ఈవీ స్కూటర్‌లో కొమాకి సంచలనం.. ఈసారి ఊహించని రేంజ్‌తో వచ్చేసిందిగా

రోజువారీ ఆఫీస్, కాలేజీ, మార్కెట్ ప్రయాణాలకు సరసమైన ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం చూస్తున్న వారికి Komaki MG-Pro+ ఒక ఆప్షన్‌గా నిలుస్తోంది. తక్కువ ధరలో మంచి రేంజ్, సౌకర్యవంతమైన రైడింగ్‌తో పాటు రోజువారీ అవసరాలకు ఉపయోగపడే ఫీచర్లను ఇందులో అందించారు. వేరియంట్‌ను బట్టి బ్యాటరీ సామర్థ్యం, ప్రయాణ దూరంలో తేడా ఉంటుంది.

ఈవీ స్కూటర్‌లో కొమాకి సంచలనం.. ఈసారి ఊహించని రేంజ్‌తో వచ్చేసిందిగా
Komaki Mg Pro+ Electric Scooter

Updated on: Oct 08, 2026 | 7:44 AM

Komaki MG-Pro+ సిరీస్‌లో MG-Pro+, MG-Pro V, MG-Pro Li, MG-Pro GL అనే నాలుగు వేరియంట్లు ఉన్నాయి. LiFePO4 (LFP) లిథియం-అయాన్ బ్యాటరీని ఇందులో ఉపయోగించినట్లు కంపెనీ తెలిపింది. సాధారణ ఇంటి విద్యుత్ సాకెట్‌తో ఛార్జ్ చేసుకోవచ్చు. బ్యాటరీ పూర్తిగా నిండేందుకు సుమారు 4 నుంచి 5 గంటలు పడుతుంది. వేరియంట్‌ను బట్టి 100 కి.మీ నుంచి 150 కి.మీ కంటే ఎక్కువ రేంజ్ లభిస్తుంది.

BLDC మోటార్..

Komaki MG-Pro+లో BLDC హబ్ మోటార్ ఉంది. Eco, Sports, Turbo రైడింగ్ మోడ్‌లను అవసరానికి అనుగుణంగా ఎంచుకోవచ్చు. Reverse Assist సాయంతో పార్కింగ్‌ను సులభంగా చేసుకోవచ్చు. డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌లో స్పీడ్, బ్యాటరీ, ట్రిప్ వివరాలు చూడవచ్చు. USB మొబైల్ ఛార్జింగ్, యాంటీ-థెఫ్ట్ అలారం, కీ-లెస్ ఎంట్రీ, LED హెడ్‌లైట్, రీజెనరేటివ్ బ్రేకింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

రూ.85,999 నుంచి ధర

భద్రత కోసం ముందు, వెనుక బ్రేకింగ్ సిస్టమ్, వెడల్పాటి టైర్లు, బలమైన చాసిస్ ఇచ్చారు. బ్యాటరీ, మోటార్‌పై 3 సంవత్సరాల వరకు వారంటీ లభిస్తుంది. Komaki MG-Pro+ ప్రారంభ ధర రూ.85,999. రూ.90 వేల లోపు బడ్జెట్‌లో రోజువారీ ప్రయాణాల కోసం EV కొనాలనుకునేవారికి ఈ స్కూటర్ రేంజ్, ఫీచర్ల పరంగా ఆకర్షణీయమైన ఎంపికగా కనిపిస్తోంది.

Loading...
Unable to load recommendations.
Follow Us