
ఎండలు మండిపోతున్నాయి.. భానుడి భగభగలకు ఇళ్లు నిప్పుల కొలిమిలా మారుతున్నాయి. దీంతో ఏసీల వాడకం విపరీతంగా పెరిగింది. అయితే చాలామంది ఎదుర్కొనే ప్రధాన సమస్య ఏంటంటే.. ఏసీ ఆన్ చేసినా గది చల్లబడకపోవడం. ఇలాంటప్పుడు టెక్నీషియన్లను పిలిస్తే.. చాలామంది గ్యాస్ లీక్ అయ్యింది.. రీఫిల్ చేయాలి అని వేలల్లో బిల్లు వేస్తుంటారు. అసలు మీ ఏసీలో గ్యాస్ ఎందుకు తగ్గుతుంది..? గ్యాస్ నింపడానికి ఎంత ఖర్చవుతుంది..? మీరు మోసపోకుండా ఉండాలంటే ఏం చేయాలో తెలుసుకుందాం..
ఏసీ పాతబడే కొద్దీ దాని సామర్థ్యం తగ్గడం సహజం. కానీ ఈ కింది కారణాల వల్ల కూలింగ్ త్వరగా తగ్గిపోతుంది.ఫిల్టర్లలో ధూళి పేరుకుపోతే గాలి రాక తగ్గి, ఏసీ ఎక్కువ శ్రమించాల్సి వస్తుంది. ఏసీని సీజన్ ప్రారంభంలో సర్వీసింగ్ చేయించకపోతే కాయిల్స్ బ్లాక్ అయ్యే అవకాశం ఉంది. మోటార్ లేదా కంప్రెసర్ సరిగ్గా పనిచేయకపోయినా గది చల్లబడదు. పైవన్నీ బాగున్నప్పటికీ కూలింగ్ రావడం లేదంటే 90శాతం అది గ్యాస్ లీక్ సమస్యే.
ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ఏసీలలో ప్రధానంగా మూడు రకాల గ్యాస్‌లను ఉపయోగిస్తున్నారు. మీ ఏసీ మోడల్‌ను బట్టి ఏ గ్యాస్ వాడాలో టెక్నీషియన్‌ను అడిగి తెలుసుకోండి.
సాధారణంగా 1.5 టన్నుల స్ప్లిట్ ఏసీలో 1.5 నుంచి 2 కిలోల గ్యాస్ పడుతుంది. దీని ధరలు ప్రాంతాన్ని బట్టి, వాడే గ్యాస్ నాణ్యతను బట్టి మారుతుంటాయి. 1.5 టన్నుల ఏసీకి గ్యాస్ నింపడానికి రూ.2,500 నుండి రూ.4,500 వరకు ఖర్చు కావచ్చు. టెక్నీషియన్ కేవలం గ్యాస్ నింపడమే కాకుండా లీకేజీ ఎక్కడ ఉందో కనుగొని దానిని రిపేర్ చేయాలి. లేకపోతే మళ్లీ నెల రోజుల్లోనే గ్యాస్ ఖాళీ అయిపోయే ప్రమాదం ఉంది.
మీ ఏసీకి ఉన్న స్టిక్కర్ మీద ఏ గ్యాస్ వాడాలో రాసి ఉంటుంది, అది చూసి మాత్రమే గ్యాస్ నింపించండి.