Lava Smart 4 Pro: తక్కువ ధర, భారీ బ్యాటరీ, మైమరిపించే ఫీచర్లతో స్మార్ట్‌ఫోన్‌

బడ్జెట్ ధరలో ఎక్కువ బ్యాటరీ సామర్థ్యం ఉన్న స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్న వారికి భారతీయ బ్రాండ్ Lava కొత్త ఎంపికను తీసుకొచ్చింది. Lava Smart 4 Pro పేరుతో సరికొత్త ఫోన్‌ను మార్కెట్లో విడుదల చేసింది. ఇందులో ప్రధాన ఆకర్షణ 7,000mAh భారీ బ్యాటరీ. దీనికి తోడు 90Hz రిఫ్రెష్ రేట్ డిస్‌ప్లే, Android 16 ఆపరేటింగ్ సిస్టమ్‌, 13MP కెమెరా వంటి ఫీచర్లను అందించారు. ఈ స్మార్ట్‌ఫోన్ ప్రారంభ ధరను రూ.10,999గా నిర్ణయించారు.

Lava Smart 4 Pro: తక్కువ ధర, భారీ బ్యాటరీ, మైమరిపించే ఫీచర్లతో స్మార్ట్‌ఫోన్‌
Lava Smart 4 Pro

Updated on: Nov 24, 2026 | 6:00 AM

తక్కువ ధరలో ఎక్కువ బ్యాటరీ బ్యాకప్‌తో పాటు రోజువారీ అవసరాలకు సరిపోయే ఫీచర్లు కోరుకునే వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని Lava Smart 4 Pro ఫోన్‌ను తీసుకొచ్చింది. మరో ప్రత్యేకత ఏమిటంటే ఇందులో ప్రకటనలు, అనవసరమైన యాప్స్ ఉండవని కంపెనీ చెబుతోంది. ఆన్‌లైన్ విక్రయాల కంటే దేశవ్యాప్తంగా ఉన్న Lava ఆఫ్‌లైన్ రిటైల్ స్టోర్ల ద్వారా ఈ ఫోన్‌ను ప్రధానంగా కొనుగోలు చేయవచ్చు. ఫోన్‌తో పాటు అమ్మకాల తర్వాత సేవల విషయంలోనూ ప్రత్యేక సదుపాయాలను ప్రకటించింది.

ధర, బ్యాటరీ..

Lava Smart 4 Proను 4GB RAM, 64GB స్టోరేజ్ వేరియంట్‌లో విడుదల చేశారు. దీని ధర రూ.10,999. Neelam Blue, Konark Gold అనే రెండు రంగుల్లో ఈ స్మార్ట్‌ఫోన్ అందుబాటులో ఉంటుంది. కొనుగోలుదారులకు హ్యాండ్‌సెట్‌పై ఒక సంవత్సరం వారంటీ, యాక్సెసరీస్‌పై ఆరు నెలల వారంటీ లభిస్తుంది. Free Service @ Home సదుపాయం ద్వారా ఇంటి వద్దనే అమ్మకాల తర్వాత సేవలను పొందవచ్చని కంపెనీ తెలిపింది.

ఈ ఫోన్‌లో 7,000mAh Li-Ion బ్యాటరీని అందించారు. 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో పాటు USB Type-C పోర్టు ఉంది. కంపెనీ వెల్లడించిన వివరాల ప్రకారం, ఈ బ్యాటరీ 950 గంటల వరకు స్టాండ్‌బై టైమ్‌, 748 నిమిషాల వరకు YouTube వీడియో ప్లేబ్యాక్ అందిస్తుంది.

Android 16 ఆపరేటింగ్ సిస్టమ్‌

Lava Smart 4 Proలో 6.75 అంగుళాల HD+ నాచ్ డిస్‌ప్లేను అందించారు. ఇది 90Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్ట్ చేస్తుంది. UNISOC T610 ఆక్టా-కోర్ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇందులో 4GB ఫిజికల్ RAMతో పాటు అదనంగా 4GB వర్చువల్ RAM సపోర్ట్ ఉంది. దీంతో మొత్తం 8GB వరకు RAM సామర్థ్యాన్ని పొందవచ్చు. 64GB ఇంటర్నల్ స్టోరేజ్‌ను మైక్రో SD కార్డ్ ద్వారా 512GB వరకు విస్తరించుకోవచ్చు.

ఫోటోగ్రఫీ కోసం వెనుకవైపు 13MP ప్రధాన కెమెరా, సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం స్క్రీన్ ఫ్లాష్ సపోర్ట్‌తో 5MP ఫ్రంట్ కెమెరాను ఇచ్చారు. ఈ ఫోన్ Android 16 ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేస్తుంది. భద్రత కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌, ఫేస్ అన్‌లాక్ ఉన్నాయి. MIL-STD-810H డ్రాప్‌, షాక్ రెసిస్టెన్స్ సర్టిఫికేషన్ కూడా పొందింది. రెండేళ్ల పాటు సెక్యూరిటీ ప్యాచ్ అప్‌డేట్స్ అందిస్తామని కంపెనీ వెల్లడించింది. మొత్తంగా రూ.10,999 ధరలో భారీ బ్యాటరీ, కొత్త Android వెర్షన్‌తో Lava Smart 4 Pro బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ విభాగంలో మరో ఎంపికగా నిలవనుంది.

Loading...
Unable to load recommendations.
Follow Us