Phone Hack: ఈ చిన్న లైట్‌తో మీ ఫోన్ హ్యాక్ అయ్యిందో లేదో తెలిసిపోతుంది..?

|

Nov 18, 2024 | 5:29 PM

మీ ఫోన్ హ్యాక్ అయ్యిందని మీరు భావిస్తే, వెంటనే దాని పాస్‌వర్డ్‌ను మార్చండి. మీరు మీ మొబైల్‌లో ఇన్‌స్టాల్ చేయని అన్ని తెలియని యాప్‌లను కూడా అన్‌ఇన్‌స్టాల్ చేయండి. అలాగే ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్ నుండి ఇన్‌స్టాల్ చేయని

Phone Hack: ఈ చిన్న లైట్‌తో మీ ఫోన్ హ్యాక్ అయ్యిందో లేదో తెలిసిపోతుంది..?
Follow us on

ఫోన్ హ్యాకింగ్ గురించి మీరు చాలాసార్లు విని ఉంటారు. అయితే, మీ ఫోన్ హ్యాక్ అయితే ఏం చేయాలో మీకు తెలియకపోతే, చింతించకండి. సైబర్ హ్యాకర్లు మీ ఫోన్‌ను హ్యాక్‌ చేయవచ్చు. మీ ప్రైవేట్ సమాచారం దొంగిలించవచ్చు. మీ బ్యాంక్ ఖాతాలను యాక్సెస్ చేసి డబ్బును దొంగిలించవచ్చు. మీ ఫోన్ హ్యాక్ అయినట్లు కేవలం ఒక చిన్న ‘లైట్’ మీకు తెలియజేస్తుందని మీకు తెలుసా?. ఈ రోజు మనం అలాంటి పద్ధతుల గురించి తెలుసుకుందాం. మీరు స్మార్ట్ ఫోన్ వాడుతున్నారు కానీ మీ స్మార్ట్ ఫోన్ హ్యాక్ అయిందో లేదో తెలుసుకోవడం ఎలా?. తెలుసుకోవడానికి కొన్ని సాధారణ మార్గాలు ఉన్నాయి.

ఫోన్ హ్యాకింగ్ కోసం 5 చిట్కాలు:

  1. వింత ప్రకటనలు, పాప్-అప్‌లు: మీరు అకస్మాత్తుగా మీ ఫోన్‌లో వింత ప్రకటనలను చూడటం ప్రారంభిస్తే, ప్రత్యేకించి మీరు ఇంటర్నెట్‌ను బ్రౌజ్ చేస్తున్నప్పుడు ప్రకటన పాప్ అప్ అవుతూ ఉంటే అప్రమత్తంగా ఉండండి. ఇది మీ ఫోన్ హ్యాక్ అయిందనడానికి సంకేతం కావచ్చు.
  2. కొత్త యాప్‌లు ఇన్‌స్టాల్: మీరు ఇన్‌స్టాల్ చేయని కొన్ని యాప్‌లను అకస్మాత్తుగా మీ ఫోన్‌లో గుర్తించినట్లయితే అప్పుడు అనుమానించాల్సిందే. మీరు ఈ యాప్‌లను డౌన్‌లోడ్ చేయకుంటే, అది ప్రమాద సంకేతం కూడా కావచ్చు. ఈ యాప్‌లు మీ ఫోన్‌లో వైరస్‌లను ఉండవచ్చు. హ్యాకర్‌లు మీ సమాచారాన్ని దొంగిలించడం సులభం చేస్తుంది.
  3. బ్యాటరీ త్వరగా తగ్గిపోవడం: మీరు ఫోన్‌ని మునుపటిలా వాడుతున్నా, బ్యాటరీ త్వరగా అయిపోతుంటే మీ ఫోన్ హ్యాక్ అయినట్లే.
  4. కెమెరా లైట్: ఇంతకు ముందు పేర్కొన్న ఈ చిహ్నం. మీరు మీ ఫోన్ కెమెరాను ఉపయోగించనప్పుడు కెమెరా ‘లైట్’ (ఇండికేటర్ లైట్) ఆన్‌లో ఉంటే, మీ ఫోన్ హ్యాక్ చేయబడిందని ఇది పెద్ద సంకేతం. హ్యాకర్ మీ ఫోన్‌లో స్పైవేర్‌ను ఇన్‌స్టాల్ చేసి ఉండవచ్చు. వారు మీ ఫోన్ కెమెరాను ఉపయోగించి ప్రతి కదలికను ట్రాక్ చేస్తారు.
  5. ఫోన్ హ్యాక్ అయితే ఏం చేయాలి?:

మీ ఫోన్ హ్యాక్ అయ్యిందని మీరు భావిస్తే, వెంటనే దాని పాస్‌వర్డ్‌ను మార్చండి. మీరు మీ మొబైల్‌లో ఇన్‌స్టాల్ చేయని అన్ని తెలియని యాప్‌లను కూడా అన్‌ఇన్‌స్టాల్ చేయండి. అలాగే ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్ నుండి ఇన్‌స్టాల్ చేయని ఏదైనా అప్లికేషన్ ఉంటే, వెంటనే దాన్ని తొలగించండి. తర్వాత ఫోన్‌ని రీస్టార్ట్ చేయండి.

ఇది కూడా చదవండి: Fact Check: ఎంఎస్ ధోని పేరిట రూ.7 నాణెం విడుదల అవుతుందా? ఇందులో నిజమెంత?

మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి