AI Mimics: ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌తో మరో అద్భుతం.. ఇకపై మనుషుల గొంతు కూడా

|

Apr 06, 2024 | 2:57 PM

అయితే ఇప్పుడు ఏకంగా గొంతును మార్చే టెక్నాలజీ వచ్చేస్తోంది. ప్రముఖ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ కంపెనీ ఓపెన్ ఏఐ ప్రస్తుతం వాయిస్‌ అసిస్టెంట్ రంగలోకి అడుగుపెట్టింది. ఇందులో భాగంగానే వాయిస్‌ ఇంజిన్‌ అనే టూల్‌ను పరీక్షిస్తోంది. ఈ టూల్‌ సహాయంతో మనుషులు వాయిస్‌ను ఇమిటేట్‌ చేయొచ్చు. ఒకరకంగా చెప్పాలంటే అచ్చంగా మిమిక్రీ లాంటిది...

AI Mimics: ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌తో మరో అద్భుతం.. ఇకపై మనుషుల గొంతు కూడా
Open Ai
Follow us on

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ ప్రస్తుతం ప్రపంచాన్ని శాసిస్తోంది. కృత్రిమ మేథతో టెక్నాలజీ రూపురేఖలు మారిపోతున్నాయి. ఇక ప్రస్తుతం దాదాపు అన్ని రంగాల్లో ఏఐ వినియోగం అనివార్యంగా మారింది. అయితే మారుతోన్న ఈ టెక్నాలజీతో సమస్యలు కూడా ఉత్పన్నమవుతున్నాయి. ఏఐ టెక్నాలజీ ద్వారా డీప్‌ ఫేక్‌ వీడియోలు ఎంతటి సంచలం సృష్టించాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

అయితే ఇప్పుడు ఏకంగా గొంతును మార్చే టెక్నాలజీ వచ్చేస్తోంది. ప్రముఖ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ కంపెనీ ఓపెన్ ఏఐ ప్రస్తుతం వాయిస్‌ అసిస్టెంట్ రంగలోకి అడుగుపెట్టింది. ఇందులో భాగంగానే వాయిస్‌ ఇంజిన్‌ అనే టూల్‌ను పరీక్షిస్తోంది. ఈ టూల్‌ సహాయంతో మనుషులు వాయిస్‌ను ఇమిటేట్‌ చేయొచ్చు. ఒకరకంగా చెప్పాలంటే అచ్చంగా మిమిక్రీ లాంటిది. కేవలం 15 సెకండ్ల నిడివి గల ఆడియోను రికార్డ్‌ చేస్తే చాలు గొంతులను అనుకరిస్తుంది.

ఇదిలా ఉంటే ఇది టెక్నాజలజీ పరంగా ఒక అద్భుతమేనని చెప్పినా, దీనివల్ల అదే స్థాయిలో నష్టాలు కూడా ఉంటాయని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా దేశంలో ఎన్నికలు ఉన్న ప్రస్తుత నేపథ్యంలో ఈ టూల్ వల్ల పలు భయాందోనలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే కొందరు రాజకీయ నాయకుల గొంతుతో పలు రకాల ఆడియోలు వైరల్‌ అవుతున్నాయి.

అయితే ఈ విషయంలో ఓపెన్ ఏఐ ఒక నిబంధనను పాటిస్తోంది. వాయిస్‌ ఇంజిన్‌ను పరీక్షించటానికి అనుమతి పొందినవారూ నిబంధనలు కచ్చితంగా పాటించాల్సిందేనని చెబుతోంది. అలాగే ఎవరి వాయిస్‌ను అయితే మిమిక్రీ చేయాలనుకుంటున్నారో ముందుగా వారి అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని కంపెనీ చెబుతోంది. అంతేకాకుండా సదరు వాయిస్‌ ఏఐ ద్వారా సృష్టించినవి ప్రకటించాల్సి ఉంటుంది.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..