Tech News: తాళం కింది భాగంలో ఈ చిన్న రంధ్రం ఎందుకు ఉంటుంది..? దీని అసలు రహస్యం ఇదే!

Tech News: తాళం కింది భాగంలో ఉండే చిన్న రంధ్రం ఉండటం మీరు గమనించే ఉంటారు. ఆ చిన్నపాటి రంధ్రం ఎందుకు ఉంటుందోనని మీరెప్పుడైనా ఆలోచించారా? ఆ రంధ్రం వెనుక చాలా సీక్రెట్‌ ఉంది. అంతేకాదు దాని వల్ల ఎంతో ప్రయోజనం కూడా ఉంది. ఆ ప్రయోజనం ఏంటో తెలుసుకుందాం..

Tech News: తాళం కింది భాగంలో ఈ చిన్న రంధ్రం ఎందుకు ఉంటుంది..? దీని అసలు రహస్యం ఇదే!
Padlock Hole Benefits

Updated on: Feb 16, 2026 | 5:22 PM

Tech News: మన ఇంటికి వేసే తాళం గురించి అందరికి తెలిసిందే. బయటకు వెళ్లటప్పుడు ఇంటికి తాళం వేస్తుంటాము. అయితే ఆ తాళంలో కొన్ని విషయాలు దాగివున్నాయి. వాటి అర్థం ఏంటో చాలా మందికి తెలియకపోవచ్చు. తాళం కింది భాగంలో కనిపించే చిన్న రంధ్రం దాని నిర్మాణం, మనుగడకు అత్యంత కీలకమైనది. చాలా మంది దీనిని కేవలం అలంకరణ కోసం ఉంటుందని భావిస్తారు. కానీ వాస్తవానికి ఇది తాళంను దీర్ఘకాలం పనిచేసేలా చూస్తుంది. ఈ రంధ్రం రెండు ప్రధాన ప్రయోజనాలను అందిస్తుంది. ఈ ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం..

మొదటిది, ఇది ఒక డ్రైనేజీ రంధ్రంగా పనిచేస్తుంది. వాతావరణంలో మార్పుల వల్ల, ముఖ్యంగా వర్షం పడినప్పుడు తాళం లోపలికి నీరు ప్రవేశించే అవకాశం ఉంది. ఈ నీరు లోపల నిలిచిపోతే, తాళంలోని ఇనుప భాగాలు తుప్పు పట్టి, దాని పనితీరును దెబ్బతీస్తాయి. చిన్న రంధ్రం ఈ నీటిని సమర్థవంతంగా బయటకు పంపించి, తుప్పు పట్టకుండా నిరోధిస్తుంది. తద్వారా తాళం పాడవ్వడాన్ని తగ్గిస్తుంది.

Kitchen Hacks: ఇలా చేస్తే చాలు కిలోల కొద్ది వెల్లుల్లి పొట్టును సులభంగా తీయవచ్చు.. సీక్రెట్‌ టిప్స్‌!

రెండవది ఈ రంధ్రం తాళం సరళమైన నిర్వహణకు ఉపయోగపడుతుంది. కాలక్రమేణా తాళం కీ తిప్పడానికి కష్టంగా మారినప్పుడు లేదా మొరాయించినప్పుడు కీ పెట్టే చోట కాకుండా ఈ చిన్న రంధ్రం ద్వారా ఆయిల్ వేయడం వల్ల అది నేరుగా తాళం లోపల ఉన్న స్ప్రింగ్‌లు, పిన్‌లకు చేరుతుంది. ఇది లోపలి భాగాలను సరళీకరించి, తాళం మళ్ళీ కొత్తదానిలా సున్నితంగా పనిచేయడానికి సహాయపడుతుంది. దాని జీవితకాలాన్ని గణనీయంగా పెంచుతుంది.

Fridge Tips: మీ ఫ్రిజ్ నుంచి శబ్దం వస్తోందా.. ఖర్చు లేకుండా మీరే చేసుకోవచ్చు.. బెస్ట్‌ సీక్రెట్‌ ట్రిక్స్‌ ఇవే!

మరిన్ని  టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us