
ఖరీదైన స్మార్ట్‌ఫోన్‌లు కొన్ని సార్లు తక్కువ ధరకు అమ్ముడవుతుంటాయి. అలాంటప్పుడు మనం వాటిని కొనుగోలు చేయడం వల్ల చాలా డబ్బులను ఆదా చేసుకోవచ్చ. అయితే ఇప్పుడు మీరు కూడా తక్కువ ధరలో మంచి Samsung ఫోన్ కొనాలనుకుంటే మీకు ఒక బంఫర్ ఆఫర్ ఉంది. రూ.39,999 దగ్గర లాంచ్ అయిన Samsung Galaxy A55 5G ఫోన్‌ను ఇప్పుడు రూ.13,000 తక్కువ ధరకు వస్తుంది. డిస్కౌంట్ తర్వాత శామ్‌సంగ్ కంపెనీకి చెందిన ఈ మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్ మీకు ఎంత ధరకు లభిస్తుంది. దాని ఫీచర్స్ ఏంటి, దీనిపై ఇంకా అదనపు డిస్కౌంట్ కోసం ఏవైనా ఉన్నాయా? అనేది ఇప్పుడు చూద్దాం.
Samsung Galaxy A55 5G, 8 GB RAM / 128 GB వేరియంట్ ఈ ఫోన్ లాంచ్ అయినప్పుడు దీని ప్రారంభ ధర రూ. 39,999. కానీ ఇప్పుడు ఈ ఫోన్‌న్ చాలా తక్కువ ధరకే వినియోగదారులకు అందుబాటులో ఉంది. అమెజాన్‌లో ఈ ఫోన్ రూ. 13,000 తగ్గింపు తర్వాత రూ. 26,999 కు వస్తుంది. అంటే ఇప్పుడు మీరు ఈ ఫోన్‌ను లాంచ్ ధర కంటే చాలా చౌకగా కొనవచ్చు. అంతే కాకుండా కొన్ని సెలెక్టెడ్ బ్యాంక్ కార్డుల ద్వారా ఈ ఫోన్‌కు నోకాస్ట్ EMI సౌకర్యం కూడా అందుబాటులో ఉంది.
ఈ శ్రేణిలో ఇతర ఫోన్‌ల ధరలతో పోల్చు కుంటే, Samsung Galaxy A55.. ప్లిఫ్‌కార్టులో ఉన్న Realme 15 5G (ధర రూ. 27999), Motorola Edge 60 5G (ధర రూ. 25999), Vivo Y400 Pro 5G (ధర రూ. 26999), iQOO Neo 10R 5G (ధర రూ. 26,273) వంటి ఫోన్‌లతో పోటీపడుతుంది.
మరిన్ని సైన్స్ అండ్ టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.