Best Smartphones Under 30K: 5జీ ఫోన్లపై అదిరే ఆఫర్లు.. మిస్ అయితే మళ్లీ రావు..

|

Sep 30, 2024 | 7:54 PM

మంచి స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయాలనుకుంటున్నారా? ఏవైనా ఆఫర్ల కోసం ఎదురుచూస్తున్నారా? అయితే ఈ కథనం మీ కోసమే. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్లో 2024 ప్రారంభమైంది. స్మార్ట్ ఫోన్లపై ఈ సేల్లో అదిరే డీల్స్ అందుబాటులో ఉన్నాయి. రూ. 30వేల లోపు ధరలో టాప్ బ్రాండ్ల నుంచి 5జీ ఫోన్లు మీరు కొనుగోలు చేయొచ్చు. వీటిపై అమెజాన్ ఆఫర్ తో పాటు బ్యాంక్, ఎక్స్ చేంజ్ ఆఫర్లు కూడా ఉన్నాయి. ఒప్పో, రెడ్ మీ, రియల్ మీ, మోటోరోలా, హానర్ వంటి బ్రాండ్లకు సంబంధించిన 5జీ ఫోన్లు, రూ. 30వేలలోపు ధరలోనివి మీకు పరిచయం చేస్తున్నాం. ఓ లుక్కేయండి..

1 / 5
ఒప్పో ఎఫ్27 ప్రో ప్లస్ 5జీ.. ఈ ఫోన్ 8జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ తో వస్తుంది. ఈ వేరియంట్ అమెజాన్‌లో రూ. 27,999కి అందుబాటులో ఉంది. అయితే దాని 256జీబీ వేరియంట్ ధర రూ. 29,999గా ఉంది. కస్టమర్లు ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ ద్వారా చెల్లింపుపై 10 శాతం తక్షణ తగ్గింపును పొందవచ్చు. దీనిపై రూ. 25,900 ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా అందిస్తోంది.

2 / 5
మోటోరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్ 5జీ.. ఈ స్మార్ట్ ఫోన్ పై కూడా అమెజాన్లో అదిరే ఆఫర్ ఉంది. 8జీబీ ర్యామ్, 128జీబీ వేరియంట్ ధర రూ. 24,800గా ఉంది. దీనిపై ఎస్బీఐ క్రెడిట్ కార్డు ద్వారా చెల్లింపు చేస్తే రూ. 1500 తక్షణ తగ్గింపు పొందొచ్చు. నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ కూడా అందుబాటులో ఉంది.

3 / 5
రియల్ మీ 12 ప్రో ప్లస్ 5జీ.. అమెజాన్ సేల్లో ఈ స్మార్ట్ ఫోన్ పై అదిరే డీల్ అందుబాటులో ఉంది. 12జీబీ ర్యామ్, 256జీబీ వేరియంట్ ధర రూ. 28,990గా ఉంది. పలు బ్యాంక్, ఎక్స్ చేంజ్ ఆఫర్లు కలిపితే దీనిని మరింత తక్కువ ధరకు కొనుగోలు చేయొచ్చు. ఎస్బీఐ క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్ ద్వారా చెల్లిస్తే, మీకు 10 శాతం తగ్గింపు లభిస్తుంది. దీనిపై ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా ఇస్తున్నారు.

4 / 5
రెడ్ మీ నోట్ 13 ప్రో ప్లస్.. ఈ ఫోన్ 8జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజ్ తో వస్తుంది. ఈ వేరియంట్ ధర రూ.27,999గా ఉంది. మీరు దీనిపై 10 శాతం అంటే రూ. 1750 వరకు తగ్గింపు పొందవచ్చు. దీనిపై ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది.

5 / 5
హానర్ ఎక్స్9బీ 5జీ.. ఈ స్మార్ట్ ఫోన్ పై అమెజాన్ వివిధ ఆఫర్లను అందిస్తోంది. దీనిపై ఎక్స్ చేంజ్, ఈఎంఐ సౌకర్యం కూడా ఉంది. ఎస్బీఐ క్రెడిట్ కార్డుపై తక్షణ తగ్గింపు కూడా అందుబాటులో ఉంది. దీని ధర రూ. 21,999గా ఉంది.