iPad Air: యాపిల్ కొత్త లాంచ్‌పై ఊహాగానాలు.. ఆ అప్‌డేటెడ్ వెర్షన్‌కు ముహూర్తం ఫిక్స్ అయ్యిందా?

|

Feb 14, 2024 | 8:23 AM

యాపిల్ మరో కొత్త ఉత్పత్తితో మార్కెట్లోకి వస్తున్నట్లు పుకార్లు మొదలయ్యాయి. యాపిల్ నెక్ట్స్ జెన్ ఐ ప్యాడ్ ఎయిర్ ను త్వరలో లాంచ్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు నెట్ సర్కిళ్లలో ఓ వార్త హల్ చల్ చేస్తోంది. వచ్చే నెల అంటే మార్చినెల ప్రారంభంలోనే ఇది మార్కెట్లోకి ఎంట్రీ ఇవ్వొచ్చని చెబుతున్నారు. కొత్త ఈ ఐప్యాడ్ ఎయిర్ కు సంబంధించిన అనేక అంశాలను నెట్లో లీక్ అయ్యాయి.

iPad Air: యాపిల్ కొత్త లాంచ్‌పై ఊహాగానాలు.. ఆ అప్‌డేటెడ్ వెర్షన్‌కు ముహూర్తం ఫిక్స్ అయ్యిందా?
Apple Ipad Air
Follow us on

యాపిల్ బ్రాండ్ అంటేనే అదో రేంజ్ గా వీల్ అయ్యే వారు ఉన్నారు. ఆ కంపెనీ ఉత్పత్తులను వాడటం స్టేటస్ సింబల్ గా భావించేవారు మనకు కనిపిస్తారు. ఏమాత్రం అవకాశం ఉన్నా వాటిని కొనుగోలు చేయాలని చూస్తుంటారు. యాపిల్ నుంచి వచ్చిన ఐఫోన్, ఐ ప్యాడ్, ఇయర్ బడ్స్ ఇలా గ్యాడ్జెట్ ఏదైనా వాటికి డిమాండ్ ఉంటుంది. కంపెనీ ఎప్పుడు ఏ వస్తువును కొత్తగా లాంచ్ చేస్తుందా అని అందరూ ఎదురుచూస్తూ ఉంటారు. గ్లోబల్ వైడ్ గా ఇదే ట్రెండ్ కొనసాగుతోంది. ఈ క్రమంలో యాపిల్ మరో కొత్త ఉత్పత్తితో మార్కెట్లోకి వస్తున్నట్లు పుకార్లు మొదలయ్యాయి. యాపిల్ నెక్ట్స్ జెన్ ఐ ప్యాడ్ ఎయిర్ ను త్వరలో లాంచ్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు నెట్ సర్కిళ్లలో ఓ వార్త హల్ చల్ చేస్తోంది. వచ్చే నెల అంటే మార్చినెల ప్రారంభంలోనే ఇది మార్కెట్లోకి ఎంట్రీ ఇవ్వొచ్చని చెబుతున్నారు. అయితే ఈ విషయాన్ని యాపిల్ సంస్థ మాత్రం ధ్రవీకరించలేదు. అయితే కొత్త ఈ ఐప్యాడ్ ఎయిర్ కు సంబంధించిన అనేక అంశాలను నెట్లో లీక్ అయ్యాయి. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.

ఐ ప్యాడ్ ఎయిర్ డిజైన్, ఫీచర్లు..

6వ తరం ఐప్యాడ్ ఎయిర్ యాపిల్ ఎం2, ఎం3 చిప్ తో వస్తుంది. 2020 ఐప్యాడ్ ఎయిర్‌లో ఆపిల్ ప్రవేశపెట్టిన సొగసైన ఫ్లాట్-ఎడ్జ్ డిజైన్‌ను కంపెనీ కలిగి ఉండవచ్చు. ఈ మార్పు ఫారమ్ ఫ్యాక్టర్ పరంగా ఉండవచ్చు, ఇప్పటికే ఉన్న 10.9-అంగుళాల మోడల్‌తో పాటు పెద్ద 12.9-అంగుళాల డిస్‌ప్లే ఎంపిక వైపు పుకార్లు సూచిస్తున్నాయి. ఇది ఐప్యాడ్ ప్రో లైనప్‌లో కనిపించే వ్యత్యాసాన్ని ప్రతిబింబిస్తుంది.

యాపిల్ సప్లై చైన్ నుంచి లీకైన స్కీమాటిక్స్ కొత్త ఐప్యాడ్ ఎయిర్ మోడల్‌ల కోసం పునఃరూపకల్పన చేసిన కెమెరా బంప్‌ను సూచిస్తున్నాయి. ఇది గత ఐఫోన్ డిజైన్‌లను గుర్తుకు తెచ్చే లేఅవుట్‌ను సూచిస్తుంది. ఈ సమగ్ర పరిశీలన కెమెరా ఫ్లాష్‌ను చేర్చడానికి మార్గం సుగమం చేస్తుంది. అయితే ఈ విషయాలనేవి యాపిల్ ధ్రువీకరించలేదు. అంతేకాక ఐప్యాడ్ ప్రో కోసం రూపొందించిన ల్యాప్ టాప్ స్టైల్ అల్యూమినియం డిజైన్ తో రీ బిల్ట్ చేసిన మ్యాజిక్ కీబోర్డు ఉంటుందని పుకార్లు వస్తున్నాయి. అయితే రానున్న కొత్త ఐ ప్యాడ్ ఎయిర్ దీనితో వస్తుందని చెప్పడం కష్టం. కాగా బ్లూమ్‌బెర్గ్ కు చెంది మార్క్ గుర్మాన్ నివేదికల ప్రకారం, కొత్త మ్యాజిక్ కీబోర్డ్ ఐప్యాడ్ ప్రో లైనప్‌కుమాత్రమే ప్రత్యేకంగా ఉంటుందని పేర్కొంది. కొత్త మ్యాజిక్ కీబోర్డ్ ఐప్యాడ్ ప్రో కోసం మరొక డిఫరెన్సియేటర్‌ను అందిస్తుందని వివరించింది. ఆపిల్ ఐప్యాడ్ ఎయిర్ కోసం ఆ యాక్సెసరీ కొత్త వెర్షన్‌ను ప్లాన్ చేయడం లేదని చెబుతోంది. కొత్త 12.9-అంగుళాల మోడల్ ఆ స్క్రీన్ పరిమాణానికి ప్రస్తుత మ్యాజిక్ కీబోర్డ్‌ను ఉపయోగిస్తుందని ఆ నివేదిక చెప్పింది.

ఇవి కూడా చదవండి

ఈ వివరాలు లేవు..

నిర్దిష్ట రంగు ఎంపికలు, అదనపు ఫీచర్లకు సంబంధించిన వివరాలు ప్రస్తుతానికి ఏమీ తెలియవు. రాబోయే ఐప్యాడ్ ఎయిర్ టాబ్లెట్ గురించి మరిన్ని లీక్‌లు త్వరలో వెలువడే అవకాశం ఉంది. కాగా 5వ తరం ఐప్యాడ్ ఎయిర్ 2022లో వచ్చింది. 54,999కి కొనుగోలు చేయొచ్చు. ప్రస్తుతం ఇది ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌లో రూ. 52,999 ప్రారంభ ధరతో అందుబాటులో ఉంది. కాబట్టి కొత్త వెర్షన్ పెండింగ్‌లో ఉంది.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..