Fridge Tips: మీ ఫ్రిజ్ నుంచి శబ్దం వస్తోందా.. ఖర్చు లేకుండా మీరే చేసుకోవచ్చు.. బెస్ట్‌ సీక్రెట్‌ ట్రిక్స్‌ ఇవే!

Fridge Tips: సాధారణంగా చాలా మంది ఇళ్లలో ఉండే ఫ్రిజ్‌ల నుంచి రకరకాల శబ్దాలు వస్తుంటాయి. వాటిని నిర్లక్ష్యం చేస్తే మరింత సమస్యగా మారి ఖర్చు పెరిగే అవకాశం ఉంటుంది. అయితే ఫ్రిజ్‌ నుంచి వచ్చే శబ్దాలను మీరే సరి చేసుకోవచ్చు. ఈ సీక్రెట్‌ ట్రిక్స్‌ పాటించినట్లయితే ఖర్చు లేకుండా చేసుకోవచ్చంటున్నారు టెక్నీషియన్స్‌..

Fridge Tips: మీ ఫ్రిజ్ నుంచి శబ్దం వస్తోందా.. ఖర్చు లేకుండా మీరే చేసుకోవచ్చు.. బెస్ట్‌ సీక్రెట్‌ ట్రిక్స్‌ ఇవే!
Refrigerator

Updated on: Feb 16, 2026 | 3:59 PM

Fridge Tips: సమ్మర్‌ వచ్చేస్తోంది. ఇప్పుడు ఏసీలు, ఫ్యాన్‌, ఫ్రిజ్‌లకు పని పెరుగుతుంది. ఈ సమ్మర్‌ సీజన్‌లో ఫ్రిజ్‌ల వాడకం ఎక్కువగా ఉంటుంది. అయితే ఏదైనా సమస్య ఉంటే ముందస్తుగా నిర్లక్ష్యం చేయకుండా మరమ్మతులు చేసుకోవడం మంచిది. లేకుంటే అసలు సీజన్‌లో రిపేరుకు వస్తే ఇబ్బందిగా మారుతుంది. అయితే అదే సమయంలో ఫ్రిజ్ నుంచి పెద్ద శబ్దాలు రావడం, సరిగా కూలింగ్ ఇవ్వకపోవడం వంటి సమస్యలు కూడా ఎక్కువవుతాయి. చాలా మంది వెంటనే మెకానిక్‌ను పిలవాలని భావిస్తారు. కానీ కొన్ని చిన్న చిన్న సమస్యలను ఇంట్లోనే చెక్‌ చేసుకుని బాగు చేసుకోవచ్చంటున్నారు టెక్నీషియన్స్‌. సరైన జాగ్రత్తలు తీసుకుంటే ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ఫ్రిజ్ మళ్లీ శబ్దం రాకుండా చేసుకోవచ్చంటున్నారు.

వేసవిలో ఫ్రిజ్‌పై లోడ్ ఎక్కువగా ఉండటంతో లెవెలింగ్ చాలా ముఖ్యం. అసమాన నేలపై ఫ్రిజ్ ఉంచితే కంప్రెసర్ పనిచేసేటప్పుడు వణుకు పెరిగి శబ్దం ఎక్కువగా వినిపిస్తుంది. ఫ్రిజ్‌ను స్వల్పంగా కదిలించి బ్యాలెన్స్‌లో ఉందో లేదో చూసుకోవాలి. అవసరమైతే కింద రబ్బరు ముక్క, కలప ముక్క లేదా స్టాండ్ పెట్టి బ్యాలెన్సింగా ఉంచుకోవాలి. ఇది చిన్న ట్రిక్ అయినా శబ్దాన్ని గణనీయంగా తగ్గిస్తుంది.

ఫ్రిజ్‌కు గోడకు అనుకుని ఉండటం:

ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఫ్రిజ్‌ను గోడకు ఆనుకుని ఉంచడం. చాలా మంది స్థలాన్ని ఆదా చేసుకునేందుకు ఫ్రిజ్‌ను గోడకు గోడకు దగ్గరగా ఏర్పాటు చేస్తారు. ఇలా చేస్తే కంపనాలు గోడకు తాకి శబ్దం పెరుగుతుంది. అంతేకాదు వెనుక వేడి గాలి బయటకు వెళ్లక కంప్రెసర్‌పై ఒత్తిడి పెరుగుతుంది. కనీసం ఆరు అంగుళాల గ్యాప్ ఉండేలా చూసుకోవాలని, దీని వల్ల వెంటిలేషన్ పెరగడంతో పాటు శబ్దం కూడా తగ్గుతుందంటున్నారు.

ఇవి కూడా చదవండి

కండెన్సర్‌ కాయిల్‌పై దుమ్ము:

అలాగే ఫ్రిజ్ వెనుక భాగంలో ఓ నల్లటి కండెన్సర్ కాయిల్ ఉంటుంది. దీనిపై దుమ్ము పేరుకుపోయి ఉంటుంది. ఇది కూడా శబ్దానికి ముఖ్యమైన కారణం. వేసవిలో దుమ్ము త్వరగా పేరుకుపోతుంది. దీంతో కూలింగ్ సిస్టమ్ ఎక్కువగా పనిచేయాల్సి వస్తుంది. ఫలితంగా నాయిస్ + కరెంట్ ఖర్చు రెండూ పెరుగుతాయి. నెలకు ఒకసారి ఫ్రిజ్ ఆఫ్ చేసి వెనుక మెష్‌ను బ్రష్ లేదా డ్రై క్లాత్‌తో శుభ్రం చేయడం మంచిదంటున్నారు నిపుణులు.

ఐస్‌ పేరుకుపోవడం:

అలాగే ఫ్రీజర్‌లో ఎక్కువగా ఐస్‌ పేరుకుపోయి ఉంటుంది. దీని వల్ల కూడా శబ్దం వస్తుందంటున్నారు. ఐస్ పొర మందంగా మారితే లోపల ఫ్యాన్ దానిని తాకి గరగర శబ్దం చేస్తుంది. మాన్యువల్ డీఫ్రాస్ట్ మోడల్స్‌లో ఇది ఎక్కువగా కనిపిస్తుంది. కొన్ని గంటలు ఆఫ్ చేసి పూర్తిగా డీఫ్రాస్ట్ చేస్తే ఫ్రిజ్ పనితీరు మళ్లీ నార్మల్ అవుతుంది. అప్పుడు కూలింగ్‌ మెరుగు పడడమే కాకుండా శబ్దం కూడా తగ్గుతుంది.

అలాగే కంప్రెసర్ బోల్టులు వదులుగా అయినా కూడా శబ్ధం వస్తుంటుంది. ఎక్కువకాలం వాడితే వైబ్రేషన్ వల్ల ఫిట్టింగ్స్ సడలుతాయి. స్టార్ట్ లేదా ఆఫ్ సమయంలో మెటల్ టచ్ శబ్దం వినిపిస్తుంది. ఫ్రిజ్ ఆఫ్ చేసి జాగ్రత్తగా చెక్ చేయాలి. అవసరమైతే టెక్నీషియన్‌తో బిగించాలి. ఈ చిన్న జాగ్రత్తలు పాటిస్తే వేసవిలో ఫ్రిజ్ సమస్యలు తగ్గి, ఖర్చులు కూడా ఆదా అవుతాయి.

మరిన్ని  టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us