Google Messages App: గూగుల్‌ కొత్త ఫీచర్‌.. మెసేజ్‌కు సమయం సెట్‌ చేసుకునే సదుపాయం.. ఎలాగంటే..

|

Mar 02, 2021 | 12:05 AM

Google Messages App: రోజురోజుకు టెక్నాలజీ అభివృద్ధి చెందడంతో పాతవన్ని పోయి కొత్తవి అందుబాటులోకి వస్తున్నాయి. ఇక సెల్‌ఫోన్‌ వంటివి అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి ఉత్తరాలు.

Google Messages App: గూగుల్‌ కొత్త ఫీచర్‌.. మెసేజ్‌కు సమయం సెట్‌ చేసుకునే సదుపాయం.. ఎలాగంటే..
Follow us on

Google Messages App: రోజురోజుకు టెక్నాలజీ అభివృద్ధి చెందడంతో పాతవన్ని పోయి కొత్తవి అందుబాటులోకి వస్తున్నాయి. ఇక సెల్‌ఫోన్‌ వంటివి అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి ఉత్తరాలు మాయమైపోయాయి. మొబైళ్లు అందుబాటులోకి వచ్చిన తర్వాత క్షణాల్లో మెసేజ్‌లు చేరవేసే టెక్నాలనీ వచ్చేసింది. ఇక సోషల్‌ మీడియా వచ్చిన తర్వాత పరిస్థితుల్లో అనేక మార్పులు వచ్చాయి. సోషల్‌ మీడియా వాడకం అనేది రోజురోజుకు పెరిగిపోతుంది. దీంతో సాధారణ మెసేజ్‌లను వాడే వారి సంఖ్య పడిపోయింది. టెలిగ్రామ్‌, వాట్సాప్‌, మెసేంజర్‌ తదితర యాప్‌లను వాడే వారి సంఖ్య విపరీతంగా పెరిగియింది. వివిధ సంఘాలు, సంస్థలు సైతం ప్రత్యేకంగా గ్రూపులను ఏర్పాటు చేసుకుని సమాచారాన్ని అన్ని స్థాయిల వారికి సింపుల్‌గా క్లిక్‌తో పంపించేస్తున్నారు. అయితే మెసేజ్ ను నిర్ణీత సమయానికి పంపించేలా సెట్ చేయగలిగే సాంకేతికత మాత్రం ఈ సోషల్ మీడియా యాప్ లలో లేదు. యూజర్లకు ఇది ఒక అసౌకర్యంగా మారింది. దీనిని గమనించిన గూగుల్‌ ‘మెసేజ్‌ షెడ్యూలింగ్‌’ అనే ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ ఫీచర్ ద్వారా మనం ఓ మెసేజ్ ను టైప్ చేసి అవతలి వ్యక్తికి పంపాల్సిన సమయం ముందుగానే షెడ్యూల్‌ పెట్టుకోవచ్చు. ఆ సమయానికి ఆ మెసేజ్ అవతలి వ్యక్తికి పంపబడుతుంది. అయితే ఈ ఫీచర్‌ ప్రస్తుతం గూగుల్‌ మెసేజింగ్‌ యాప్‌లో మాత్రమే అందుబాటులో ఉంది.

ఈ యాప్ ప్లే స్టోర్‌ అందుబాటులో ఉంటుంది. డౌన్ లోడ్ చేసుకున్న అనంతరం యాప్ ఓపెన్ చేయగానే.. ఈ యాప్‌ ను డీఫాల్ట్‌ యాప్‌గా మార్చుకోవాల్సి ఉంటుంది. అనంతరం పాత మెసేజ్‌ యాప్‌లో ఇప్పటివరకు ఉన్న మెసేజ్‌లన్నీ ఇందులోకి వచ్చేస్తాయి. కింది కుడి వైపు ఉన్న మెసేజ్ ఐకాన్‌ను క్లిక్‌ చేయాల్సి ఉంటుంది. అనంతరం మెసేజ్‌ పంపాల్సిన వారి నంబర్ ఎంటర్ చేసి.. మెసేజ్‌ బాక్స్‌లో మనం పంపలనుకుంటున్న మెసేజ్‌ను టైప్‌ యాలి. అనంతరం ఎస్‌ఎంఎస్‌ సెండ్‌ బటన్‌పై కొన్ని సెకండ్ల పాటు లాంగ్ ప్రెస్‌ చేయాల్సి ఉంటుంది.

ఇక మనకు షెడ్యూల్‌ సెండ్‌ అనే ఆప్షన్‌ను కనిపిస్తుంటుంది. దానిపై క్లిక్‌ చేసి మనం ఏ సమయానికి ఆ మెసేజ్‌ను పంపాలనుకుంటున్నామో ఎంటర్ చేయాలి. అనంతరం సెండ్‌పై క్లిక్‌ చేస్తే ఆ మెసేజ్‌ షెడ్యూల్‌గా మారిపోతుంది. ఒక వేళ మనం షెడ్యూల్‌ చేసిన సమయాన్ని మార్చుకోవాలనుకుంటే ఆ సదుపాయం కూడా ఉంది.

ఇవి చదవండి:

మార్స్ పై నాసా రోవర్ ని కంట్రోల్ చేస్తున్నదెవరు ? ఆశ్చర్యం !ఇంకెవరు? ప్రవాస భారతీయుడే !

Aadhaar Card: స్మార్ట్‌ఫోన్‌లో కూడా ఆధార్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.. ఎప్పుడైనా, ఎక్కడైనా ఈ సింపుల్ స్టెప్స్‌తో..