అదిరిపోయే ఫీచర్స్‌తో Paytm కొత్త యాప్.. ప్రతి చెల్లింపుపై బంగారం మీ సొంతం..!

భారతీయ UPI పేమెంట్ యాప్ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. పేటీఎం తన యాప్ పూర్తిగా కొత్త వెర్షన్‌ను ప్రారంభించింది. ఇందులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఫీచర్లను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ కొత్త AI-ఆధారిత పేటీఎం యాప్ వినియోగదారులకు చెల్లింపులను వేగంగా, తెలివిగా, మరింత వ్యక్తిగతీకరించగలదని కంపెనీ పేర్కొంది.

అదిరిపోయే ఫీచర్స్‌తో Paytm కొత్త యాప్.. ప్రతి చెల్లింపుపై బంగారం మీ సొంతం..!
Paytm

Updated on: Nov 10, 2025 | 6:21 PM

భారతీయ UPI పేమెంట్ యాప్ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. పేటీఎం తన యాప్ పూర్తిగా కొత్త వెర్షన్‌ను ప్రారంభించింది. ఇందులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఫీచర్లను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ కొత్త AI-ఆధారిత పేటీఎం యాప్ వినియోగదారులకు చెల్లింపులను వేగంగా, తెలివిగా, మరింత వ్యక్తిగతీకరించగలదని కంపెనీ పేర్కొంది. కొత్త అప్‌డేట్ గోల్డ్ కాయిన్స్ రివార్డ్ సిస్టమ్, స్మార్ట్ బడ్జెటింగ్, AI ట్యాగ్‌లు, గోప్యతా నియంత్రణలతో సహా 15 కంటే ఎక్కువ ఫీచర్లను ప్రవేశపెడుతోంది.

పేటీఎం యాప్‌లో AI

Paytm కొత్త యాప్ వినియోగదారుల లావాదేవీ చరిత్రను బాగా అర్థం చేసుకోవడానికి కృత్రిమ మేధస్సును ఉపయోగిస్తుంది. ఈ యాప్ ఇప్పుడు వినియోగదారుల ఖర్చులను షాపింగ్, బిల్లులు, ప్రయాణం, యుటిలిటీలు వంటి వర్గాలుగా అటోమెటిక్‌గా వర్గీకరిస్తుంది. ఇది బడ్జెటింగ్‌ను సులభతరం చేస్తుంది. వినియోగదారులకు వారి ఆర్థిక అలవాట్లపై అవగాహన కల్పిస్తుంది. కొత్త బ్యాలెన్స్ హిస్టరీ విభాగం అన్ని UPI ఖాతాల మొత్తం బ్యాలెన్స్‌ను కూడా ఏకకాలంలో ప్రదర్శిస్తుంది. వ్యక్తిగత బ్యాలెన్స్‌లను జోడించాల్సిన అవసరాన్ని తొలగిస్తుంది.

పేటీఎం గోల్డ్ కాయిన్స్

ఈ అప్‌డేట్‌లో పేటీఎం గోల్డ్ కాయిన్స్ అనే కొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. ఇది ప్రతి చెల్లింపుకు వినియోగదారులకు డిజిటల్ బంగారాన్ని బహుమతిగా ఇస్తుంది. చెల్లింపు యాప్ పొదుపులను లావాదేవీలలోకి అనుసంధానించడం ఇదే మొదటిసారి. ఈ ఫీచర్ కింద, డిపాజిట్ చేసిన బంగారాన్ని తరువాత నిజమైన డిజిటల్ బంగారంగా మార్చవచ్చు. ప్రతి పేటీఎం చెల్లింపు ఇప్పుడు బంగారు చెల్లింపుగా మారుతుందని కంపెనీ సీఈఓ విజయ్ శేఖర్ శర్మ పేర్కొన్నారు. ఈ ఆవిష్కరణ భారతీయ వినియోగదారులను పొదుపు చేయడానికి ప్రోత్సహించడానికి ఒక కొత్త మార్గం అని వివరించారు.

మ్యాజిక్ పేస్ట్, స్మార్ట్ స్కానర్ ఫీచర్లు

కొత్త Paytm యాప్‌లో మ్యాజిక్ పేస్ట్ వంటి అనేక ఆచరణాత్మక ఫీచర్లు కూడా ఉన్నాయి. ఇది WhatsApp నుండి కాపీ చేసిన బ్యాంక్ లేదా IFSC వివరాలను ఆటో-ఫిల్ చేస్తుంది. ఇష్టమైన కాంటాక్ట్స్ ఫీచర్ మీరు తరచుగా ఉపయోగించే కాంటాక్ట్‌లను సేవ్ చేయడానికి అనుమతిస్తుంది. చెల్లింపులను దాచుకునేందుకు, వినియోగదారులు వారి గోప్యతను కాపాడుకోవడానికి అనుమతిస్తుంది. అంతేకాదు యాప్‌లోని కొత్త Paytm స్కానర్ ఇప్పుడు ఏ కోణం నుండి అయినా QR కోడ్‌లను గుర్తించగలదు. తక్కువ కాంతిలో కూడా ఆటోమెటిక్‌గా ఫ్లాష్‌లైట్‌ను ఆన్ చేస్తుంది. జూమ్-ఇన్ ఫీచర్‌కు మద్దతు ఇస్తుంది.

NRI, ఎక్స్‌ఫర్ట్స్ కోసం ప్రత్యేక లక్షణాలు

కొత్త Paytm యాప్ ఇప్పుడు 12 దేశాల నుండి వచ్చిన నాన్-రెసిడెంట్ ఇండియన్స్ (NRI) లకు మద్దతు ఇస్తుంది. వారు తమ అంతర్జాతీయ మొబైల్ నంబర్‌ను NRE లేదా NRO బ్యాంక్ ఖాతాకు లింక్ చేయడం ద్వారా భారత రూపాయలలో UPI చెల్లింపులు చేయవచ్చు. అదనంగా, వైద్యులు, జిమ్ ట్రైనర్లు లేదా టాక్సీ డ్రైవర్లు వంటి నిపుణులు ఇప్పుడు రిసీవ్ మనీ విడ్జెట్‌ని ఉపయోగించి వారి హోమ్ స్క్రీన్‌ల నుండి చెల్లింపులను స్వీకరించవచ్చు.

మరిన్ని సైన్స్ అండ్ టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..