
శాంసంగ్ నుంచి 07 సిరీస్ లాంఛ్ అయింది. ఈ సిరీస్ లో భాగంగా శాంసంగ్ గెలాక్సీ ఎ07(A07), గెలాక్సీ ఎఫ్07(F07), గెలాక్సీ ఎమ్ 07 (M07) ఫోన్లు మార్కెట్లో లాంఛ్ అయ్యాయి. ఇందులో ఎమ్ సిరీస్ అమెజాన్ లో లభిస్తుండగా ఎఫ్ సిరీస్ ఓన్లీ ఫ్లిప్ కార్ట్ లోనే అందుబాటులో ఉంటుంది. ఈ మొబైళ్ల ఫీచర్ల విషయానికొస్తే..
శాసంగ్ కొత్త బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ సిరీస్ లో వచ్చే మూడు ఫోన్లు దాదాపు ఒకేరకమైన ఫీచర్లు కలిగి ఉంటాయి. మూడింటిలో మీడియాటెక్ హీలియో జీ99 ప్రాసెసర్ ఉంటుంది. మూడు ఫోన్లు 6.7-అంగుళాల ఎల్సీడీ హెచ్ డీ ప్లస్ డిస్‌ప్లేను కలిగి ఉన్నాయి. ఈ డిస్ ప్లే 90హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌కు సపోర్ట్ చేస్తుంది. ఈ మొబైల్స్ కు ఐపీ54 డస్ట్ అండ్ స్ప్లాష్ రెసిస్టెన్స్ సపోర్ట్ ఉంటుంది.
ఇక కెమెరాల విషయానికొస్తే.. ఈ మూడు ఫోన్స్ లో ఆటోఫోకస్‌తో కూడిన 50ఎంపీ ప్రైమరీ కెమెరా , 2ఎంపీ డెప్త్ సెన్సార్ ఉన్నాయి. ముందు భాగంలో 8 ఎంపీ సెల్ఫీ కెమెరా ఉంటుంది. ఈ మూడు ఫోన్లు 5,000 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తాయి. 25 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ ను సపోర్ట్ చేస్తాయి.
ఇకపోతే ఈ మూడు ఫోన్ల 4జీబీ ర్యామ్ 64జీబీ స్టోరేజ్ తో వస్తాయి. ఆండ్రాయిడ్ 15 వెర్షన్ పై రన్ అవుతాయి. ఆరేళ్లపాటు సాఫ్ట్ వేర్ అప్ డేట్స్, సెక్యూరిటీ అప్ డేట్స్ వస్తాయి. ఈ మూడు ఫోన్లలో ఉండే ఒకేఒక్క తేడా డిజైన్. డిజైన్, రంగులు ఈ మూడు ఫోన్లలో వేర్వేరుగా ఉంటాయి. ఇక ధరల విషయానికొస్తే.. ఏ07 ధర రూ.8,999, ఎఫ్07 ధర రూ.7,699, ఎమ్ 07 ధర రూ. 6,999 నుంచి ప్రారంభమవుతాయి.
మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి