ISRO: మరికొద్ది సేపట్లో కీలక ఘట్టం.. నింగిలోకి దూసుకెళ్లనున్న GSLV-F18

ISRO GSLV-F18 Rocket: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) మరో కీలక అంతరిక్ష ప్రయోగానికి సిద్ధమైంది. GSLV-F18 రాకెట్ ద్వారా NVS-03 అనే నావిగేషన్ ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఈ ప్రయోగం కేవలం ఒక ఉపగ్రహాన్ని కక్ష్యలోకి పంపడం మాత్రమే..

ISRO: మరికొద్ది సేపట్లో కీలక ఘట్టం.. నింగిలోకి దూసుకెళ్లనున్న GSLV-F18
Gslv F18

Updated on: Oct 30, 2026 | 11:28 PM

ISRO GSLV-F18 Rocket:  భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ఈ రోజు (అక్టోబర్‌ 30) ఒక కీలకమైన అంతరిక్ష ప్రయోగాన్ని ప్రారంభించబోతోంది. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోటలో ఉన్న సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రంలోని రెండవ ప్రయోగ వేదిక నుండి జీఎస్ఎల్వీ-ఎఫ్18 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లనుంది. ఈ రాకెట్, భారతదేశపు మూడవ రెండవ తరం నావిగేషన్ ఉపగ్రహమైన ఎన్వీఎస్-03ను అంతరిక్షంలోకి పంపనుంది. దీని ప్రయోగ సమయం ఈ రాత్రి 11.51 గంటలకు నిర్ణయించారు. భారతదేశపు ప్రాంతీయ నావిగేషన్ ఉపగ్రహ వ్యవస్థ అయిన నావిక్ (NavIC)కు నిరంతరాయ సేవలను అందించేందుకు ఈ ఉపగ్రహాన్ని రూపొందించారు. ఈ ప్రయోగం విజయవంతమైతే, దేశ నావిగేషన్ నెట్‌వర్క్ బలోపేతం అవుతుంది, తద్వారా సరిహద్దు భద్రత, పౌర సేవల కోసం స్థానాన్ని గుర్తించడం మరింత కచ్చితంగా మారుతుంది.

NVS-03లో L1 బ్యాండ్ ఉంటుంది. ఇది ఆధునిక స్మార్ట్‌ఫోన్‌లు , ఇతర నావిగేషన్ పరికరాలకు ఉపయోగపడుతుంది. ఇది ఇతర ప్రపంచ నావిగేషన్ వ్యవస్థలతో నావిగేషన్ సిస్టమ్ అనుకూలతను మెరుగుపరుస్తుంది. ఈ సాంకేతికతను వాహన ట్రాకింగ్, సముద్రయాన నావిగేషన్, అత్యవసర సేవలు, రవాణాలో ఉపయోగించవచ్చు. మీరు ప్రయోగ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా చూడాలనుకుంటే ఇస్రో సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో చూడవచ్చు.

మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Loading...
Unable to load recommendations.
Follow Us