Best 50 Inch Smart TVs: స్టన్నింగ్ పిక్చర్ క్వాలిటీ.. అదిరే సౌండింగ్.. మార్కెట్లో బెస్ట్ 50 అంగుళాల స్మార్ట్ టీవీలు ఇవే..

ఎవరూ చిన్న స్క్రీన్ టీవీలను ఇష్టపడటం లేదు. 43, 50, 55 అంగుళాలను ఎక్కువగా ప్రిఫర్ చేస్తున్నారు. దాంతో పాటు దాల్బీ అట్మోస్ వంటి సౌండింగ్ ఫీచర్లతో ఉన్న వాటిని కొనుగోలు చేస్తున్నారు. ఎందుకంటే ఇంట్లోనే థియేటర్ అనుభవాన్ని ఆస్వాదించేలా చూసుకొంటున్నారు. మీరు కూడా మంచి పిక్చర్ క్లారిటీ, ఆడియో, ఫీచర్లు ఉన్న టీవీ కొనుగోలు చేయాలని భావిస్తున్నారా? అయితే ఇదే మీకు బెస్ట్ లిస్ట్.

Best 50 Inch Smart TVs: స్టన్నింగ్ పిక్చర్ క్వాలిటీ.. అదిరే సౌండింగ్.. మార్కెట్లో బెస్ట్ 50 అంగుళాల స్మార్ట్ టీవీలు ఇవే..
Sony Bravia 50 Inch Smart Tv
Follow us

|

Updated on: Aug 23, 2023 | 5:30 PM

ఇటీవల కాలంలో స్మార్ట్ టీవీలకు బాగా డిమాండ్ పెరిగింది. స్మార్ట్ ఫోన్ మాదిరిగానే యాప్స్ లతో కూడిన టీవీలు మార్కెట్లోకి రావడంతో అందరూ వీటిని విరివిగా కొనుగోలు చేస్తున్నారు. ముఖ్యంగా ఓటీటీ ప్లాట్ ఫారం విస్తృతి పెరిగాక వీటి కొనుగోళ్లు మరింత అధికమయ్యాయి. ఎవరూ చిన్న స్క్రీన్ టీవీలను ఇష్టపడటం లేదు. 43, 50, 55 అంగుళాలను ఎక్కువగా ప్రిఫర్ చేస్తున్నారు. దాంతో పాటు దాల్బీ అట్మోస్ వంటి సౌండింగ్ ఫీచర్లతో ఉన్న వాటిని కొనుగోలు చేస్తున్నారు. ఎందుకంటే ఇంట్లోనే థియేటర్ అనుభవాన్ని ఆస్వాదించేలా చూసుకొంటున్నారు. మీరు కూడా మంచి పిక్చర్ క్లారిటీ, ఆడియో, ఫీచర్లు ఉన్న టీవీ కొనుగోలు చేయాలని భావిస్తున్నారా? అయితే ఇదే మీకు బెస్ట్ స్మార్ట్ టీవీ లిస్ట్. దీనిలో 50 అంగుళాల డాల్బీ అట్మోస్ తో పాటు క్రోమ్ కాస్ట్ ఫీచర్లతో కూడిన టీవీలు ఉన్నాయి. మీరూ ఓ లుక్కేయండి..

ఎంఐ 50 అంగుళాల స్మార్ట్ ఆండ్రాయిడ్ ఎల్ఈడీ టీవీ.. ఎంఐ నుంచి వస్తున్న ఎక్స్ సిరీస్ 4కే అల్ట్రా హెచ్ డీ స్మార్ట్ ఆండ్రాయిడ్ ఎల్ఈడీ టీవీ ఇది. అద్బుతమైన వీక్షణ అనుభవాన్ని అందిస్తుంది. ఇది ఆండ్రాయిడ్ టీవీ10 ప్లాట్ ఫారంపై ఆధారపడి పనిచేస్తుంది. దీనిలో నెట్ ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వంటి ఓటీటీ ప్లాట్ ఫారంలు ఉంటాయి. దీని ధర రూ. 34,999గా ఉంది.

వన్ ప్లస్ 50 అంగుళాల స్మార్ట్ ఆండ్రాయిడ్ ఎల్ఈడీ టీవీ.. వన్ ప్లస్ వై సిరీస్ నుంచి వస్తున్న 50 అంగుళాల 4కే అల్ట్రా హెచ్ డీ స్మార్ట్ ఆండ్రాయిడ్ టీవీ ఇది. ఇది బెజెల్ లెస్ డిజైన్ తో వస్తుంది. అద్భుతమైన వీక్షణ అనుభవాన్ని అందిస్తుంది. దీనిలో గామా ఇంజిన్ టెక్నాలజీ ఉంటుంది. దీంతో అల్టిమేట్ పిక్చర్ క్వాలిటీని అందిస్తుంది. ఆండ్రాయిడ్ టీవీ 10 ప్లాట్ ఫారంపై పనిచేసే ఈ టీవీ వన్ ప్లస్ ఎకో సిస్టమ్ కు కనెక్ట్ అవుతుంది. దీని ధర రూ. 31,999గా ఉంది.

వీయూ 50 అంగుళాల ఎల్ఈడీ గూగుల్ టీవీ.. వీయూ నుంచి వస్తున్న గ్లోఎల్ఈడీ సిరీస్ 50 అంగుళాల 4కే స్మార్ట్ ఎల్ఈడీ గూగుల్ టీవీ ఇది.దీనిలో ఏఐ పీక్యూ ఇంజిన్, డైనమిక్ బ్యాక్ లైట్ కంట్రోల్, యాంబియంట్ లైట్ సెన్సార్ ఉంటాయి. వీటితో అత్యద్భుతమైన వీక్షణ అనుభవాన్ని అందిస్తాయి. నాలుగు స్పీకర్లు ఉంటాయి. డాల్బీ అట్మోస్ టెక్నాలజీతో సౌండింగ్ అదిరిపోతుంది. 94శాతం కలర్ గాముట్, ఓఎల్ఈడీ డిస్ ప్లే ఉంటుంది. దీని దర రూ. 34,999గా ఉంది.

యాసర్ 50 అంగుళాల స్మార్ట్ ఎల్ఈడీ గూగుల్ టీవీ.. యాసర్ నుంచి వస్తున్న అడ్వాన్స్ డ్ ఐ సిరీస్ 4కే అల్ట్రా హెచ్ డీ స్మార్ట్ ఎల్ఈడీ గూగుల్ టీవీ ఇది. దీనిలో డాల్బీ విజన్, అట్మోస్ టెక్నాలజీతో ఉంటుంది. 36వాట్ల సామర్థ్యంతో స్పీకర్లు ఉంటాయి. డ్యూయల్ బ్యాండ్ వైఫై ఉంటుంది. దీని ధర రూ. 29,999గా ఉంది.

సోనీ బ్రావియా 50 అంగుళాల స్మార్ట్ ఎల్ఈడీ గూగుల్ టీవీ.. సోని నుంచి వస్తున్న 4కే అల్ట్రా హెచ్ డీ స్మార్ట్ ఎల్ఈడీ గూగుల్ టీవీ ఇది. దీనిలో 4కే ఎక్స్ రియాలిటీ ప్రో ప్రాసెసర్ ఉంటుంద. డాల్బీ ఆడియో ఉంటుంది. స్టన్నింగ్ పిక్చర్ క్వాలిటీ ఉంటుంది. గూగుల్ టీవీ ఇంటర్ ఫేస్ ఉంటుంది. యాప్ ఎయిర్ ప్లే, యాపిల్ హోమ్ కిట్, అలెక్స్ సపోర్టు వంటి ఫీచర్లు ఉంటాయి. దీని ధర రూ. 56,990గా ఉంది.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..