భారత్‌లో వేగంగా వృద్ధి చెందుతున్న స్మార్ట్ ఫోన్ బిజినెస్‌ను అందిపుచ్చుకోడానికి వివిధ కంపెనీలు తమ కొత్త మోడల్ ఫోన్లను మార్కెట్‌లోకి లాంచ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీ ఇన్‌ఫినిక్స్ తమ స్మార్ట్ ఫోన్స్‌లో మరో కొత్త మోడల్ రిలీజ్ చేసింది. ప్రస్తుత అవసరాలకు తగినట్లుగా కొత్త మోడల్ డిజైన్ చేసినట్లు కంపెనీ వర్గాలు పేర్కొంటున్నాయి. ముఖ్యంగా మధ్యతరగతి ప్రజల అవసరాలకు తగినట్లుగా కొత్త ఫోన్‌ను అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు వివరిస్తున్నాయి. ఇన్‌ఫినిక్స్ స్మార్ట్ 7 పేరుతో రిలీజ్ చేసిన ఈ ఫోన్‌లో అన్ని అధునాతన ఫీచర్లు ఉన్నాయి. కేవలం రూ.7299కే ఇది వినయోగదారులకు అందనుంది. అలాగే ఈ ఫోన్ ఫిబ్రవరి 27 నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉంటుంది. భారీ బ్యాటరీతో వస్తున్న ఈ ఫోన్ కచ్చితంగా వినియోగదారులను ఆకట్టుకుంటుందని కంపెనీ వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..