Amazon Electronics Sale: అమెజాన్ మరో కొత్త సేల్‌.. అన్ని గ్యాడ్జెట్లపై అదిరే ఆఫర్లు.. కొద్ది రోజులే అవకాశం..

|

Feb 14, 2024 | 7:52 AM

ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్ ఫారం అమెజాన్ మరోసేల్ తో ముందుకొచ్చింది. అన్ని రకాల ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లపై అదిరే ఆఫర్లను ప్రకటించింది. స్మార్ట్ వాచ్ లు, హెడ్ ఫోన్లు, ల్యాప్ టాప్స్ వంటి అనేక రకాల ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లపై ఏకంగా 80శాతం వరకూ తగ్గింపు ను అందించేందుకు అమెజాన్ మెగా ఎలక్ట్రానిక్స్ డేస్ సేల్ 2024ను ప్రారంభించింది. ఫిబ్రవరి 12న ప్రారంభమైన ఈ సేల్ 19 వరకూ కొనసాగనుంది.

Amazon Electronics Sale: అమెజాన్ మరో కొత్త సేల్‌.. అన్ని గ్యాడ్జెట్లపై అదిరే ఆఫర్లు.. కొద్ది రోజులే అవకాశం..
Amazon Mega Electronics Sale
Follow us on

ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్ ఫారం అమెజాన్ మరోసేల్ తో ముందుకొచ్చింది. అన్ని రకాల ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లపై అదిరే ఆఫర్లను ప్రకటించింది. స్మార్ట్ వాచ్ లు, హెడ్ ఫోన్లు, ల్యాప్ టాప్స్ వంటి అనేక రకాల ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లపై ఏకంగా 80శాతం వరకూ తగ్గింపు ను అందించేందుకు అమెజాన్ మెగా ఎలక్ట్రానిక్స్ డేస్ సేల్ 2024ను ప్రారంభించింది. ఫిబ్రవరి 12న ప్రారంభమైన ఈ సేల్ 19 వరకూ కొనసాగనుంది. వీటిల్లో 80శాతం వరకూ తగ్గింపులో వివిధ రకాల ప్రయోజనాలను అందిస్తోంది. వాటిల్లో కార్డు ఆఫర్లు ఉన్నాయి. మీరు ఎస్బీఐ క్రెడిట్ కార్డులు వినియోగిస్తుంటే అదనంగా 10శాతం తక్షణ తగ్గింపును కూడా పొందొచ్చు. మీరేదైనా వస్తువు కొనుగోలు చేయాలన్నా.. లేక మీ ప్రియమైన వారికి మంచి బహుమతి ఇవ్వాలన్నా ఇది సరైన సమయం. ఇంత పెద్ద మొత్తంలో డిస్కౌంట్ మళ్లీ మళ్లీ రాదు. ఈ అమెజాన్ మెగా ఎలక్ట్రానిక్స్ సేల్ 2024 గురించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

అమేజ్‌ఫిట్ యాక్టివ్ స్మార్ట్‌వాచ్..

అమెజాన్ మెగా ఎలక్ట్రానిక్స్ సేల్లో స్మార్ట్ వాచ్ లపై అదిరే డిస్కౌంట్స్ ఉన్నాయి. వాటిల్లో ఇటీవల విడుదలైన అమేజ్‌ఫిట్ యాక్టివ్ స్మార్ట్‌వాచ్ పై కూడా భారీ తగ్గింపు ఉంది. ఈ స్మార్ట్ వాచ్ అసలు ధర రూ. 12,999. ఇప్పుడు అమెజాన్ మెగా ఎలక్ట్రానిక్స్ డేస్‌లో భాగంగా ఇది అందుబాటులో ఉంది. దీనిలో ఏఐ ఫిట్‌నెస్ కోచింగ్, జీపీఎస్ ట్రాకింగ్, బ్లూటూత్ కాలింగ్‌ వంటి ఫీచర్లను కలిగి ఉంది. ఇది ఆరోగ్యం, కనెక్టివిటీ కోసం అధునాతన ఫీచర్‌లను అందిస్తుంది. కంపెనీ ప్రమోషన్ లో భాగంగా దీనిని తక్కువ ధరకు కంపెనీ అందుబబాటులో ఉంచింది.

బోట్ వేవ్ సిగ్మా స్మార్ట్‌వాచ్..

బోట్ వేవ్ సిగ్మా స్మార్ట్‌వాచ్ అసలు ధర రూ. 1,399గా ఉంది. మెగా ఎలక్ట్రానిక్స్ డేస్ సేల్‌లో ఇది కూడా ఉంది. దీనిలో 2.01-అంగుళాల హెచ్డీ డిస్‌ప్లే, డీఐవై వాచ్ ఫేస్ స్టూడియో, బ్లూటూత్ కాలింగ్‌తో పాటు బహుముఖ ప్రజ్ఞ, కార్యాచరణను అందిస్తుంది. కస్టమర్‌లు ఈ స్టైలిష్, ఫీచర్-రిచ్ స్మార్ట్‌వాచ్‌ని తక్కువ ధరకు సొంతం చేసుకోవడానికి ఈ సేల్ ను వినియోగించుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

బోట్ ఎయిర్‌డోప్స్ 141 ఏఎన్సీ ఇయర్‌బడ్స్..

ఈ ఇయర్‌బడ్‌లు సాధారణంగా రూ. 1,599 ధర కలిగి ఉంటాయి,. ఇవి మెగా ఎలక్ట్రానిక్స్ డేస్ ప్రమోషన్‌లో ఉన్నాయి. లాగ్-ఫ్రీ ఆడియో, ఈఎన్ఎక్స్ నాయిస్ క్యాన్సిలేషన్ కోసం బీస్ట్ మోడ్ వంటి అధునాతన సాంకేతికతను కలిగి ఉన్నాయి. ఇవి లీనమయ్యే శ్రవణ అనుభవాన్ని అందిస్తాయి. మరింత తక్కువ ధరకే ఈ ఇయర్‌బడ్‌లను ఆడియో ఔత్సాహికులు కొనుగోలు చేయొచ్చు.

బౌల్ట్ ఆడియో జెడ్40 ఇయర్‌ఫోన్‌లు..

బౌల్ట్ ఆడియో జెడ్40 ఇయర్‌ఫోన్‌లు, సాధారణంగా రూ.1,399 ధరతో అందుబాటులో ఉన్నాయి. 60 గంటల ప్లేటైమ్, ఫాస్ట్ ఛార్జింగ్, ఈఎన్సీ మైక్ వంటి ఫీచర్‌లను అందిస్తోంది. అధిక-నాణ్యతగల ఆడియోను అందిస్తాయి. కస్టమర్లు ఈ మన్నికైన ఫీచర్-ప్యాక్డ్ ఇయర్‌ఫోన్‌లను తక్కువ ధరకే కొనుగోలు చేయొచ్చు.

డెల్ 14 ల్యాప్‌టాప్..

దీని అసలు ధర రూ. 36,990గా ఉంది. మెగా ఎలక్ట్రానిక్స్ డేస్ సేల్‌లో ప్రదర్శనకు ఉంచారు. 12వ తరం ఇంటెల్ కోర్ ఐ3 ప్రాసెసర్, ఫుల్ హెచ్డీ డిస్‌ప్లేతో, ఇది మంచి పనితీరు, దృశ్య నాణ్యతను అందిస్తుంది. తక్కువ ధరలో వినియోగదారులకు నమ్మకమైన, సమర్థవంతమైన ల్యాప్‌టాప్‌ కావాలనుకునే వారికి ఇది బెస్ట్ చాయిస్.

మరిన్ని గ్యాడ్జెట్లు..

అమెజాన్ మెగా ఎలక్ట్రానిక్స్ సేల్ లో మరిన్ని వస్తువులపై అదిరే డిస్కౌంట్లు ఉన్నాయి. ప్రతి వస్తువుపై ప్రత్యేక ప్రయోజనాలను అందజేస్తుంది. ఈ సేల్లో నాణ్యమైన వస్తువులను తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..