Samsung Galaxy M32 5G: శామ్‌సంగ్ గెలాక్సీ M సిరీస్, M32 5G పేరుతో కొత్త మిడ్-బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. ఈ 5G ఫోన్ ఆక్టా-కోర్ మీడియాటెక్ ప్రాసెసర్‌తో క్వాడ్-రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఫోన్‌లోని కెమెరా లెన్స్ వివిధ రింగ్‌లలో సెట్ చేసి ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ 12 బ్యాండ్‌ల 5G నెట్‌వర్క్‌కు మద్దతు ఇస్తుంది. ఇది శామ్‌సంగ్ నాక్స్ సెక్యూరిటీ ఫీచర్‌ను కూడా అందిస్తుంది.
Samsung Galaxy M32 5G ధర
ఈ స్మార్ట్‌ఫోన్ రెండు వేరియంట్లలో లాంచ్ చేశారు. 6GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 20,999 అదేవిధంగా 8GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 22,999. మీరు ఫోన్‌ను స్లేట్ బ్లాక్ అలాగే, స్కై బ్లూ కలర్ ఆప్షన్‌లలో కొనుగోలు చేయవచ్చు. ఫోన్ అమ్మకం అమెజాన్ ఇండియా వెబ్‌సైట్‌లో సెప్టెంబర్ 2 న మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమవుతుంది. మీరు దీనిని కంపెనీ అధికారిక వెబ్‌సైట్ Samsung.com నుండి కూడా కొనుగోలు చేయవచ్చు. ఐసీఐసీఐ బ్యాంక్ కస్టమర్‌లు రూ .2,000 తక్షణ డిస్కౌంట్ పొందుతారు.
శామ్‌సంగ్ గెలాక్సీ M32 5G స్పెసిఫికేషన్‌లు
ఇది డ్యూయల్ సిమ్‌కి సపోర్ట్ చేస్తుంది. ఆండ్రాయిడ్ 11 ఆధారిత శామ్‌సంగ్ OneUI 3.1 ఆపరేటింగ్ సిస్టమ్‌పై రన్ అవుతుంది. ఫోన్ 6.5-అంగుళాల HD + TFT ఇన్ఫినిటీ- V డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది 60Hz రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంది. ఫోన్ 8GB RAM, 128GB వరకు స్టోరేజ్‌ను ఆక్టా-కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 720 ప్రాసెసర్‌తో పొందుతుంది. మీరు 1TB స్టోరేజ్‌తో మెమరీ కార్డ్‌ని కూడా దీనిలో అమర్చుకుని అవకాశం ఉంది.
శామ్‌సంగ్ గెలాక్సీ M32 5G కెమెరా..
క్వాడ్-రియర్ కెమెరా సెటప్ ఫోన్‌లో ఉంది. ఇది 8 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ యాంగిల్ లెన్స్, 2 మెగాపిక్సెల్ మాక్రో షూటర్, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్‌తో 48 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్‌ను కలిగి ఉంది. సెల్ఫీ , వీడియో కాలింగ్ కోసం, ఇది 13 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది.
శామ్‌సంగ్ గెలాక్సీ M32 5G కనెక్టివిటీ..
కనెక్టివిటీ కోసం, ఇది 5G, Wi-Fi, బ్లూటూత్, GPS వంటి ఫీచర్లను కలిగి ఉంది. ఇందులో సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంది. ఇది 5,000mAh బ్యాటరీతో వస్తోంది. ఇది 15W ఫాస్ట్ ఛార్జర్‌తో ఉంటుంది. ఫోన్ పరిమాణం 164.2×76.1×9.1mm. ఫోన్‌లో డాల్బీ అటామ్ సపోర్ట్ కూడా అందించారు.
Reserve Bank Of India: మరో సహకార బ్యాంకుకు భారీ జరిమానా విధించిన రిజర్వ్ బ్యాంకు.. కారణం ఇదే..!