Redmi Phones: ‘రెడ్ మీ’ నుంచి రూ.12 వేలకే 5జీ ఫోన్.. ఫీచర్లు చూస్తే సూపర్

రెడ్ మీ నుంచి త్వరలో మరో కొత్త స్మార్ట్‌ఫోన్ ఇండియాలో లాంచ్ కానుంది. 5జీ సపోర్ట్‌తో వస్తున్న ఈ ఫోన్.. మార్కెట్లోని ఇతర ఫోన్లతో పోలిస్తే ధర తక్కువగానే ఉంది. నవంబర్ లేదా డిసెంబర్‌లో ఇండియన్ మార్కెట్లోకి లాంచ్ చేసే అవకాశముంది.

Redmi Phones: రెడ్ మీ నుంచి రూ.12 వేలకే 5జీ ఫోన్.. ఫీచర్లు చూస్తే సూపర్
Redme15c

Updated on: Nov 22, 2025 | 5:07 PM

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ రెడ్ మీ మధ్యతరగతి ప్రజల కోసం అతి తక్కుక ధరకే మొబైల్స్‌ను మార్కెట్లోకి తీసుకొస్తుంది. అత్యాధునిక ఫీచర్లతో కూడిన ఫోన్లను తక్కువ ధరకే అందుబాటులోకి తెస్తుంది. రూ.15 వేలలోపు ఉండే ఫోన్లపై ఎక్కువ దృష్టి పెట్టింది. ప్రస్తుతం 5జీ ఫోన్ కొనాలంటే రూ.15 వరకు ధర ఉంటుంది. కానీ రెడ్ మీ అంతకంటే తక్కువ ధరకే 5జీ సపోర్ట్ ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకొస్తుంది. త్వరలో భారత్‌లో రెడ్ మీ 15సీ 5జీ ఫోన్‌ను మార్కెట్లోకి తెస్తుంది. దీని ఫీచర్లు ఎలా ఉన్నాయంటే..?

ఈ నెల చివరిలో రెడ్ మీ 15సీ 5జీ ఫోన్ మార్కెట్లోకి రానుందని సమాచారం. సెప్టెంబర్‌లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కాగా.. ఇప్పుడు భారత్‌లో లాంచ్ చేయనుంది. మూడు వేరియంట్లలో ఫోన్ అందుబాటులోకి రానుంది. 4GB RAM + 128GB వేరియెంట్ ధర రూ.11,500గా ఉండగా.. 6GB RAM + 128GB వేరియంట్ ధర రూ.12,500గా నిర్ణయించారు. ఇక 8 GB+128 GB వేరియెంట్ ధర రూ.14,500గా ఉంది.

 

రెడ్ మీ 15సీ 5జీ ఫోన్ ఫీచర్లు ఇవే..

-MediaTek Dimensity 6300 చిప్‌సెట్

-6,000mAh బ్యాటరీ

-6.9 అంగుళాల (720×1,600 పిక్సెల్స్) డిస్‌ప్లే

-120Hz వరకు రిఫ్రెష్ రేట్

-240Hz వరకు టచ్ శాంప్లింగ్ రేట్ 810 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌

-33W వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌

-బ్లూటూత్ 5.4, Wi-Fi

-3.5mm హెడ్‌ఫోన్ జాక్‌

-IP64 రేటింగ్

-8 మోగా పిక్సెల్ సెల్పీ కెమెరా

-వెనుక భాగంలో 50 మెగా పిక్సె్ల్ కెమెరా

 

మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి