ఇస్రో మరో కీలక ప్రయోగానికి సన్నాహాలు.. మిషన్ గగన్‌యాన్‌ ఎప్పుడంటే..?

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరో కీలక ప్రయోగాన్ని రెడీ అవుతోంది. మరో మైలు రాయిని అధిగమించేందుకు ఇస్రో శాస్త్రవేత్తలు సిద్ధమవుతున్నారు. మిషన్ గగన్‌యాన్‌కు సంబంధించి ఇస్రో పెద్ద అప్‌డేట్ ఇచ్చింది. ఈ ఏడాది డిసెంబర్‌లో గగన్‌యాన్-జి1ని ప్రయోగించనున్నట్లు ఇస్రో చీఫ్ వి. నారాయణన్ తెలిపారు.

ఇస్రో మరో కీలక ప్రయోగానికి సన్నాహాలు.. మిషన్ గగన్‌యాన్‌ ఎప్పుడంటే..?
Isro Chief V Narayanan

Edited By: Janardhan Veluru

Updated on: Aug 22, 2025 | 3:31 PM

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరో కీలక ప్రయోగాన్ని రెడీ అవుతోంది. మరో మైలు రాయిని అధిగమించేందుకు ఇస్రో శాస్త్రవేత్తలు సిద్ధమవుతున్నారు. మిషన్ గగన్‌యాన్‌కు సంబంధించి ఇస్రో పెద్ద అప్‌డేట్ ఇచ్చింది. ఈ ఏడాది డిసెంబర్‌లో గగన్‌యాన్-జి1ని ప్రయోగించనున్నట్లు ఇస్రో చీఫ్ వి. నారాయణన్ తెలిపారు. కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్, గ్రూప్ కెప్టెన్ శుభాన్షు శుక్లా, ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్‌లతో కలిసి జరిగిన సంయుక్త విలేకరుల సమావేశంలో నారాయణన్ ఈ విషయాన్ని వెల్లడించారు.

గత నాలుగు నెలల్లో ఈ రంగంలో అనేక విజయాలు సాధించామని నారాయణన్ అన్నారు. అటువంటి పరిస్థితిలో, ఈ ఏడాది చివరిలో, బహుశా డిసెంబర్‌లో మొదటి మానవరహిత మిషన్ జి1ను ప్రయోగించనున్నారు. అర్ధ-మానవుడిలా కనిపించే వ్యోమిత్ర కూడా అందులో ఎగురుతారని ఆయన అన్నారు. భారత్ పూర్తి స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో గగన్‌యాన్ ప్రయోగానికి శ్రీకారం చుడుతున్నట్లు ఇస్రో ఛైర్మన్ ప్రకటించారు. విజయవంతమైన ఆక్సియం-4 మిషన్ నుండి ఇటీవలే తిరిగి వచ్చిన శుభఆన్షు శుక్లా, అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం అనుభవం భారతదేశ సొంత గగన్‌యాన్ మిషన్‌కు చాలా ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు.

ఇప్పటికే గగన్‌యాన్‌కు సంబంధించిన అనేక ప్రయోగాత్మక ప్రయోగాలను చేపట్టి విజయం సాధించింది. అందులో భాగంగానే అంతరిక్షంలోకి వ్యోమగాములను పంపే దిశలో ఇస్రో మరో అడుగు ముందుకు వేస్తోంది .ఈ నేపథ్యంలోనే గగన్‌యాన్ G1 ప్రయోగాత్మక రాకెట్ ప్రయోగాన్ని 2025 చివరి మాసంలో తిరుపతి జిల్లా సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ శ్రీహరికోట నుండి G1 రాకెట్ ప్రయోగాన్ని చేపట్టేందుకు సన్నాహాలు సిద్ధం చేస్తోంది. అదేవిధంగా ఈ గగన్ యాన్ రాకెట్ ప్రయోగానికి సంబంధించి గగన్‌యాన్ G1, గగన్‌యాన్ G2, గగన్‌యాన్ G3 లాంటి రాకెట్ ప్రయోగాలను కూడా 2026లో చేపట్టేందుకు ఇస్రో ఒక ప్రణాళికలను సిద్ధం చేస్తోంది.

అలాగే 2027 వ సంవత్సరంలో గగన్‌యాన్ భారత్ తొలి మ్యాన్ మిషన్ ప్రయోగానికి సిద్ధమవుతున్నారు. ఒక రోబోను తయారుచేసి ఈ రాకెట్ ప్రయోగంలో అమర్చి అంతరిక్షంలో పంపేందుకు ఇస్రో శాస్త్రవేత్తలు సిద్ధమయ్యారు. అంతరిక్షంలోకి మానవులను పంపే ముందుగా ఈ రోబోను పంపి అక్కడ వివిధ పరిశోధనలు చేసి, ఆ సమాచారాన్ని శాస్త్రవేత్తలకు అందజేస్తుంది. అంతరిక్షంలోకి పంపిన రోబో హిందీ, ఇంగ్లీష్ భాషలలో పరిశోధనలు చేసిన సమాచారాన్ని శాస్త్రవేత్తలకు అందిస్తుంది.

అదేవిధంగా అంతరిక్షంలోకి వెళ్ళాక అక్కడ వ్యోమగాములు ఎలాంటి వాతావరణ పరిస్థితులను తట్టుకునే వీలు ఉంటుందన్న అంశాలపై కూడా ఈ రోబో అధ్యయనం చేసి శాస్త్రవేత్తలకు తెలియజేస్తుంది. గగన్‌యాన్ ప్రధాన ప్రయోగానికి ముందుగా అంటే 2027 లో రాకెట్ ప్రయోగంలో రోబోను అమర్చి ప్రయోగాన్ని చేపట్టేందుకు ఇస్రో శ్రీకారం చుట్టింది. మ్యాన్ మిషన్ సక్సెస్ చేయడం అంటే భూమి నుంచి అంతరిక్షంలోకి వాహక నౌక వెళ్లడమే కాదు.. అంతరిక్షంలో పరిశోధనలు పూర్తి చేసుకున్న తర్వాత తిరిగి భూమి మీదకు క్షేమంగా రావడమే ప్రయోగం పూర్తి విజయంగా చూడాల్సి ఉంటుంది.

ఇందుకోసమే ఇస్రో పూర్తి స్వదేశీ టెక్నాలజీతో గగన్‌యాన్ మిషన్ చేపడుతున్న సందర్భంలో ప్రతి దశను సొంతంగా ప్రయోగాత్మక ప్రయోగాలు చేపట్టి అన్ని రకాలుగా పరీక్షలు చేపడుతోంది. అంతరిక్ష నుంచి భూమికి తిరిగి వచ్చేటప్పుడు వ్యోమగామిలు ప్రయాణించే క్యాప్సిల్ క్షేమంగా భూమి మీదకు తీసుకురావడం కూడా అత్యంత కీలకం.. కాబట్టి ప్రయోగాన్ని చేపట్టి భూమి నుంచి అంతరిక్షంలోకి వెళ్లడం మొదలు పరిశోధన పూర్తయ్యాక తిరిగి భూమి మీదకు క్షేమంగా వచ్చేవరకు అన్ని దశలను ఎప్పటికప్పుడు విజయవంతంగా పరీక్షలు చేపడుతోంది ఇస్రో.

మరిన్ని సైన్స్ అండ్ టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..