Robot: ‘పని భారం తాళలేక.. ఆత్మహత్య చేసుకున్న రోబో!’ సూసైడ్‌కి ముందు రోబో వింత ప్రవర్తన

|

Jul 04, 2024 | 5:51 PM

సివిల్‌ సర్వెంట్‌గా ఓ ఇంట్లో పనిచేస్తున్న రోబోట్ రెండు మీటర్ల మెట్ల మీద నుంచి కింద పడిపోయింది. భవనం మొదటి, రెండవ అంతస్తుల మధ్య ఉన్న మెట్ల దారిలో అది పడిపోవడంతో, పనికిరాకుండా పోయిందని గుమి సిటీ కౌన్సిల్ తెలిపింది. ఈ ఘటనకు ముందు రోబో విచిత్రంగా ప్రవర్తించినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఏదో వెతుకుతున్నట్టుగా అటూఇటూ తిరిగిందని, ఆ తర్వాత నేరుగా మెట్ల వద్దకు వెళ్లి..

Robot: పని భారం తాళలేక.. ఆత్మహత్య చేసుకున్న రోబో! సూసైడ్‌కి ముందు రోబో వింత ప్రవర్తన
Robot Suicide
Follow us on

సియోల్‌, జూలై 3: దక్షిణ కొరియాలో షాకింగ్‌ సంఘటన చోటు చేసుకుంది. దక్షిణ కొరియాకు చెందిన సివిల్ సర్వెంట్ రోబోట్ అనుమానాస్పదంగా ఆత్మహత్యకు పాల్పడింది. మెట్లపై నుంచి కిందపడి ముక్కలు ముక్కలై పోయింది. రోబో దానంతట అదే మెట్లపై నుంచి కింద పడిందని, ఇందుకు కారణాలు తెలియాల్సి ఉందని అధికారులు చెప్తున్నారు. దీంతో రోబో ఆత్మహత్య చేసుకుందన్న ప్రచారం సోషల్‌ మీడియాలో జోరందుకుంది.

ది డైలీ మెయిల్ అనే మీడియా కథనాల ప్రకారం.. సివిల్‌ సర్వెంట్‌గా ఓ ఇంట్లో పనిచేస్తున్న రోబోట్ రెండు మీటర్ల మెట్ల మీద నుంచి కింద పడిపోయింది. భవనం మొదటి, రెండవ అంతస్తుల మధ్య ఉన్న మెట్ల దారిలో అది పడిపోవడంతో, పనికిరాకుండా పోయిందని గుమి సిటీ కౌన్సిల్ తెలిపింది. ఈ ఘటనకు ముందు రోబో విచిత్రంగా ప్రవర్తించినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఏదో వెతుకుతున్నట్టుగా అటూఇటూ తిరిగిందని, ఆ తర్వాత నేరుగా మెట్ల వద్దకు వెళ్లి.. అమాంతం కిందకు పడిపోయినట్లు చెప్తున్నారు. అయితే ఇందుకు సంబంధించి ఖచ్చితమైన కారణాలు తెలియరాలేదు. ఈ ఘటనపై విచారణ జరుపుతున్నామని, ముక్కలైన రోబో భాగాలను సేకరించి, దానిని తయారుచేసిన కంపెనీకి పంపిస్తామని అధికారులు తెలిపారు. పని భారం వల్లనే రోబో తనంతట తాను ఇలా చేసిందని నెటిజన్లు భావిస్తున్నారు. ‘నో బ్రేక్‌, నో హాలిడే, నో శాలరీ.. రోబోలకు ప్రత్యేకంగా యూనియన్ ఉండాలని’ ఓ నెటిజన్ ఫన్నీగా కామెంట్‌ సెక్షన్‌లో రాసుకొచ్చాడు.

ఇవి కూడా చదవండి

కాగా దక్షిణ కొరియాలో రోబోలను వివిధ పనులకు విరివిగా వాడుతుంటారు. బేర్ రోబోటిక్స్ అనే కాలిఫోర్నియాకు చెందిన స్టార్టప్ కంపెనీ రోబోటిక్ అసిస్టెంట్‌ను తయారు చేస్తూ ఉంటుంది. ఈ కంపెనీ తయారుచేసిన ఈ రోబోను 2023 అక్టోబరులో గుమి నగర కౌన్సిల్‌లో వినియోగిస్తున్నారు. దీనికి ఐడీ కార్డు కూడా ఉంది. ఉదయం 9 నుండి సాయంత్రం 4 గంటల వరకు పని చేస్తుంది. కాగా గతంలో వాషింగ్టన్‌లోనూ ఓ ఫౌంటెయిన్‌ వద్ద ఇదే తరహాలో మరో రోబో ధ్వంసమైంది. స్టీవ్ అనే పేరుగల సెక్యూరిటీ రోబోట్ వాటర్ ఫౌంటెన్‌లో మునిగి ఆత్మహత్యకు పాల్పడింది. అప్పుడు కూడా రోబో సూసైడ్‌ చేసుకుందనే వార్త చక్కర్లు కొట్టింది. అయితే అది జారిపడి ధ్వంసమైనట్లు విచారణలో తేలింది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.