Puncture Guard Tyre: వాహనదారులకు అదిరిపోయే గుడ్‌న్యూస్‌.. ఈ టైర్లకు పంక్చర్‌ అయినా గాలి బయటకు పోదు!

|

Mar 25, 2022 | 3:28 PM

Puncture Guard Tyre: టెక్నాలజీ పెరిగిపోతోంది. దీని కారణంగా ప్రజలు మెరుగైన సేవలు పొందుతున్నారు. ఇక సాధారణంగా వాహనాల టైర్లకు పంక్చర్‌ అవుతుంటాయి. ఈ మధ్య కాలంలో..

Puncture Guard Tyre: వాహనదారులకు అదిరిపోయే గుడ్‌న్యూస్‌.. ఈ టైర్లకు పంక్చర్‌ అయినా గాలి బయటకు పోదు!
Jk Tyre
Follow us on

Puncture Guard Tyre: టెక్నాలజీ పెరిగిపోతోంది. దీని కారణంగా ప్రజలు మెరుగైన సేవలు పొందుతున్నారు. ఇక సాధారణంగా వాహనాల టైర్లకు పంక్చర్‌ అవుతుంటాయి. ఈ మధ్య కాలంలో ట్యూబ్‌లెస్‌ టైర్లు వచ్చాయి. టైర్‌ పంక్చర్‌ అయినా కొంత దూరం అలాగే వెళ్లవచ్చు. తర్వాత దానికి పంక్చర్‌ బాగు చేసుకోవచ్చు. ఇక ప్రముఖ టైర్స్‌ అండ్‌ ట్యూబ్స్‌ తయారీ కంపెనీ జేకే టైర్స్‌ (JK Tyre) అండ్‌ ఇండస్ట్రీస్‌ ఇండియా మార్కెట్లో సరికొత్త టైర్లను విడుదల చేసింది. మొదటి సారిగా టైర్లలో పంక్చర్‌ గార్డ్ (Puncture Guard) టెక్నాలజీ (Technology)ని తీసుకువస్తున్నట్లు జేకే టైర్‌ అండ్‌ ఇండస్ట్రీస్‌ తెలిపింది.

వాటంతటా అవే సెల్ఫ్‌ హీల్‌

ఫోర్‌ వీలర్ల కోసం పంక్చర్‌ గార్డ్‌ టెక్నాలజీ ఆందుబాటులో ఉంటుందని జేకే టైర్స్‌ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ టెక్నాలజీ సహాయంతో టైర్లు పంక్చర్‌ అయినప్పుడు గాలి బయటకు వెళ్లకుండా సెల్ఫ్‌ హీల్‌ అవుతుందని కంపెనీ వర్గాలు తెలిపాయి. ఆటోమెటిక్‌గా టైర్‌ లోపల సెల్ఫ్‌-హీలింగ్‌ ఎలాస్టమర్‌ ఇన్నర్‌ కోట్‌ సహాయంతో ఇది సాధ్యమవుతోందని జేకే టైర్స్‌ తెలిపింది. 6ఎంఎం వరకూ మందంతో ఉండే మేకులు, ఇతర వస్తువులు టైర్‌కు దిగినా ఎలాంటి ఇబ్బంది ఉండదని కంపెనీ స్పష్టం చేసింది. టైర్‌ మొత్తం అగిరిపోయేంత వరకు పంక్చర్‌ అనేది ఉండదని కంపెనీ పేర్కొంది.

2020లో స్మార్ట్‌ టైర్‌ టెక్నాలజీ..

కాగా, వాహనదారులకు 2020లో స్మార్ట్‌ టైర్‌ టెక్నాలజీని పరిచయం చేశామని, ఇప్పుడు పంచ్చర్‌ గార్డ్ టెక్నాలజీని అందిస్తున్నామని జేకే టైర్‌ సీఎండీ రఘుపతి సింఘానియా వెల్లడించారు. రానున్న రోజుల్లో వాహనదారుల కోసం అద్భుతమైన టెక్నాలజీతో కూడిన టైర్లను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు కృషి చేస్తామని తెలిపారు. ఈ టెక్నాలజీ వల్ల వాహనదారులకు ఎంతగానో మేలు జరుగుతుందని, టైర్‌ పంక్చర్‌ అవుతుందనే బాధ ఉండదని అన్నారు.

ఇవి కూడా చదవండి:

Vodafone Idea: వొడాఫోన్‌ ఐడియా 8000 SIM కార్డ్‌లను బ్లాక్ చేసింది.. కారణం ఏంటంటే..!

Ola Electric Vehicles: ఓలా సంచలన నిర్ణయం.. కేవలం 5 నిమిషాల్లోనే ఫుల్‌ ఛార్జింగ్‌..!