
Oneplus 15R Launch Date: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ వన్‌ప్లస్ త్వరలో మరో కొత్త 5జీ ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకురానుంది. అదే వన్‌ప్లస్ 15R. ఈ ఫోన్‌ను డిసెంబర్ 17న ఇండియాలో విడుదల చేయనున్నట్లు వన్‌ప్లస్ అధికారికంగా ప్రకటించింది. వాటర్ లేదా ధూళి నుంచి రక్షింపబడేలా IP66, IP68, IP69, and IP69K రేటింగ్స్‌తో ఈ ఫోన్ రానుండగా.. ఆండ్రాయిడ్ 16 ఆపరేటింగ్ సిస్టమ్‌తో ఇది వర్క్ చేయనుంది. వచ్చే నెలలో లాంచ్ కానున్న ఈ ఫోన్ ఫీచర్లు ఏంటి..? ధర ఎలా ఉంది..? అనే వివరాలు చూద్దాం.
స్నాప్‌డ్రాగన్ 8 Gen 5 ప్రాసెసర్‌తో ఈ ఫోన్ లాంచ్ అవుతుంది. ఆండ్రాయిడ్ 16 వెర్షన్‌లో ఆక్సిజన్ OS 16తో పనిచేస్తుంది. అంతేకాకుండా 50MP OIS ప్రైమరీ లెన్స్, 8MP అల్ట్రావైడ్ లెన్స్, 16MP సెల్పీ కెమెరాతో డ్యూయల్ రియర్ కెమెరాను కలిగి ఉంటుంది. బ్యాటరీ స్టోరేజ్ 7,800 నుంచి 8,000mAh మధ్య ఉంటుందని అంచనా. ఇక 100W–120W ఫాస్ట్ ఛార్జింగ్ ఫీచర్ ఉంది. NFC, డ్యూయల్ స్టీరియో స్పీకర్లతో కూడి ఉంది. ఇక 6.83-అంగుళాల 1.5K డిస్‌ప్లేను కలిగి ఉన్న ఈ ఫోన్.. 165Hz రిప్రెష్ రేట్‌తో 3డీ అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ స్కానర్‌ను కలిగి ఉంటుంది.
Strong inside out: https://t.co/AuD7fAIuPe
Rated for everything you didn’t plan for. #OnePlus15R pic.twitter.com/yb4ydHevjZ— OnePlus India (@OnePlus_IN) November 27, 2025
ఈ ఫోన్ చార్‌కోల్ బ్లాక్, మింట్ గ్రీన్ కలర్ ఆప్షన్లలో రానుంది. అమెజాన్‌లో ఇది అమ్మాకానికి ఉండనుంది. గతంలో వన్‌ప్లస్ 15 ఫోన్‌ను విడుదల చేయగా.. ఇది కూడా సేమ్ దాని మాదిరిగా ఉంటుంది. ధర వివరాలు ఇంకా బయటకు రాలేదు. కానీ దాదాపు రూ.45 వేల మధ్య ఉండొచ్చని అంటున్నారు.