Mobile Charger: మీ వద్ద ఉన్న మొబైల్ ఛార్జర్ నకిలీదా? ఒరిజినలా? ఇలా గుర్తించండి!
Mobile Charger: ఛార్జర్ అనేది మొబైల్‌కు చాలా ముఖ్యమైనది. ఒకప్పుడు కూడా కంపెనీ నుంచి వచ్చిన ఒరిజినల్ ఛార్జర్‌ను వాడటం మందిది. కానీ మార్కెట్లో రకరకాల నకిలీ ఛార్జర్లు దర్శనమిస్తున్నాయి. ఈ నకలీ ఛార్జర్‌లను గుర్తించడం ఎలా..? కొన్ని ట్రిక్స్‌తో సులభంగా గుర్తించవచ్చంటున్నారు నిపుణులు..

Mobile Charger: నేడు మార్కెట్లో నకిలీ మొబైల్ ఛార్జర్‌లు కుప్పలు తెప్పలుగా వస్తున్నాయి. అవి ఒరిజినల్‌లాగానే ఉంటాయి. కానీ నకిలీవని గుర్తించడం చాలా కష్టం. కానీ అవి నాణ్యత లేని ఎలక్ట్రానిక్ భాగాలను ఉపయోగిస్తాయి. ఇవి ఫోన్ బ్యాటరీని దెబ్బతీస్తాయి. అలాగే ఫోన్ హీటెక్కి దెబ్బతింటుందని నిపుణులు చెబుతున్నారు. ఈ నకిలీ ఛార్జర్ల వల్ల కొన్ని సార్లు ప్రమాదాలు కూడా జరుగుతాయంటున్నారు. అందువల్ల నిజమైన, నకిలీ ఛార్జర్‌ల మధ్య తేడాను గుర్తించడం చాలా ముఖ్యం. ఈ ట్రిక్స్‌ను ఉపయోగించి ఛార్జర్ నకిలీదా ఒరిజినలా సులభంగా గుర్తించవచ్చంటున్నారు నిపుణులు.
ప్యాకేజింగ్ నాణ్యతను చెక్ చేయండి:
నిజమైన ఛార్జర్‌లు దృఢమైన బాక్స్, అసలు ముద్రతో వస్తాయి. అయితే నకిలీ ఛార్జర్‌లకు బలహీనమైన బాక్స్ ఉంటుంది. అలాగే దానిపై ఉండే లోగో డల్‌గా ఉంటుంది. అంత క్లారిటీగా ఉండదు. మోడల్ నంబర్, వోల్టేజ్, ISI/BIS గుర్తు, కంపెనీ పేరు ఛార్జర్‌పై స్పష్టంగా ముద్రించి ఉండాలి. మసక లేదా బెల్లం ముద్రణ నకిలీని సూచిస్తుంది.
బరువు కూడా ఒక సూచన:
అసలు ఛార్జర్ కొంచెం బరువుగా ఉంటుంది. ఎందుకంటే దానికి మంచి నాణ్యత గల ట్రాన్స్‌ఫార్మర్ ఉంటుంది. అయితే నకిలీ ఛార్జర్ తేలికగా, ఖాళీగా అనిపిస్తుంది. పెద్దగా బరువు ఉన్నట్లు అనిపించదు.
ధర వ్యత్యాసం:
నకిలీ ఛార్జర్‌ను గుర్తించడానికి ధరను కూడా చూడండి. బ్రాండెడ్ ఛార్జర్ ధర రూ.1,000 అయితే మీరు దానిని రూ.200–రూ.300కి కొనుగోలు చేస్తుంటే అది దాదాపు 99% నకిలీదని అర్థం చేసుకోండి.
ఛార్జింగ్ వేగం, టెంపరేచర్‌ను తనిఖీ చేయండి:
నకిలీ ఛార్జర్ మీ ఫోన్‌ను చాలా నెమ్మదిగా ఛార్జ్ చేయవచ్చు లేదా చాలా త్వరగా వేడెక్కవచ్చు. అయితే నిజమైన ఛార్జర్ మీ ఫోన్‌ను హీటెక్కకపోవచ్చు. ఇలాంటి సింపుల్ ట్రిక్స్ ద్వారా ఛార్జర్ నకిలీదా? లేక ఒరిజినలా అని గుర్తించవచ్చంటున్నారు టెక్ నిపుణులు.
Bridge: 2 గంటల ప్రయాణం కేవలం 15 నిమిషాల్లోనే.. భారీ వంతెనను ప్రారంభించనున్న మోదీ!
Viral Video: తల్లి ముందే బిడ్డను ఢీకొట్టిన కారు.. షాకింగ్ వీడియో వైరల్!
మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




