స్పోర్ట్స్ బైక్స్‌ని తలపిస్తున్న ఎల‌క్ట్రిక్ వాహనాలు.. ఫీచర్స్ అద్భుతం.. గంటకు 120 కి.మీ వేగం.. సింగిల్ చార్జిపై 150 కి.మీ ప్రయాణం..

Kabira Mobility Electric Bikes: గోవా కేంద్రంగా ఉన్న కబీరా మొబిలిటీ సంస్థ KM3000, KM4000 అనే రెండు కొత్త హై-స్పీడ్ ఎలక్ట్రిక్ బైక్‌లను విడుదల చేసింది.

  • Publish Date - 5:53 am, Mon, 22 February 21
స్పోర్ట్స్ బైక్స్‌ని తలపిస్తున్న ఎల‌క్ట్రిక్ వాహనాలు.. ఫీచర్స్ అద్భుతం.. గంటకు 120 కి.మీ వేగం.. సింగిల్ చార్జిపై 150 కి.మీ ప్రయాణం..

Kabira Mobility Electric Bikes: గోవా కేంద్రంగా ఉన్న కబీరా మొబిలిటీ సంస్థ KM3000, KM4000 అనే రెండు కొత్త హై-స్పీడ్ ఎలక్ట్రిక్ బైక్‌లను విడుదల చేసింది. 6000W గరిష్ట శక్తిని కలిగి ఉన్న KM3000 ధర 1,26,990 రూపాయలు (ఎక్స్-షోరూమ్, గోవా), అలాగే KM4000 గరిష్ట శక్తి 8000W మరియు దీని ఎక్స్‌షోరూం గోవా ధ‌ర రూ .1,36,990 ఈ బైకుల డెలివరీలు మే 2021 నుంచి ప్రారంభమవుతాయి. ప్రారంభ ద‌శ‌లో ఢిల్లీ, ముంబై, అహ్మదాబాద్, పూణే, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, గోవా మరియు ధార్వాడ్ న‌గ‌రాల్లో అందుబాటులో ఉంటాయి.

KM3000 బైక్‌ను చూడ‌గానే పెట్రోల్ స్పోర్ట్స్ బైక్ గుర్తుకు వ‌స్తుంది. ఇది 138 కిలోల బరువును కలిగి ఉంది. మ‌రోవైపు స్ట్రీట్‌ ఫైటర్ కేటగిరీ అయిన KM4000 బరువు 147 కిలోలు. KM3000 మరియు KM4000 బైక్‌ల‌ను రెండు మోడ్‌లలో ఛార్జ్ చేయవచ్చు, ఎకో మోడ్‌లో ఛార్జింగ్ పవర్ ప్యాక్‌లను పూర్తిగా ఛార్జ్ చేయడానికి 6 గంటల 30 నిమిషాలు పడుతుంది. అలాగే బూస్ట్ మోడ్ 80% బ్యాటరీని కేవలం 50 నిమిషాల్లోనే ఛార్జ్ చేస్తుంది. ఈ బైక్‌లలో కంబైన్డ్ బ్రేకింగ్ సిస్టమ్, ఫాస్ట్ ఛార్జింగ్, ‘ఆన్‌బోర్డ్’ మరియు రోడ్‌సైడ్ అసిస్టెంట్ సర్వీస్ వంటి ఫీచ‌ర్లు ఉన్నాయి. ఎలక్ట్రిక్ బైక్‌లు ఒకే ఛార్జీతో గంటకు 120 కిమీ వేగంతో దూసుకెళ్తాయి. సింగిల్ చార్జిపై150 కిలోమీటర్ల వ‌ర‌కు ప్రయాణిస్తాయి. కబీరా మొబిలిటీ ఎలక్ట్రిక్ బైక్‌లకు పార్క్ అసిస్ట్ మరియు ఇతర స్మార్ట్ ఫీచర్లు కూడా ఉన్నాయి.

Super Electric Bike: యాభై వేలకే సూపర్ ఎలక్ట్రిక్ బైక్.. ఒక్కసారి చార్జ్ చేస్తే చాలు నాన్‌స్టాప్‌గా ప్రయాణం.. మైలేజ్ ఎంతిస్తుందో తెలుసా..