Car Discount sale: దేశంలో పండుగ సీజన్ ప్రారంభమైనందున, కార్ల తయారీదారులు వినియోగదారులను ఆకర్షించడానికి డిస్కౌంట్ ఆఫర్లను అందిస్తున్నారు. హ్యుందాయ్.. హోండా కంపెనీలు తమ కార్లపై డిస్కౌంట్లను ప్రకటించాయి. ఈ కంపెనీలు ఇచ్చిన డిస్కౌంట్ ఆఫర్ల గురించి వివరంగా తెలుసుకుందాం.
హ్యుందాయ్ శాంట్రో పెట్రోల్ వేరియంట్ మీద రూ. 10,000, మిగిలిన ట్రిమ్‌లపై రూ. 25,000 క్యాష్ డిస్కౌంట్ అందిస్తోంది. శాంట్రోపై రూ. 10,000 ఎక్స్ఛేంజ్ బోనస్ కూడా ఇస్తోంది. అదేవిధంగా కస్టమర్‌లు వాహనంపై రూ .5000 కార్పొరేట్ డిస్కౌంట్ కూడా పొందవచ్చు. అలాగే, హోండా వాహనాలపై రూ .57,000 కంటే ఎక్కువ తగ్గింపు ఉంది.
హ్యుందాయ్ గ్రాండ్ ఐ 10..
గ్రాండ్ ఐ 10 నియోస్ గురించి చూస్తే, హ్యుందాయ్ గ్రాండ్ ఐ 10 పై రూ.35,000 క్యాష్ డిస్కౌంట్ లభిస్తుంది. ఇది టర్బో పెట్రోల్ వెర్షన్‌కి వర్తిస్తుంది. మరోవైపు, ఇది NA పెట్రోల్, టర్బో డీజిల్ వెర్షన్‌లపై రూ. 20,000 తగ్గింపు ఇస్తోంది. అయితే, CNG వెర్షన్‌పై డిస్కౌంట్ లేదు. ఇక్కడ మీరు రూ .10,000 ఎక్స్ఛేంజ్ బోనస్ అలాగే, రూ .5000 కార్పొరేట్ డిస్కౌంట్ కూడా పొందవచ్చు.
కోనా EV..
హ్యుందాయ్ నుంచి ఉన్న ఏకైక ఎలక్ట్రిక్ వాహనం కోనా ఈవీ. దీని మీద 1.5 లక్షల క్యాష్ డిస్కౌంట్ ఉంది. ఇవీ సెప్టెంబర్ నెలలో హ్యుందాయ్ కార్లపై ఉండే డిస్కౌంట్ ఆఫర్లు.
హోండా కార్లపై సెప్టెంబర్ డిస్కౌంట్ ఆఫర్లు ఇవే..
హోండా అమేజ్ ప్రీ ఫేస్‌లిఫ్ట్
సెప్టెంబర్ 2021 లో, హోండా కార్ ఇండియా గరిష్టంగా రూ .57,044 తగ్గింపును అందిస్తోంది. దీనిలో, మీరు కార్పొరేట్ డిస్కౌంట్‌తో పాటు క్యాష్ డిస్కౌంట్, ఎక్స్ఛేంజ్ బోనస్, లాయల్టీ బోనస్ పొందవచ్చు.. అమేజ్, జాజ్, ఆల్ న్యూ సిటీ, WR-V లతో సహా అన్ని వాహనాల మోడళ్లకు ఈ డిస్కౌంట్ వర్తిస్తుంది. ఈ ఆఫర్ సెప్టెంబర్ 30 వరకు చెల్లుతుంది. అదేవిధంగా..కస్టమర్లు రూ .5000 లాయల్టీ బోనస్, రూ .9000 హోండా కార్ ఎక్స్ఛేంజ్ బోనస్ కూడా పొందవచ్చు. అదే సమయంలో, మీరు 4000 రూపాయల కార్పొరేట్ డిస్కౌంట్ కూడా పొందే చాన్స్ ఉంది. అమేజ్ ఫేస్‌లిఫ్ట్ 2021 లో, మొత్తం తగ్గింపు రూ .18,000 అని మీకు తెలియజేద్దాం.
హోండా జాజ్
ఈ మోడల్ పై హోండా కంపెనీ .. మొత్తం డిస్కౌంట్ రూ .39,947. దీని మీద, మీరు రూ .10,000 నగదు తగ్గింపు లేదా FOC ఉపకరణాలు పొందుతారు. దీని ధర రూ .11,947. అదే సమయంలో, మీరు రూ. 10,000 ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా పొందవచ్చు. దీనితో పాటు, మీకు రూ .5000 లాయల్టీ బోనస్, రూ .9000 హోండా కార్ ఎక్స్ఛేంజ్ బోనస్ కూడా లభిస్తుంది. దీనిపై రూ.4000 కార్పొరేట్ డిస్కౌంట్ ఉంది.
హోండా WR-V
ఈ వాహనం రూ.39,998 తగ్గింపుతో లభిస్తుంది. దీని మీద, మీరు రూ .10,000 నగదు తగ్గింపు లేదా FOC ఉపకరణాలు పొందవచ్చు, దీని ధర రూ .11,998. కస్టమర్లు ఇక్కడ రూ. 10,000 కార్ ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా పొందవచ్చు. 4000 రూపాయల కార్పొరేట్ డిస్కౌంట్ కూడా అందుబాటులో ఉంది, కానీ ఇది ఎంచుకున్న కార్పొరేట్ కంపెనీలకు మాత్రమే.
హోండా సిటీ సెడాన్
హోండా సిటీ సెడాన్ మీద మీరు మొత్తం రూ.37,708 తగ్గింపు పొందుతారు. దీనిలో రూ.10,000 నగదు తగ్గింపు అందుబాటులో ఉంది లేదా మీరు రూ.10,708 విలువైన ఉపకరణాలను కూడా తీసుకోవచ్చు. కస్టమర్‌లు కారు ఎక్స్ఛేంజ్‌లో రూ.5000 వరకు తగ్గింపు పొందవచ్చు. ఇతర ప్రయోజనాలు రూ.5000 లాయల్టీ బోనస్, రూ .9000 హోండా కార్ ఎక్స్ఛేంజ్ బోనస్, రూ .8,000 కార్పొరేట్ డిస్కౌంట్.
గమనిక- వాహనాలపై ఆఫర్లు గ్రేడ్, లొకేషన్ స్పెసిఫిక్, మోడల్స్‌ని బట్టి మారవచ్చు. అదేవిధంగా డీలర్ టు డీలర్ కూడా మారవచ్చు. పూర్తి వివరాలకు మీ సమీపంలోని డీలర్లను నేరుగా సంప్రదించండి.