Redmi Note 11 Pro+: భారత మార్కెట్లోకి రెడ్‌మీ కొత్త 5జీ స్మార్ట్‌ ఫోన్‌.. తక్కువ ధరలో అదిరిపోయే ఫీచర్లు..

|

Mar 11, 2022 | 2:52 PM

Redmi Note 11 Pro+: ఎప్పటికప్పుడు కొంగొత్త ఫోన్‌లను పరిచయం చేస్తూ వినియోగదారులను ఆకట్టుకుంటూ వస్తోంది ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ (SmartPhone) దిగ్గజం రెడ్‌మీ. ఇటీవల వరుసగా కొత్త ఫోన్‌లను విడుదల చేస్తున్న రెడ్‌మీ తాజాగా మరో కొత్త ఫోన్‌ను లాంచ్‌ చేసింది..

Redmi Note 11 Pro+: భారత మార్కెట్లోకి రెడ్‌మీ కొత్త 5జీ స్మార్ట్‌ ఫోన్‌.. తక్కువ ధరలో అదిరిపోయే ఫీచర్లు..
Redmi Note 11 Pro+
Follow us on

Redmi Note 11 Pro+: ఎప్పటికప్పుడు కొంగొత్త ఫోన్‌లను పరిచయం చేస్తూ వినియోగదారులను ఆకట్టుకుంటూ వస్తోంది ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ (SmartPhone) దిగ్గజం రెడ్‌మీ. ఇటీవల వరుసగా కొత్త ఫోన్‌లను విడుదల చేస్తున్న రెడ్‌మీ తాజాగా మరో కొత్త ఫోన్‌ను లాంచ్‌ చేసింది. భారత్‌లో మరికొన్ని రోజుల్లో 5జీ నెట్‌వర్క్‌ అందుబాటులోకి రానున్న నేపథ్యంలో కొత్త 5జీ  స్మార్ట్‌ ఫోన్‌లు (5G SmartPhones) సందడి చేస్తున్నాయి. ఈ క్రమంలోనే Redmi Note 11 Pro+ పేరుతో కొత్త 5జీ ఫోన్‌ను లాంచ్‌ చేసింది. మార్చి 10వ తేదీన ఈ ఫోన్‌ను విడుదల చేశారు. తక్కువ ధరలో ఆకట్టుకునే ఫీచర్లతో Redmi ఈ 5జీ ఫోన్‌ను లాంచ్‌ చేసింది.

ఈ ఫోన్‌ ఫీచర్ల విషయానికొస్తే Redmi Note 11 Pro+ ఫోన్‌లో 108 మెగా పిక్సెల్‌ రెయిర్‌ కెమెరా, సెల్ఫీల కోసం 16 మెగాపిక్సెల్‌ ఫ్రంట్‌ కెమెరాను అందించారు. క్వాల్కమ్‌ స్నాప్‌డ్రాగన్‌ 695 6ఎమ్‌ఎమ్‌ ఆర్కిటెక్చర్‌ ప్రాసెసర్‌ ఈ ఫోన్‌ సొంతం. ఇక ఛార్జింగ్‌కు అత్యంత ప్రాధాన్యత ఇచ్చిన ఈ ఫోన్‌లో ప్రో గ్రేడ్‌ 67 వాట్స్‌ టర్బో ఛార్జ్‌ టెక్నాలజీని అందించారు. డిస్‌ప్లే విషయానికొస్తే ఈ స్మార్ట్‌ ఫోన్‌లో 6.67 ఇంచెస్‌ 120హెడ్జ్‌ సూపర్‌ ఆమోఎల్‌ఈడీ డిస్‌ప్లేను అందించారు.

ఇక 5జీ నెట్‌వర్క్‌ కోసం ఈ స్మార్ట్‌ ఫోన్‌లో ప్రత్యేక సదుపాయాన్ని అందించారు. దీంతో యూజర్లు అత్యంత వేగవంతమైన ఇంటర్‌నెట్‌ అనుభూతిని పొందుతారు.  ఈ స్మార్ట్‌ ఫోన్‌ను 6 జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌, 8 జీబీ ర్యామ్‌, 256 జీబీ స్టోరేజ్‌ను అందించారు. ధర విషయానికొస్తే రూ. 20వేల ప్రారంభ ధరతో ప్రారంభమయ్యే ఈ స్మార్ట్‌ ఫోన్‌ త్వరలోనే అన్ని ఆన్‌లైన్‌లో అందుబాటులోకి రానుంది.

Also Read: Hebah Patel: అందంతో ఆకట్టుకుంటున్న ‘హెబ్బా పటేల్’.. ఇలా చూస్తే ఎవరైనా పడిపోవాల్సిందే.. లేటెస్ట్ ఫోటోస్‌

Viral Video: పెద్ద పులి, ఎలుగుబంటి ముఖాముఖి.. జంగిల్ బుక్‌లో దృశ్యం అంటూ నెట్టింట్లో వీడియో వైరల్

Charanjit Singh Channi: పంజాబ్ ముఖ్యమంత్రి చన్నీ ఘోర పరాజయం.. రెండో స్థానాల్లోనూ ఓటమి..