AERO INDIA: బెంగళూరులో ప్రారంభమైన ఎయిర్ షో… సందడి చేస్తున్న యుద్ధ విమానాలు… ఈసారి ప్రత్యేకతేంటంటే..?

| Edited By:

Feb 03, 2021 | 12:26 PM

భారత వాయు సేన సామర్థ్యాన్ని ప్రపంచానికి తెలిపే ఎయిర్ ఇండియా షో కర్ణాటక రాజధాని బెంగళూరులో...

AERO INDIA: బెంగళూరులో ప్రారంభమైన ఎయిర్ షో... సందడి చేస్తున్న యుద్ధ విమానాలు... ఈసారి ప్రత్యేకతేంటంటే..?
Follow us on

Rajnath Singh : భారత వాయు సేన సామర్థ్యాన్ని ప్రపంచానికి తెలిపే ఎయిర్ ఇండియా షో కర్ణాటక రాజధాని బెంగళూరులో ప్రారంభమైంది. కేంద్ర రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ షో ఫిబ్రవరి 5వ తేదీ వరకు కొనసాగనుంది. అయితే ఈసారి భారతదేశ యుద్ధ విమానాలతో పాటు, ఇతర దేశాల యుద్ధ విమానాలు ఈషోలో సందడి చేయనున్నాయి.

రానున్న సంవత్సరాల్లో 130 బిలియన్ డాలర్ల పెట్టుబడులు…

ఎయిర్ షో ప్రారంభం సందర్భంగా రక్షణ మంత్రి మాట్లాడుతూ.. ఎయిరో షోలో అనేక దేశాలకు చెందిన సంస్థలు పాల్గొనడం చాలా ఆనందంగా ఉందన్నారు. భారత రక్షణ రంగాన్ని బలోపేతం చేసేందుకు కేంద్రం అన్ని చర్యలు తీసుకుంటోందని వివరించారు. ఆత్మనిర్భర్‌‌ భారత్‌ అభియాన్‌ కింద రక్షణ సామర్థ్యాన్ని పెంచడంలో భాగంగా వచ్చే 7-8 సంవత్సరాల్లో 130 బిలియన్‌ డాలర్లతో దళాలను ఆధునీకరించనున్నామని తెలిపారు. సాధారణ ప్రేక్షకులకు డిజిటల్‌ వేదికల ద్వారానే ఈ ప్రదర్శనను వీక్షించే వీలు కల్పించారు. భారత భౌగోళిక సమగ్రతను కాపాడుకునేందుకు, దేశ ప్రజల రక్షణకు భారత్‌ ఎల్లప్పుడూ సంసిద్ధంగా ఉందని అన్నారు. సరిహద్దుల్లో సైన్యం అప్రమత్తంగా ఉందని, ఎటువంటి దుస్సాహసాలకైనా గట్టిగా సమాధానం చెబుతామని అన్నారు.

మేకిన్ ఇండియా …

హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌ నుంచి 83 తేజస్‌ యుద్ధ విమానాల కొనుగోలుకు రూ.48వేల కోట్లతో కేంద్రం ఒప్పందం చేసుకుంది. రాజ్‌నాథ్ సమక్షంలో రక్షణశాఖ, హాల్‌ అధికారులు ఒప్పందంపై సంతకాలు చేశారు. ఈ యుద్ధ విమానాల ఒప్పందానికి గత నెల కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. దీనిపై రాజ్‌నాథ్‌ హర్షం వ్యక్తం చేశారు. రక్షణ రంగ చరిత్రలో ఇప్పటి వరకు ఇదే అతిపెద్ద ‘మేకిన్‌ ఇండియా’ రక్షణ ఒప్పందం కానుందని అన్నారు. అయితే ఈసారి ఎయిర్ షోలో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న 601 సంస్థలు తమ ఉత్పత్తులను ఇక్కడ ప్రదర్శించనున్నాయి. రాఫెల్ జెట్, అమెరికా అపాచి హెలికాప్టర్లు భారతీయ సైన్యం తరఫున విన్యాసాలు చేయనున్నాయి. అమెరికాకు చెందిన బి-1బి లాన్సర్‌ సూపర్‌సానిక్‌ బాంబర్ ఈ ప్రదర్శనలో కనువిందు చేయనుంది.

 

Also Read:

INDIA VS ENGLAND: ఇంగ్లండ్‌ను తిప్పేద్దాం… ముగ్గురు స్పిన్నర్లను బరిలోకి దించనున్న టీమిండియా…

Coronavirus Telangana: తెలంగాణలో కొత్త కరోనా కేసులు 185… మొత్తం ఎన్ని కేసులు నమోదయ్యాయంటే..?