Moto G54: భారత మార్కెట్లోకి మోటో కొత్త ఫోన్‌.. తక్కువ బడ్జెట్‌లో మైండ్‌ బ్లోయింగ్‌ ఫీచర్స్‌

|

Sep 14, 2023 | 8:27 PM

మోటో జీ54 5జీ స్మార్ట్ ఫోన్‌ మీడియాటెక్‌ డైమెన్సిటీ 7020 ప్రాసెసర్‌తో పని చేస్తుంది. ఇక ఈ ఫోన్‌ ధర విషయానికొస్తే 8 జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర రూ. 15,999కాగా, 12 జీబీ ర్యామ్‌, 256 జీబీ స్టోరేజ్‌ ధర రూ. 18,999గా ఉంది. మోటో అధికారిక వెబ్‌సైట్‌తో పాటు పలు ఈ కామర్స్‌ సైట్స్‌లో అందుబాటులో ఉన్న ఈ స్మార్ట్ ఫోన్‌ మిడ్‌నైట్ బ్లూ, మింట్ గ్రీన్, పీర్ బ్లూ కలర్సల్‌లో అందుబాటులో...

Moto G54: భారత మార్కెట్లోకి మోటో కొత్త ఫోన్‌.. తక్కువ బడ్జెట్‌లో మైండ్‌ బ్లోయింగ్‌ ఫీచర్స్‌
Moto G54
Follow us on

ప్రముఖ ఎలక్ట్రానిక్‌ దిగ్గజం మోటోరోలా భారత మార్కెట్లోకి కొత్త స్మార్ట్ ఫోన్‌ను లాంచ్‌ చేసింది. మోటో జీ54 పేరుతో తీసుకొచ్చిన ఈ 5జీ స్మార్ట్ ఫోన్‌ ఫస్ట్‌ సేల్ భారత్‌లో ప్రారంభమైంది. మొత్తం రేండు వేరియంట్స్‌లో ఈ స్మార్ట్ ఫోన్‌ను లాంచ్‌ చేశారు. తక్కువ బడ్జెట్‌లో తీసుకొచ్చిన ఈ స్మార్ట్ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి.? ధర ఎంత.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..

మోటో జీ54 5జీ స్మార్ట్ ఫోన్‌ మీడియాటెక్‌ డైమెన్సిటీ 7020 ప్రాసెసర్‌తో పని చేస్తుంది. ఇక ఈ ఫోన్‌ ధర విషయానికొస్తే 8 జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర రూ. 15,999కాగా, 12 జీబీ ర్యామ్‌, 256 జీబీ స్టోరేజ్‌ ధర రూ. 18,999గా ఉంది. మోటో అధికారిక వెబ్‌సైట్‌తో పాటు పలు ఈ కామర్స్‌ సైట్స్‌లో అందుబాటులో ఉన్న ఈ స్మార్ట్ ఫోన్‌ మిడ్‌నైట్ బ్లూ, మింట్ గ్రీన్, పీర్ బ్లూ కలర్సల్‌లో అందుబాటులో ఉన్నాయి. ప్రారంభ ఆఫర్‌లో భాగంగా పలు రకాల డిస్కౌంట్స్‌ లభిస్తున్నాయి. ఐసీఐసీ క్రెడిట్‌ కార్డు ద్వారా కొనుగోలు చేసిన వారికి రూ. 1500 ఇన్‌స్టంట్‌ డిస్కౌంట్‌ లభిస్తుంది. దీంతో బేసిక్‌ వేరియంట్‌ ఫోన్‌ను రూ. 14,499కే సొంతం చేసుకోవచ్చు.

ఇక ఈ స్మార్ట్ ఫోన్‌ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 6.5 ఇంచెస్‌ ఫుల్‌ హెచ్‌డీ+ డిస్‌ప్లేను అందించారు. స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్‌, యాస్పెక్ట్ రేషియో 20:9 ఈ స్క్రీన్‌ సొంతం. ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేసే ఈ స్మార్ట్‌ ఫోన్‌లో మూడేళ్లు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను అందించారు. ఆక్టాకోర్‌ మీడియా డైమెన్సిటీ 7020 ప్రాసెసర్‌తో పనిచేసే ఈ స్మార్ట్ ఫోన్‌లో ఎస్‌డీ కార్డు ద్వారా 1 టీబీ వరకు స్టోరేజ్‌ను పెంచుకోవచ్చు.

ఇక కెమెరా విషయానికొస్తే ఈ స్మార్ట్ ఫోన్‌లో 50 మెగాపిక్సెల్స్‌, 8 మెగాపిక్సెల్స్‌తో కూడిన డ్యూయల్‌ సెటప్‌ రెయిర్‌ కెమెరాను అందించారు. అలాగే సెల్ఫీల కోసం 16 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్‌ కెమెరాను అందించారు. బ్యాటరీ విషయానికొస్తే ఈ స్మార్ట్ ఫోన్‌లో 33 వాట్స్‌ ఫాస్ట్‌ చార్జింగ్‌కు సపోర్ట్‌ చేసే 6000 ఎంఏహెచ్‌ బ్యాటరీని అందించారు. డ్యూయల్‌ స్టీరియో స్పీకర్‌ ఈ ఫోన్‌ సొంతం. ఇక కేవలం గంటలోనే ఫోన్‌ 90 శాతం వరకు ఛార్జింగ్ అవుతుంది.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..