WhatsApp: వాట్సప్‌లో ఈ ఆప్షన్ ఆన్ చేసుకోలేదా..? మీ చాట్ మొత్తం వేరేవాళ్లు చూడొచ్చు..

వాట్సప్ వాడుతున్నారా..? అయితే ఈ ఫీచర్‌ను ఖచ్చితంగా ఆన్ చేసుకోవాల్సిందే. లేకపోతే మీ సమాచారం హ్యాకర్ల బారిన పడే అవకాశముంది. వాట్సప్ హ్యాక్‌కి గురి కావడం, సమాచారం మొత్తం లీక్ కావడం వంటివి ఇటీవల చోటుచేసుకున్నాయి. అటువంటి సమయంలో ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది.

WhatsApp: వాట్సప్‌లో ఈ ఆప్షన్ ఆన్ చేసుకోలేదా..? మీ చాట్ మొత్తం వేరేవాళ్లు చూడొచ్చు..
Whatsapp

Updated on: Jun 05, 2026 | 4:39 PM

స్మార్ట్‌ఫోన్ కలిగి ఉన్న ప్రతీఒక్కరూ తప్పనిసరిగా వాట్సప్ వాడుతూ ఉంటారు. స్నేహితులతో చాటింగ్ చేయడం లేదా ఆఫీసు వర్క్, డాక్యుమెంట్స్ షేరింగ్, ఫోటోలు, వీడియోలను పంచుకోవడం లాంటి పనులు ఈ ఫ్లాట్‌ఫామ్ బాగా ఉపయోగపడుతుంది. అయితే వాట్సాప్‌ ద్వారా ఇలా ఎన్నో ప్రయోజనాలు ఉన్నప్పటికీ.. అనేక నష్టాలు కూడా ఉన్నాయి. వాట్సప్ హ్యాక్ చేయడం, మీ సమాచారాన్ని హ్యాకర్లను దొంగలించడం లాంటి ప్రమాదాలు ఉంటాయి. వీటి నుంచి భద్రత కల్పించేందుకు వాట్సాప్‌ ఎన్‌క్రిప్షన్ ఫీచర్ అందిస్తోంది. వాట్సాప్‌లో పంపే ప్రతీ మెస్సేజ్ ఎండ్ ఎండ్ ఎన్‌క్రిప్షన్ ద్వారా రక్షించబడి ఉంటాయి. దీని వల్ల మీ సమాచారానికి భద్రత అనేది ఉంటుంది. వాట్సప్‌లో ప్రతీఒక్కరూ తమకు సంబంధించిన సమాచారం మొత్తాన్ని భద్రపర్చుకుంటారు. దీంతో హ్యాక్ అయితే సమాచారం మొత్త లీకై నష్టం జరుగుతుంది. అందుకే వాట్సప్ వినియోగదారుల భద్రత కోసం ఎండ్ టు ఎండ్ ఎన్‌స్క్రిప్షన్ ఫీచర్ తీసుకొచ్చింది.

ఈ ఫీచర్ ఏంటి అంటే..?

ఎండ్ టు ఎండ్ ఎన్‌స్క్రిప్షన్ ఫీచర్ అంటే.. ఆ సమాచారాన్ని పంపినవారు, స్వీకరించినవారు మాత్రమే చూడగలరు. కానీ చాలామంది తమ వాట్సాప్ ఛాట్స్‌ను గూగుల్ డ్రైవ్ లేదా ఐక్లౌడ్‌లో బ్యాకప్ పెట్టుకుంటారు. ఇలాంటప్పుడు మీరు ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ ఫీచర్‌ను ఆన్ చేసుకోవాలి. లేకపోతే మీ క్లౌడ్ అకౌంట్ హ్యాక్ అయితే.. సంవత్సరాలుగా భద్రపరిచిన మీ మెస్సేజులు, ఫోటోలు, వీడియోలు, ముఖ్యమైన డాక్యుమెంట్స్ హ్యాకర్ల బారిన పడే ప్రమాదముంది. మీ వ్యక్తిగత సమాచారం, బ్యాంకింగ్ వివరాలు హ్యాకర్లకు తెలిస్తే అకౌంట్లలోని డబ్బులను ఖాళీ చేయవచ్చు. ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్టెడ్ బ్యాకప్ ఫీచర్ ఆన్ చేసుకుంటే మీ బ్యాకప్‌కు రక్షణ ఉంటుంది.

ఎలా సెట్ చేసుకోవాలంటే..?

-మీ ఫోన్‌లో వాట్సప్ యాప్ ఓపెన్ చేయండి

– సెట్టింగ్స్ ఆప్షన్ ఎంచుకోండి

-చాట్స్ ఎంపికను సెలక్ట్ చేసుకోండి

-అనంతరం చాట్ బ్యాకప్‌ ఆప్షన్‌పై క్లిక్ చేయండి

-ఆ తర్వాత ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్టెడ్ బ్యాకప్ అనే ఆప్షన్ ఎనేబుల్ చేసుకోండి

– పాస్‌వర్డ్ లేదా ఎన్‌క్రిప్షన్ కీని ఎంటర్ చేయండి

– పాస్‌వర్డ్, ఎన్‌క్రిప్షన్ కీని గుర్తుంచుకోండి

Follow Us