బైక్​ లవర్స్‌కి అదిరిపోయే న్యూస్.. ఇంజిన్​, లుక్​తో పిచ్చెక్కించేస్తున్న Norton కొత్త బైక్​

ప్రముఖ బ్రిటిష్ టూవీలర్ బ్రాండ్ Norton బైక్ ప్రియులకు కొత్త మోడల్‌ను పరిచయం చేసింది. 454cc సింగిల్ సిలిండర్ ఇంజిన్‌తో రూపొందిస్తున్న కొత్త రోడ్‌స్టర్ బైక్‌ను EICMA వేదికగా ఆవిష్కరించింది. ఇప్పటికే ఈ బైక్‌కు సంబంధించిన ఫస్ట్ లుక్‌ను కంపెనీ విడుదల చేసింది. ఆకట్టుకునే డిజైన్, ప్రత్యేకమైన అల్యూమినియం ఛాసిస్, ఆధునిక ఫీచర్లతో ఈ మోడల్ ఆసక్తిని పెంచుతోంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న వివరాల ప్రకారం, మిడ్‌సైజ్ బైక్ విభాగంలో ఇతర మోడళ్లకు పోటీగా నిలిచే అవకాశం ఉంది.

బైక్​ లవర్స్‌కి అదిరిపోయే న్యూస్.. ఇంజిన్​, లుక్​తో పిచ్చెక్కించేస్తున్న Norton కొత్త బైక్​
New Norton 454 Roadster.

Updated on: Nov 11, 2026 | 6:10 AM

Norton బైక్‌లో 454cc సింగిల్ సిలిండర్ ఇంజిన్‌ను ఉపయోగిస్తున్నారు. ఇది గరిష్ఠంగా 45Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అయితే ఇంజిన్ ఎంత హార్స్‌పవర్‌ను అందిస్తుందనే విషయాన్ని Norton ఇంకా వెల్లడించలేదు. బైక్‌కు సంబంధించిన పూర్తి సాంకేతిక వివరాలు, ధర, ఇతర ఫీచర్లను కంపెనీ త్వరలో ప్రకటించే అవకాశం ఉంది. భారత్‌లోనూ ఈ బైక్ విడుదల కానుందనే సమాచారం బైక్ లవర్స్‌లో ఆసక్తిని పెంచుతోంది.

అల్యూమినియం ఛాసిస్..

Norton కొత్త రోడ్‌స్టర్‌లో అల్యూమినియం ఛాసిస్‌ను ప్రత్యేకంగా రూపొందించారు. దీని ఫ్రేమ్ డిజైన్ Norton Atlas మోడళ్లను పోలి ఉంటుందని తెలుస్తోంది. ఇందులో 17 ఇంచుల అల్లాయ్ వీల్స్ ఉండే అవకాశం ఉంది. సస్పెన్షన్ కోసం ముందు భాగంలో USD ఫోర్కులు, వెనుకవైపు మోనోషాక్ సెటప్‌ను అందించవచ్చని అంచనా. బ్రేకింగ్ కోసం రెండు వైపులా డిస్క్ బ్రేకులు ఉండనున్నట్లు సమాచారం.

ఫీచర్ల విషయానికి వస్తే ఇందులో 8 ఇంచుల TFT డిస్‌ప్లేను అందించనున్నారు. Norton Manx R, Atlas మోడళ్లలోనూ ఇలాంటి డిస్‌ప్లే కనిపిస్తుంది. ఫ్యూయల్ ట్యాంక్ నుంచి వెనుక భాగం వరకు ఆకట్టుకునే బాడీ ప్యానెల్స్, చిన్న టెయిల్ సెక్షన్, కాంపాక్ట్ సీటు బైక్‌కు స్పోర్టీ లుక్‌ను అందిస్తున్నాయి. ప్రస్తుతం విడుదల చేసిన ఫొటోల్లో ఈ బైక్ పెర్ల్ లిలాక్ రంగులో కనిపిస్తోంది.

2027 సెకండాఫ్‌లో భారత్‌లో..

Norton కొత్త బైక్‌లను TVS భాగస్వామ్యంతో భారత్‌లోకి తీసుకురావాలని యోచిస్తోంది. హోసూర్ ప్లాంట్‌లో వీటిని తయారు చేసే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. 2027 జనవరి నుంచి మార్చి మధ్య ముందుగా Atlas, ఆ తర్వాత Manx మోడళ్లను భారత మార్కెట్లోకి తీసుకురావాలని TVS భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక 454cc సింగిల్ సిలిండర్ రోడ్‌స్టర్ మాత్రం 2027 రెండో అర్ధభాగంలో భారత్‌తో పాటు అంతర్జాతీయ మార్కెట్లలో విడుదలయ్యే అవకాశం ఉంది.

Norton ఇప్పటికే భారత్‌లో Rowen, Inter, Avalon పేర్లను ట్రేడ్‌మార్క్ చేసింది. కొత్త రోడ్‌స్టర్‌కు వీటిలో ఏదైనా పేరు పెట్టే అవకాశం ఉందని అంచనాలు ఉన్నాయి. అయితే బైక్ అధికారిక పేరు, ధర, పూర్తి ఇంజిన్ వివరాలపై కంపెనీ ప్రకటన వెలువడాల్సి ఉంది.

Loading...
Unable to load recommendations.
Follow Us