గీజర్​ కొనాలని ప్లాన్ చేస్తున్నారా? Intex గురించి తెలుసుకోకపోతే లాస్​ అయిపోతారు

చలికాలం మొదలవుతున్న సమయంలో ఇళ్లలో వేడి నీటి అవసరం పెరుగుతుంది. ఉదయం స్నానం చేయడానికి, రోజువారీ పనుల కోసం గీజర్లు ఉపయోగపడతాయి. ఈ అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఎలక్ట్రానిక్స్ సంస్థ Intex Technologies వాటర్ హీటర్ల విభాగంలోకి అడుగుపెట్టింది. తొలిసారిగా గీజర్లను పరిచయం చేస్తూ, ఇన్‌స్టాంట్, స్టోరేజ్ మోడళ్లతో కొత్త సిరీస్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు.

గీజర్​ కొనాలని ప్లాన్ చేస్తున్నారా? Intex గురించి తెలుసుకోకపోతే లాస్​ అయిపోతారు
Intex Geysers

Updated on: Oct 31, 2026 | 6:40 AM

తక్కువ సమయం లోనే వేడి నీటిని అందించే మోడళ్లతో పాటు, ఎక్కువ నీటిని వేడిచేసి నిల్వ ఉంచుకునే గీజర్లను కూడా Intex కంపెనీ తీసుకొచ్చింది. వివిధ కుటుంబాల అవసరాలకు తగ్గట్టుగా వేర్వేరు సామర్థ్యాల్లో వీటిని రూపొందించింది. ధరలు రూ.5,290 నుంచి ప్రారంభమవుతుండటంతో, కొత్త గీజర్ కొనాలనుకునే వారు వీటి ఫీచర్లపై ఆసక్తి చూపవచ్చు.

25 లీటర్ల వరకు సామర్థ్యం

Intex కొత్త పోర్ట్‌ఫోలియోలో Insti, Ferro పేర్లతో ఇన్‌స్టాంట్ గీజర్లు ఉన్నాయి. Aqua Splash, Fresh Wave, Aqua Luxe, Hotzy సిరీస్‌లలో స్టోరేజ్ వాటర్ హీటర్లు అందుబాటులోకి వచ్చాయి. ఇన్‌స్టాంట్ మోడళ్లు 3 లీటర్లు, 5.9 లీటర్ల సామర్థ్యాల్లో లభిస్తాయి. స్టోరేజ్ మోడళ్లలో 10, 15, 25 లీటర్ల ఎంపికలు ఉన్నాయి.

ఈ గీజర్లలో తుప్పును నిరోధించేందుకు Ultra-Diamond Glassline ట్యాంక్‌ను ఉపయోగించారు. ట్యాంక్ మన్నిక కోసం మ్యాగ్నీషియం యానోడ్ రాడ్‌ను అందించారు. నీరు ఎక్కువసేపు వేడిగా ఉండేందుకు ప్రత్యేక ఇన్సులేషన్‌ను కూడా ఏర్పాటు చేసినట్లు కంపెనీ తెలిపింది.

భద్రత కోసం ప్రత్యేక ఫీచర్లు

Intex గీజర్లు 8 బార్ల వరకు నీటి ఒత్తిడిని తట్టుకోగలవని కంపెనీ వెల్లడించింది. అందువల్ల హైరైజ్ అపార్ట్‌మెంట్లు, ప్రెజర్ పంపులు ఉపయోగించే ఇళ్లలో వీటిని వినియోగించవచ్చు. భద్రత కోసం షాక్ ప్రూఫ్ బాడీ, ప్రెజర్ రిలీఫ్ వాల్వ్, మల్టీఫంక్షన్ సేఫ్టీ వాల్వ్, థర్మల్ కటాఫ్ ప్రొటెక్షన్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

డిజైన్ పరంగా కూడా బాత్రూమ్‌కు సరిపోయేలా వీటిని రూపొందించారు. Intex గీజర్ల ప్రారంభ ధర రూ.5,290గా ఉంది. సామర్థ్యం, మోడల్‌ను బట్టి ధర మారుతుంది. కొనుగోలు చేసే ముందు గీజర్ సామర్థ్యం, విద్యుత్ వినియోగం, వారంటీ, ఇన్‌స్టాలేషన్ ఛార్జీల వివరాలు తెలుసుకోవడం మంచిది.

Loading...
Unable to load recommendations.
Follow Us