లుక్‌ చూస్తే ఎవ్వరికైనా మతిపోవాల్సిందే.. Harley-Davidson Sprint 440 ధర తెలిస్తేనే షాకవ్వక తప్పదు

ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ Harley-Davidson బైక్ ప్రియులకు కొత్త మోడల్‌ను పరిచయం చేసింది. Hero MotoCorp భాగస్వామ్యంతో అభివృద్ధి చేసిన Sprint 440 మోటార్‌సైకిల్‌ను EICMA 2026లో అధికారికంగా ఆవిష్కరించింది. ఆకర్షణీయమైన క్రూయిజర్ డిజైన్, 440cc ఇంజిన్, ఆధునిక ఫీచర్లతో ఈ బైక్ ప్రత్యేకంగా నిలుస్తోంది. ఇప్పటికే అందుబాటులో ఉన్న వివరాలు చూస్తే, క్లాసిక్ క్రూయిజర్ లుక్‌తో పాటు రోజువారీ ప్రయాణాలకు అనువైన పనితీరును అందించేలా దీన్ని రూపొందించినట్లు తెలుస్తోంది.

లుక్‌ చూస్తే ఎవ్వరికైనా మతిపోవాల్సిందే.. Harley-Davidson Sprint 440 ధర తెలిస్తేనే షాకవ్వక తప్పదు
Harley Davidson Sprint 440

Updated on: Nov 11, 2026 | 6:00 AM

కొత్త Harley-Davidson Sprint 440లో 440cc సింగిల్ సిలిండర్ ఎయిర్, ఆయిల్ కూల్డ్ ఇంజిన్‌ను అందించారు. ఇది 6,000rpm వద్ద 26.7bhp పవర్, 4,000rpm వద్ద 38Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇందులో 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో పాటు అసిస్ట్ అండ్ స్లిప్పర్ క్లచ్‌ను అమర్చారు. కంపెనీ వెల్లడించిన వివరాల ప్రకారం, ఈ బైక్ లీటరుకు సుమారు 34 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుంది. 9 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌ను కూడా అందించారు.

ఆధునిక ఫీచర్లు!

డిజైన్ విషయానికి వస్తే Sprint 440లో టియర్‌డ్రాప్ ఆకారపు ఫ్యూయల్ ట్యాంక్, రౌండ్ హెడ్‌ల్యాంప్, వెనక్కి వంగిన హ్యాండిల్‌బార్, స్టెప్డ్ సీటు, లో-మౌంటెడ్ ఎగ్జాస్ట్ ఉన్నాయి. దీని సీటు ఎత్తు కేవలం 671 మిల్లీమీటర్లుగా ఉంది. ముందు భాగంలో 19 అంగుళాల, వెనుకవైపు 17 అంగుళాల అల్లాయ్ వీల్స్‌ను అమర్చారు.

ఫీచర్లలో భాగంగా 3.5 అంగుళాల కలర్ TFT డిస్‌ప్లే, ఫుల్ LED లైటింగ్, USB-C ఛార్జింగ్ పోర్ట్ ఉన్నాయి. భద్రత కోసం ముందు 320mm, వెనుక 240mm డిస్క్ బ్రేకులతో పాటు ABS అందించారు. సస్పెన్షన్ విషయానికి వస్తే ముందు 43mm USD ఫోర్కులు, వెనుక 7 స్థాయిల్లో సర్దుబాటు చేసుకునే ట్విన్ షాక్ అబ్జార్బర్లు ఉన్నాయి. ఈ బైక్ గ్రౌండ్ క్లియరెన్స్ 147 మిల్లీమీటర్లు.

భారత్‌లో రూ.3.5 లక్షలు

ధర విషయానికి వస్తే, యూకేలో Harley-Davidson Sprint 440 ప్రారంభ ధరను 4,995 పౌండ్లుగా ప్రకటించారు. అమెరికాలో దీని ధర 6,000 డాలర్లుగా ఉండనుంది. అక్కడ 2027లో డెలివరీలు ప్రారంభం కానున్నాయి. అమెరికాలోని యార్క్, పెన్సిల్వేనియా ప్లాంట్‌లో ఈ బైక్ తుది అసెంబ్లీ చేపట్టనున్నారు.

భారత మార్కెట్లో Sprint 440 ధర సుమారు రూ.3.5 లక్షలుగా ఉండవచ్చని అంచనాలు వినిపిస్తున్నాయి. అయితే భారత్‌లో విడుదల తేదీ, అధికారిక ధరను కంపెనీ ఇంకా ప్రకటించలేదు. 440cc ఇంజిన్, క్రూయిజర్ డిజైన్‌తో రానున్న ఈ బైక్ దేశీయ మార్కెట్లోకి ఎప్పుడు వస్తుందోనని బైక్ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Loading...
Unable to load recommendations.
Follow Us