SBI Whatsapp: ఎస్‌బీఐ ఖాతాదారులకు గుడ్‌ న్యూస్‌.. వాట్సాప్‌ ద్వారా బ్యాంకు సేవలు.. ఈ స్టెప్స్‌ ఫాలో అవ్వండి..

|

Jul 21, 2022 | 6:05 AM

SBI Whatsapp Banking: అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్‌ అయిన స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (SBI) వినియోగదారులకు అందుబాటులోకి కొత్త సేవలు తీసుకొచ్చాయి. వాట్సాప్‌ ద్వారా బ్యాంక్‌ సేవలను అందించనున్నారు...

SBI Whatsapp: ఎస్‌బీఐ ఖాతాదారులకు గుడ్‌ న్యూస్‌.. వాట్సాప్‌ ద్వారా బ్యాంకు సేవలు.. ఈ స్టెప్స్‌ ఫాలో అవ్వండి..
Follow us on

SBI Whatsapp Banking: అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్‌ అయిన స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (SBI) వినియోగదారులకు అందుబాటులోకి కొత్త సేవలు తీసుకొచ్చాయి. వాట్సాప్‌ ద్వారా బ్యాంక్‌ సేవలను అందించనున్నారు. ఇకపై ఖాతాదారులు బ్యాలెన్స్‌ విచారణ, మినీ స్టేట్‌మెంట్‌లను వాట్సాప్‌ ద్వారా పొందవచ్చు. వినియోగదారులు ఈ సేవలను ఎలా పొందాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..

వాట్సాప్‌ సేవలు పొందాలంటే యూజర్లు ముందుగా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం మొబైల్‌ నెంబర్‌ నుంచి WAREG అని టైప్‌ చేసి స్పేస్‌ ఇచ్చి అకౌంట్‌ నెంబర్‌ను ఎంటర్ చేసి 72089 33148 నంబ‌రుకు మెసేజ్ చేయాలి. మీ మొబైల్‌ నంబర్‌ ఎస్‌బీఐ బ్యాంకు వద్ద రిజిస్టర్‌ అయి ఉండాలి. రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను పూర్తి చేసుకున్న తర్వాత వాట్సాప్‌లో నుంచి +91 90226 90226కి Hi అని వాట్సాప్ మేసెజ్ చేయాలి. ఇలా చేయగానే చాట్‌ బాక్స్‌లో అకౌంట్‌ బ్యాలెన్స్‌, మినీ స్టేమ్‌మెంట్‌, వాట్సాస్‌ బ్యాంకింగ్ సేవలు రద్దు అనే మూడు ఆప్షన్స్‌ కనిపిస్తాయి. వీటిలో మీకు అవసరమైన ఆప్షన్‌ను ఎంచుకొని సదరు నెంబర్‌ను టైప్‌ చేసి ఎంటర్‌ చేయాలి.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తలకు క్లిక్ చేయండి..