11,990గా ఉంది.
ఫాజిల్ జెన్ 5.. ఈ స్మార్ట్ వాచ్ వేర్ ఓఎస్ కంపాక్టబులిటీతో వస్తుంది. ఇది ఆండ్రాయిడ్, ఐఓఎస్ డివైజ్ లలో పనిచేస్తుంది. దీనిలో అనేక రకాల కస్టమైజ్డ్ వాచ్ ఫేసెస్ ఉంటాయి. వివిధ రకాల యాప్స్ కి సపోర్టు చేస్తుంది.
గార్మిన్ వెనూ 2.. ఈ వాచ్ లో అత్యాధునిక ఫీచర్లు ఉన్నాయి. హెల్త్ స్నాప్ షాట్, బాడీ బ్యాటరీ ఎనర్జీ లెవెల్స్, స్లీప్ స్కోర్, ఫిట్ నెస్ ఏజ్, స్ట్రెస్ ట్రాకింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. వినియోగదారులు 650 పాటలను వరకూ డౌన్ లోడ్ చేసుకొని స్టోర్ చేసుకోవవచ్చు. అమోల్డ్ డిస్ ప్లే ఉంటుంది. దీని ధర రూ. 39,990గా ఉంది.