
ఇంతకంటే తక్కువ ధరకు ఒక బడ్జెట్ ఫోన్ చూపిస్తే మీకు లైఫ్‌స్టైల్ సెటిల్మెంట్ అనే డైలాగ్ వింటే ఎలా ఉంటుంది. ఇక్కడ ఫోన్ ధర చూస్తే మీకు అదే డౌలాగ్ గుర్తొస్తుంది. అవును ప్రముఖ స్మార్ట్ కంపెనీ రియల్‌మి అతి తక్కువ ధరకే బడ్జెట్ ఫోన్‌ను మార్కెట్‌లోకి తెచ్చింది. అదే Realme C-2s. ఈ ఫోన్ ప్రత్యేక ఏమిటంటే.. దీని ధర ఈ ఫోన్ జస్ట్ రూ.3,400లకే లభిస్తుంది. ఇది కలా లేక నిజమా అని ఇప్పుడు చాలా మందికి అనిపించవచ్చు. కానీ, ఇది ముమ్మాటికీ నిజం. అయితే ప్రస్తుతం ఈ ఫోన్ స్టాక్ అందుబాటులో కనిపించడం లేదు. త్వరలో మళ్లీ తీసుకురావచ్చు.
Realme C-2s ఫీచర్స్ ఇవే
ఇక ఈ రియల్‌మి C-2s ఫీచర్లు విషయానికి వస్తే.. ఇది ఆండ్రాయిడ్ 9.0 ఓఎస్‌తో వస్తుంది. 6.1 ఇంచుల ఐపీఎస్ ఎల్‌సీడీ (IPS LCD) డిస్‌ప్లే, 3 GB ర్యామ్ మరియు 32 GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో వస్తుంది. ఇక కెమెరా విషయానికి వస్తే 13 MP + 2 MP బ్యాక్ కెమెరా, 5 MP ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. అలాగే 4000 mAh బ్యాటరీతో ఈ వస్తుంది. అవసరమైతే స్టోరేజ్ పెంచుకునేందుకు ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్ సపోర్ట్, 3.5 mm హెడ్‌ఫోన్ జాక్, యూఎస్‌బీ ఆన్-ది-గో ) వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.
Realme C2s quietly unveiled with a Helio P22 SoC and dual camera https://t.co/TrgzlRye8m pic.twitter.com/QMm8MbBl1c
— UniverSmartphone (@UniverSmartphon) January 7, 2020
ఈ ఫోన్ ఇండియాలో ఉందా?
అయితే ధర చూసి చాలా మంది ఆశ్చర్యపోయి, కొనడానికి సిద్ధపడే ముందు ఒక విషయం తెలుసుకోవాలి. ఈ ఫోన్ ఇంకా భారతదేశంలో లాంచ్ కాలేదు. ప్రస్తుతం 2020లో థాయ్‌లాండ్‌లో లాంచ్ అయిన ధర ప్రకారం దీని విలువ సుమారు రూ. 3,400 గా ఉంది. అయితే కొన్ని వెబ్‌సైట్ల సమాచారం ప్రకారం, ఈ ఫోన్ త్వరలోనే ఇండియాలో కూడా లాంచ్ కానుంది. కాకపోతే రియల్‌మి దీనిపై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఇంత తక్కువ ధరలో ఈ మోడల్ ఇండియాలో లాంచ్ అయితే, ఇది చాలా వేగంగా అమ్ముడుపోతుందని కొంతమంది మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు.
ఎందుకు కొనాలి?
బడ్జెట్ ఫ్రెండ్లీ, ఎంట్రీ లెవెల్ ఫోన్‌లు మాత్రమే కావాలనుకునే వారికి ఇది అన్ని విధాలా సరిపోయే మోడల్. తక్కువ ధరలో, సాధారణ ఫీచర్లు కావాలనుకునే వారు దీనిని ఉపయోగించవచ్చు. ధర కూడా చాలా తక్కువ. వృద్ధులకు, ఎక్కువ అవసరాలు లేని వారికి, స్మార్ట్‌ఫోన్ వాడకం కొత్తగా నేర్చుకోవాలనుకునే వారికి ఇది ఒక బెస్ట్ మోడల్ అని చెప్పవచ్చు.
Note: పైన పేర్కొన్న అంశాలు కేవలం ఇంటర్నెట్, నివేదికల ఆధారంగా మాత్రమే అందించబడినవి.. వీటిని Tv9 దృవీకరించడం లేదు
మరిన్ని సైన్స్ అండ్ టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.