Malware: స్మార్ట్‌ ఫోన్‌ యూజర్లు జాగ్రత్త.. కాల్‌ రికార్డులను వింటోన్న కొత్త మాల్‌వేర్‌.

|

May 27, 2023 | 3:16 PM

మారుతోన్న టెక్నాలజీకి అనుగుణంగా సైబర్‌ నేరగాళ్లు కూడా చెలరేగి పోతున్నారు. రోజుకో కొత్త మాల్వేర్‌తో యూజర్లను బురిడీ కొట్టిస్తున్నారు. ఇప్పటికే ఎన్నో రకాల మాల్వేరులు వెలుగులోకి రాగా తాజాగా మరో కొత్త మాల్వేర్‌ భయపటపడింది. 'దామ్‌' అనే మాల్వేర్‌తో ఆండ్రాయిడ్‌ యూజర్లకు ముప్పు పొంచి ఉందని కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది...

Malware: స్మార్ట్‌ ఫోన్‌ యూజర్లు జాగ్రత్త.. కాల్‌ రికార్డులను వింటోన్న కొత్త మాల్‌వేర్‌.
Daam Malware
Follow us on

మారుతోన్న టెక్నాలజీకి అనుగుణంగా సైబర్‌ నేరగాళ్లు కూడా చెలరేగి పోతున్నారు. రోజుకో కొత్త మాల్వేర్‌తో యూజర్లను బురిడీ కొట్టిస్తున్నారు. ఇప్పటికే ఎన్నో రకాల మాల్వేరులు వెలుగులోకి రాగా తాజాగా మరో కొత్త మాల్వేర్‌ భయపటపడింది. ‘దామ్‌’ అనే మాల్వేర్‌తో ఆండ్రాయిడ్‌ యూజర్లకు ముప్పు పొంచి ఉందని కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. ఈ కొత్త రకం వైరస్‌ ఆండ్రాయిడ్‌ ఫోన్‌లను లక్ష్యంగా చేసుకొని డేటాను చోరీ చేస్తున్నట్తు జాతీయ సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ హెచ్చరించింది.

ముఖ్యంగా స్మార్ట్‌ ఫోన్‌లను హ్యాక్‌ చేసి.. కాల్‌ రికార్డులు, కాంటాక్టులు, హిస్టరీ, కెమెరా తదితరాలను తన అధీనంలోకి తీసుకుంటుందని అధికారులు తెలిపారు. కొన్ని రకాల లింక్‌లను క్లిక్‌ చేయడం ద్వారా ఈ మాల్‌వేర్‌ స్మార్ట్‌ ఫోన్స్‌లోకి చొరబడుతున్నట్లు గుర్తించారు. ఈ మేరకు మొబైల్‌ యూజర్ల జాగ్రత్తగా ఉండాలని, అనుమానాస్పద లింకులపై క్లిక్‌ చేయొద్దని కోరింది.

ఇదిలా ఉంటే ఈ మాల్‌వేర్‌కు.. సెక్యూరిటీ ప్రోగ్రామ్‌లను కూడా బోల్తా కొట్టించి, అందుకు అనుగుణంగా రాన్‌సమ్‌వేర్‌ను డెవలప్‌ చేసుకునే సామర్థ్యం ఉందని ది ఇండియన్‌ కంప్యూటర్‌ ఎమర్జెన్సీ రెస్పాన్స్‌ టీమ్‌ తెలిపింది. ఈ మాల్‌వేర్‌ ఫోన్‌లోకి ఎంటర్‌ కాగానే.. మొబైల్‌ సెక్యూరిటీ వ్యవస్థను మభ్యపెడుతుంది. డేటాను తస్కరించేందుకు ప్రయత్నిస్తుంది. ఈ వైరస్‌ నుంచి మీ ఫోన్‌లను రక్షించుకోవాలంటే ఎలాంటి లింక్స్‌ను క్లిక్‌ చేయకూడదని సైబర్‌ నిపుణులు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..