
ముందుగా మన కంప్యూటర్‌లో వాట్సాప్ లేటెస్ట్ వెర్షన్‌ను డౌన్ లోడ్ చేసుకుని, ఇన్‌స్టాల్ చేసుకోవాలి.

కంప్యూటర్‌లో ఇన్‌స్టాల్ అయిన వాట్సాప్‌ను ఓపెన్ చేయాలి. ఆ తరువాత స్మార్ట్ ఫోన్‌ను ఉపయోగించి వాట్సప్ క్యూఆర్ కోడ్‌ను స్కానింగ్ చేయాలి.

వాట్సాప్ లాగిన్ అయ్యాక చాట్ విండో ఓపెన్ చేయాలి. చాట్ విండో కుడివైపు పైభాగంలో వాయిస్, వీడియో కాల్ కోసం ఐకాన్స్ ఉంటాయి.

వీడియో కాల్ కోసం, ఆడియో కాల్ కోసం సంబంధిత ఐకాన్స్ క్లిక్ చేస్తే ఫోన్ మాదిరిగానే వెబ్ వెర్షన్‌లోనూ మాట్లాడుకోవచ్చు.