Government Alert: ఈ మూడు యాప్‌లు వెంటనే డిలీట్ చేయండి.. స్మార్ట్‌ఫోన్లు వాడేవారికి కేంద్ర ప్రభుత్వం నుంచి ఎమర్జెన్సీ అలర్ట్

ఇటీవల దేశంలో సైబర్ మోసాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. లక్షల మంది వీరి బారిన పడి కోట్లకు కోట్లు పొగోట్టుకుంటున్నారు. దీంతో కేంద్రం ప్రభుత్వం వీటిి కట్టడికి అనేక చర్యలు చేపడుతోంది. అందులో భాగంగా తాజాగా స్మార్ట్‌ఫోన్ వాడే ప్రజలందరికీ ఓ హెచ్చరిక జారీ చేసింది.

Government Alert: ఈ మూడు యాప్‌లు వెంటనే డిలీట్ చేయండి.. స్మార్ట్‌ఫోన్లు వాడేవారికి కేంద్ర ప్రభుత్వం నుంచి ఎమర్జెన్సీ అలర్ట్
Smart Phones

Updated on: Dec 22, 2025 | 12:49 PM

Screen Sharing Apps: ప్రపంచంలోనే భారత్‌లో జనాభా ఎక్కువగా ఉండటంతో మొబైల్స్, ఇంటర్నెట్ వాడేవారి సంఖ్య కూడా ఇతర దేశాలతో పోలిస్తే భారీ స్థాయిలో ఉంటుంది. స్మార్ట్‌ఫోన్ కలిగి ఉన్న ప్రతీఒక్కరూ ఇంటర్నెట్ వాడుతూ ఉంటారు. తమ అవసరాల కోసం అనేక యాప్స్‌ను ఇన్‌స్టాల్ చేసుకుంటూ ఉంటారు. వాటిల్లో మీ వ్యక్తిగత డేటాను చోరీ చేసి కొన్ని ప్రమాదకర యాప్స్ కూడా ఉంటాయి. కేంద్ర ప్రభుత్వం ఇలాంటి వాటిని గుర్తించి ఎప్పటికప్పుడు తొలగిస్తూ ఉంటోంది. వీటిని ఫోన్ నుంచి డిలీట్ చేసుకోవాల్సిందిగా హెచ్చరికలు జారీ చేస్తూ ఉంటుంది. తాజాగా ప్రమాదకరమైన స్క్రీన్ షేరింగ్ యాప్స్‌కు సంబంధించి స్మార్ట్‌ఫోన్ యూజర్లను కేంద్రం హెచ్చరించింది.

స్క్రీన్ షేరింగ్ యాప్స్‌ను వెంటనే స్మార్ట్‌ఫోన్ నుంచి డిలీట్ చేయలని కేంద్ర ప్రభుత్వం అలర్ట్ జారీ చేసింది. ఎనీడెస్క్, టీమ్ వ్యూయర్, క్విక్ సపోర్ట్ వంటి యాప్స్‌తో పెను ప్రమాదమని, స్కామర్లు మీ వ్యక్తిగత, ఆర్ధిక డేటాను దొంగలించి దుర్వినియోగం చేసే ప్రమాదముందని హెచ్చరించింది. ఇటీవల ఆన్‌లైన్ మోసాలు, స్పామ్ కాల్స్, సైబర్ నేరాలు ఎక్కువగా జరుగుతున్న క్రమంలో ప్రజలను అలర్ట్ చేస్తోంది. స్క్రీన్ షేరింగ్, రిమోట్ యాక్సెస్ వంటి ఫ్లాట్‌ఫామ్‌లను సైబర్ నేరగాళ్లు ట్రాపింగ్ కోసం ఉపయోగిస్తున్నారని, మిమ్మల్ని ట్రాప్ చేసి స్మార్ట్‌ఫోన్‌ను వారు తమ ఆధీనంలోకి తీసుకునే అవకాశముందని తెలిపింది. మీకు తెలియక సైబర్ నేరాలకు పాల్పడేవారికి స్క్రీన్ షేరింగ్, రిమోట్ కంట్రోల్ వంటి వాటికి అనుమతి ఇవ్వడం వల్ల బ్యాంకింగ్, ఓటీపీలు, వ్యక్తిగత వివరాలు తెలుసుకునే ఛాన్స్ ఉంటుందని స్పష్టం చేసింది.

ఈ మూడు యాప్‌లు వెంటనే తొలగించండి

ఏనీ డెస్క్, టీమ్ వ్యూయర్, క్విక్ సపోర్ట్ యాప్‌లను వెంటనే ఫోన్ నుంచి తొలగించాలని కేంద్రం హెచ్చరించింది. తెలియని వ్యక్తులు చెప్పినప్పుడు ఎలాంటి యాప్‌లను ఇన్‌స్టాల్ చేయవద్దని, ఇన్‌స్టాల్ చేసేముందు యాప్ పర్మిషన్లను చెక్ చేయాలని సూచించింది. ఓటీపీలు లాంటి వ్యక్తిగత సమాచారాన్ని ఎవరితోనూ పంచుకోవద్దని తెలిపింది. స్క్రీన్ షేరింగ్ చేయమని ఎవరైనా అడిగితే చేయవద్దని, ఎదైనా అనుమానం వస్తే 1930 నెంబర్‌కు కాల్ చేసి సమాచారం అందించాలని కేంద్రం తెలిపింది. అలాగే www.cybercrime.gov.in వెబ్‌సైట్లో కూడా ఫిర్యాదు చేయవచ్చని స్పష్టం చేసింది.