Smartphone Overheating: వేసవిలో మీ స్మార్ట్‌ఫోన్‌ వేడెక్కుతోందా..? ఈ చిట్కాలను వాడండి..!

|

Apr 21, 2022 | 9:46 PM

Smartphone Overheating: వేసవిలో స్మార్ట్‌ఫోన్‌లు వేడెక్కడం అనే సమస్య సర్వసాధారణం. ముఖ్యంగా వేసవిలో స్మార్ట్ ఫోన్లు (Smartphones) త్వరగా వేడెక్కుతాయి...

Smartphone Overheating: వేసవిలో మీ స్మార్ట్‌ఫోన్‌ వేడెక్కుతోందా..? ఈ చిట్కాలను వాడండి..!
Follow us on

Smartphone Overheating: వేసవిలో స్మార్ట్‌ఫోన్‌లు వేడెక్కడం అనే సమస్య సర్వసాధారణం. ముఖ్యంగా వేసవిలో స్మార్ట్ ఫోన్లు (Smartphones) త్వరగా వేడెక్కుతాయి. ఈ వేడెక్కడం (Overheating) వల్ల వినియోగదారులు వీడియో గేమ్‌లు ఆడలేరు. కాల్‌లు చేయడంలో ఇబ్బంది పడుతుంటారు. అలాగే ఫోటోలు తీయడంలో కూడా సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. కొన్నిసార్లు దీని కారణంగా బ్యాటరీ పేలిపోయే ప్రమాదం కూడా పెరుగుతుంది. అయితే ఈ సమస్య నుంచి బయటపడేందుకు కొన్ని చిట్కాలు ఉన్నాయి. వీటి ద్వారా వేసవిలో మొబైల్ ఓవర్ హీటింగ్ సమస్యను అధిగమించవచ్చు. అలాంటి ఐదు సులభ చిట్కాలు ఏమిటో తెలుసుకోండి.

  1. ఎయిర్‌ప్లేన్ మోడ్‌ని ఆన్ చేయండి: వేడెక్కడం తగ్గించడానికి మీరు ఎయిర్‌ప్లేన్ మోడ్‌ను ఆన్ చేయవచ్చు. ఇది మీ మొబైల్ బ్యాటరీని ఆదా చేయడమే కాకుండా వేడెక్కడం సమస్యను కూడా పరిష్కరిస్తుంది. మీరు తక్కువ సమయం కోసం విమానం మోడ్‌ను ఆన్ చేయడం వల్ల సమస్యను అధిగమనించవచ్చు.
  2. ఫోన్ కూలర్ సహాయం: గేమింగ్ మొబైల్‌లను చల్లబరచడానికి ఫోన్ కూలర్‌ల వంటి పరికరాలు రూపొందించబడ్డాయి. దీని సహాయంతో వినియోగదారులు తమ మొబైల్‌ను వేడెక్కకుండా కాపాడుకోవడమే కాకుండా కాల్‌లు, నెట్ సర్ఫింగ్, సినిమాలు చూసేటప్పుడు కూడా ఉపయోగించవచ్చు.
  3. అనవసరమైన యాప్‌లను తీసేయండి: మనం ఉపయోగించని మన స్మార్ట్‌ఫోన్ బ్యాక్‌గ్రౌండ్‌లో అనవసరమైన యాప్‌లు చాలా సార్లు రన్ అవుతూనే ఉంటాయి. దీన్ని ఆఫ్ చేయడం వల్ల మీ స్మార్ట్‌ఫోన్ బ్యాటరీని ఆదా చేయడమే కాకుండా వేడెక్కడం కూడా నివారించవచ్చు.
  4. మల్టిపుల్ టాస్క్‌లను నివారించండి: మల్టీ టాస్కింగ్ కారణంగా చాలా సార్లు స్మార్ట్‌ఫోన్ వేడెక్కుతుంది. ఇది ముఖ్యంగా వేసవిలో కనిపిస్తుంది. మీ స్మార్ట్‌ఫోన్ నిరంతరం వేడెక్కుతున్నట్లయితే మీరు మల్టీ టాస్కింగ్ చేయకూడదు. ఇది బ్యాటరీపై ప్రభావం చూపుతుంది.
  5. సెట్టింగ్‌ను మార్చండి: మీరు స్మార్ట్‌ఫోన్‌లో నిరంతర వేడెక్కడం సమస్యను ఎదుర్కొంటున్నట్లయితే, దాని మొబైల్ కవర్‌ను తీసివేయండి. కొన్నిసార్లు మొబైల్ కవర్ వల్ల కూడా వేడెక్కడం జరుగుతుంది.
  6. మొబైల్ డేటాను ఆఫ్ చేయండి: మొబైల్ హీటింగ్ సమస్యను వెంటనే ఆపడానికి మొబైల్ డేటాను ఆఫ్ చేయాలి. ఇంటర్నెట్‌ని ఉపయోగించకపోవడం వల్ల మీ బ్యాటరీతో ఓవర్ హీటింగ్ కూడా తగ్గుతుంది.

ఇవి కూడా చదవండి:

Scientific Reason: పిల్లలు రెండు తలలు, మూడు చేతులు, 6 వేళ్లతో పుట్టడానికి కారణం ఏమిటి! శాస్త్రీయ కారణాలు ఏమిటి?

Pure EV: నిజామాబాద్‌లో ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ బ్యాటరీ పేలుడుతో కంపెనీ కీలక నిర్ణయం.. 2వేల వాహనాల రీకాల్‌