
డిజిటల్ యుగంలో బ్యాంకింగ్, ఆన్‌లైన్ షాపింగ్, సోషల్ మీడియా, ఆఫీస్ పనులు అన్నీ ఇంటర్నెట్ ఆధారంగా మారిపోయాయి. దీంతో బలమైన పాస్‌వర్డ్‌ల ప్రాముఖ్యత కూడా పెరిగింది. బలహీనమైన పాస్‌వర్డ్ ఉపయోగించడం అనేది ఇంటి తలుపు తెరిచి ఉంచినట్లేనని సైబర్ భద్రతా నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే చాలా మంది కష్టమైన పాస్‌వర్డ్‌లను సృష్టించినప్పటికీ వాటిని గుర్తుంచుకోవడంలో ఇబ్బంది పడుతున్నారు. దీనికి పరిష్కారంగా నిపుణులు పాస్‌ఫ్రేజ్ అనే కొత్త విధానాన్ని సూచిస్తున్నారు.
పాస్‌ఫ్రేజ్ అంటే ఒక చిన్న వాక్యాన్ని పాస్‌వర్డ్‌గా మార్చడం. ఉదాహరణకు నాకు ప్రతి ఉదయం 6 గంటలకు టీ ఇష్టం అనే వాక్యాన్ని తీసుకుంటే, దానిలోని పదాలను మార్చి అక్షరాలు, సంఖ్యలు, ప్రత్యేక గుర్తులు కలిపి బలమైన పాస్‌వర్డ్‌గా మార్చవచ్చు. ఉదాహరణకు..
సైబర్ నిపుణుల ప్రకారం హ్యాకర్లు సాధారణ పదాలు, సంఖ్యలను పరీక్షించే సాఫ్ట్‌వేర్‌లను ఉపయోగిస్తారు. కానీ పూర్తి వాక్యాన్ని ఆధారంగా చేసుకున్న పాస్‌ఫ్రేజ్‌ను ఛేదించడం చాలా కష్టం. ఆధునిక కంప్యూటర్లకూ దీనిని క్రాక్ చేయడానికి సంవత్సరాలు పట్టే అవకాశం ఉంటుంది. అదనంగా పాస్‌వర్డ్‌ను ఎవరితోనూ పంచుకోకూడదు. పబ్లిక్ Wi-Fi (రైల్వే స్టేషన్, కేఫ్‌లలో)లో బ్యాంకింగ్ లేదా సున్నితమైన ఖాతాలను ఉపయోగించకూడదు. అలాగే ప్రతి 3 నుంచి 6 నెలలకు ఒకసారి ప్రధాన పాస్‌వర్డ్‌లను మార్చడం కూడా భద్రతకు మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి