HMD Arrow: భారత మార్కెట్లోకి మరో కొత్త ఫోన్‌ వచ్చేస్తోంది.. ఫీచర్స్‌ ఇలా..

హెచ్‌ఎమ్‌డీ ఆరో పేరుతో ఫోన్‌ను తీసుకొస్తుందని గత కొన్ని రోజులుగా ప్రచారం జరిగింది. అయితే కంపెనీ మాత్రం ఇప్పటి వరకు పేరును ఖరారు చేయలేదు. అయితే ఈ ఫోన్‌ను కంపెనీ హెచ్‌ఎమ్‌డీ ప్లస్‌కి రీబ్రాండ్‌ వర్షన్‌గా తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. జులై 25వ తేదీన భారత్‌లోకి ఈ ఫోన్‌ను తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతానికి అయితే ఈ ఫోన్‌ను...

HMD Arrow: భారత మార్కెట్లోకి మరో కొత్త ఫోన్‌ వచ్చేస్తోంది.. ఫీచర్స్‌ ఇలా..
Hmd Smartphone

Updated on: Jul 12, 2024 | 5:05 PM

భారత మార్కెట్లోకి మరో కొత్త బ్రాండ్‌ స్మార్ట్‌ ఫోన్‌ లాంచింగ్‌కు సిద్ధమవుతోంది. ప్రముఖ ఎలక్ట్రానిక్‌ సంస్థ నోకియా ఫోన్ తయారీ సంస్థ అయిన హెచ్‌ఎండీ భారత్‌లో తొలి స్మార్ట్‌ ఫోన్‌ను లాంచ్‌ చేయనుంది. గ్లోబల్‌ మార్కెట్లో హెచ్‌ఎండీ ఇప్పటికే పలు ఫోన్‌లను తీసుకురాగా, తాజాగా మొదటిసారి భారత మార్కెట్లోకి తొలిసారి ఈ ఫోన్‌ను తీసుకొస్తోంది. ఇంతకీ ఏంటా ఫోన్‌.? ఇందులో ఎలాంటి ఫీచర్లు ఉండనున్నాయి.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

హెచ్‌ఎమ్‌డీ ఆరో పేరుతో ఫోన్‌ను తీసుకొస్తుందని గత కొన్ని రోజులుగా ప్రచారం జరిగింది. అయితే కంపెనీ మాత్రం ఇప్పటి వరకు పేరును ఖరారు చేయలేదు. అయితే ఈ ఫోన్‌ను కంపెనీ హెచ్‌ఎమ్‌డీ ప్లస్‌కి రీబ్రాండ్‌ వర్షన్‌గా తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. జులై 25వ తేదీన భారత్‌లోకి ఈ ఫోన్‌ను తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతానికి అయితే ఈ ఫోన్‌ను హెచ్‌ఎండీ ప్లస్‌గానే పిలుస్తున్నారు. ఈ ఫోన్‌ ఫీచర్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

ఈ స్మార్ట్‌ ఫోన్‌ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 6.65 ఇంచెస్‌తో కూడిన హెచ్‌డీ+ స్క్రీన్‌ను అందించనున్నట్లు తెలుస్తోంది. అలాగే 1612*720 పిక్సెల్ రెజుల్యూషన్, ఐపీఎస్ ఎల్సీడీ ప్యానెల్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 600 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్తో ఈ స్క్రీన్‌ను తీసుకొచ్చే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. ఇక ప్రాసెసర్‌ విషయానికొస్తే ఈ ఫోన్‌ యూనిఎస్ఓసీ టీ606 చిప్సెట్, మాలి-జీ57 ఎంపీ1 జీపీయూతో పనిచేస్తుంది. ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టమ్‌పై ఈ ఫోన్‌ పనిచేస్తుంది. ఈ ఫోన్‌కి రెండేళ్లు ఆపరేటింగ్ సిస్టమ్‌ అప్‌డేట్స్‌తో పాటు, 3 ఏళ్లు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ లభించనున్నాయి.

ఇక ఈ ఫోన్‌లో 6 జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌తో తీసుకొస్తున్నాు కెమెరా విషయానికొస్తే ఇందులో 13 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్ కెమెరాను, సెల్ఫీలు.. వీడియో కాల్స్‌ కోసం ఇందులో 8 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్‌ కెమెరాను ఇవ్వనున్నారు. మైక్రోఎస్డీ కార్డుతో ఇంటర్నల్‌ మెమోరీని 256 జీబీ వరకు పెంచుకోవచ్చు. ఇక 10 వాట్స్‌ ఫాస్ట్‌ చార్జింగ్‌కు సపోర్ట్‌ చేసే 5000 ఎంఏహెచ్‌ బ్యాటరీని ఇవ్వనున్నారు. సెక్యూరిటీ కోసం సైడ్‌ మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ స్కానర్‌ను ఇవ్వనున్నారు.

హెచ్‌ఎండీ ప్లస్‌ ఫోన్‌లో డ్యూయల్ సిమ్, 4జీ, బ్లూటూత్ 5.0, డ్యూయల్ బ్యాండ్ వై-ఫై, ఎన్ఎఫ్‌సీ, 3.5ఎంఎం ఆడియో జాక్ వంటి కనెక్టివిటీ ఫీర్లను అందించనున్నార. ఐపీ52 రేటింగ్‌తో కూడిన వాటర్‌ రెసిస్టెంట్‌, సింగిల్ స్పీకర్ ఫీచర్లను అందించనున్నట్లు తెలుస్తోంది. ధర విషయానికొస్తే ఈ స్మార్ట్‌ ఫోన్‌ ప్రారంభ వేరియంట్‌ రూ. 15వేల లోపు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..