
‘ఏఐ మీ ఉద్యోగాన్ని తీసేయదు.. ఏఐ తెలిసిన వ్యక్తి ఏఐ తెలియని వ్యక్తి ఉద్యోగాన్ని తీసేస్తాడు’.. ఇదీ ఢిల్లీలో ఏఐ ఇంపాక్ట్ సమిట్ ఇచ్చిన సందేశం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌పై సమిట్ అనగానే సాఫ్ట్‌వేర్ సెక్టార్ గురించే అనుకుంటారు. కాదు. సాఫ్ట్‌వేర్ నుంచి సెక్యూరిటీ గార్డుల వరకు.. అన్నింటికీ ఏఐని ఎలా వాడొచ్చో చూపించిందీ సమిట్. ‘పుచ్చూ’ పేరుతో టీసీఎస్ తన క్రియేటివిటీని చూపింది. Puchu.. నేమ్ డిఫరెంట్‌గా ఉంది కదా. బట్.. ఫ్యూచర్‌లో సెక్యూరిటీ గార్డులను రీప్లేస్ చేయగలదు. పహారా కాయడం నుంచి గ్యాస్ లీకేజీల వరకు అన్నిటినీ పసిగట్టి నేరుగా యజమానికే రిపోర్ట్ చేస్తుంది. ఇన్నోవేషన్‌లో భాగంగా చేతులు సృష్టించారు. మామూలు చేతులు కావు. శరీరాన్ని స్కాన్ చేసి చిన్న జబ్బు నుంచి క్యాన్సర్ వరకు ఒంట్లో ఏముందనే రిపోర్ట్‌ను నిమిషాల్లోనే చేతిలో పెడుతుంది. డయాగ్నోస్టిక్ సెంటర్స్‌కు కచ్చితంగా పోటీయే ఇది. చివరికి క్రికెట్‌లోకి కూడా ఏఐ వచ్చేసింది. బ్యాటింగ్ ఆర్ బౌలింగ్ స్టైల్‌ను ఫ్రేమ్-బై-ఫ్రేమ్ పరిశీలించి, ఎక్కడ తప్పులు జరుగుతున్నాయో వెంటనే చూపిస్తుంది. ఇది ఒక ప్రొఫెషనల్ కోచ్ ఇచ్చే సలహాల కంటే కచ్చితంగా ఉంటుంది. సో, గల్లీ క్రికెట్‌లో కూడా ఇంటర్నేషనల్ రేంజ్ కోచెస్ రాబోతున్నారు. సో, ఇది చేయగలదు, అది చేయలేదనేదేం లేదు. ఏఐ అన్నింట్లోకీ రాబోతోంది. అన్నట్టు వ్యవసాయంలో కూడా. జస్ట్.. ఒక ఆకును ఫోన్‌తో స్కాన్ చేస్తే చాలు.. ఆ పంటకు ఏ చీడ...